టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారుల​​కు బెదిరింపులు: మనోహర్‌రెడ్డి | State Legal Cell President Manohar Reddy Comments On Tdp | Sakshi
Sakshi News home page

టీడీపీ కుట్రలు.. పోలీసు అధికారుల​​కు బెదిరింపులు: మనోహర్‌రెడ్డి

Published Mon, May 13 2024 3:30 PM | Last Updated on Wed, May 15 2024 12:31 PM

State Legal Cell President Manohar Reddy Comments On Tdp

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, గుంటూరు: నిరాశా నిస్పృహలతో టీడీపీ నేతలు రాష్ట్రవాప్తంగా పలుచోట్ల హింసకు, దౌర్జన్యాలకు దిగుతున్నారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో హింసకు,దౌర్జన్యాలకు తావులేకుండా ఓటర్ల ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్దితి ఉండాలని అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ బాపట్లలో నందిగం సురేష్, ఎన్నికల ఏజంట్లు ప్రయాణిస్తున్న కారును టీడీపీ కార్యకర్తల  ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారని ధ్వజమెత్తారు.

ఏబీ వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజీ ఆర్‌పీ ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని రానుంది టీడీపీ ప్రభుత్వం అని.. అనుకూలంగా వ్యవహరించాలంటూ జిల్లాల్లోని పోలీసు అధికారులకు ఫోన్‌లు చేసి బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల సంఘం తక్షణం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలీంగ్ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుధ్దం అని, అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement