
సాక్షి, అనంతపురం : ఏపీలో పోలీసు వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం లీగల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. న్యాయపోరాటంతో టీడీపీ నేతలకు బుద్ది చేపుతామని అన్నారు.
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడినా.. ఆయనపై ఎలాంటి కేసులు లేవని.. చంద్రబాబు నాయుడు నైతిక విలువలు పాటించట్లేదని ఆయన విమర్శించారు. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment