
సాక్షి, అమరావతి: టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, నవరత్నాల కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి కోరారు. అనంతరం మీడియాతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.
కౌంటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజాతీర్పును మార్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని మల్లాది విష్ణు హెచ్చరించారు. సజ్జలపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌డ్రా చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment