
వాలంటీర్లను ఉద్దేశించి అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై..
సాక్షి, కృష్ణా: వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్‌సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
బుధవారం పలువురు వాలంటీర్లతో కలిసి వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు విజయవాడ సీపీలో పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ను పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది.
సాక్షితో న్యాయవాదులు..
వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనాలో మరింత ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతోంది. పవన్ కల్యాణ్ మాటలతో సభ్యసమాజంలో అలజడి రేగుతోంది. కానీ, ఆ మాటల్ని వాలంటీర్లు పట్టించుకోవద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు.
అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ కల్యాణ్‌కు ఏ నిఘా సంస్థ చెప్పిందో వెల్లడించాలి. వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: పవన్‌ను చీల్చిచెండాడిన పోసాని