
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆపరేషన్ కమలం వర్కవుట్ అవుతోంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌లో ‘ఆపరేషన్ కమలం’ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి సైతం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు దామోదర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు దామోదర్‌రెడ్డి. కాగా, పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ మరో ప్రకటనలో వెల్లడించారు.
ఇదీ చదవండి: కేసీఆర్ కూతుర్ని కాబట్టే నన్ను టార్గెట్ చేశారు