మాట్లాడుతున్న జడ్జి అజయ్‌కుమార్ జాదవ్
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల) : ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగొద్దని, రాజ్యాంగపరంగా వచ్చిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని మెట్‌పల్లి జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ తెలిపారు. మెట్‌పల్లి అర్బన్‌కాలనీలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కులమతాలకు అతీతంగా అందరు సమైక్యం గా ఉండాలని, తద్వారా సమస్యల పరి ష్కారం సులువు అవుతుందని పేర్కొన్నారు. అర్హుందరికీ ఉచిత న్యాయ సహాయం కోర్టుల్లో తప్పకుండా అందుతుందన్నారు. మండల లీగల్ సెల్ ఎళ్లవేళలా తోడుంటుందన్నారు. అధికారులు ప్రజలకు అవసరమైన సమస్యలు పరిష్కరించకుంటే కేసు వేయొచ్చన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్థానిక సమస్యలను ఆయనకు ఏకరువు పెట్టారు.
ఎలాంటి విషయంలోనైనా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి మోసపోవద్దని న్యాయమూర్తి సూచించారు. చట్టాలను చేతిలోకి తీసుకోవద్దని, అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తహసీల్దార్ సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్పులుఇస్తే తప్పకుండా పత్రాలు రాయించుకోవాలని సూచించారు. సదస్సులో వెంకట్రావుపేట సర్పంచ్, న్యాయవాది కొమిరెడ్డి లింగరెడ్డి, మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం శంకర్‌రెడ్డి, ఏజీపీ ఎల్లాల మధుసూదన్‌రెడ్డి, ఎస్సై శంకర్‌రావు, ఆర్‌ఐ కృష్ణ, న్యాయవాదులు కోటగిరి వెంకటస్వామి, మగ్గిడి వెంకటనర్సయ్య,ఓగులపు శేఖర్, తెడ్డు ఆనంద్, సురక్ష పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment