దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
- ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
- ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
- తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నటు పేర్కొంది. ఈ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనుండగా, ఏపీలో ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లె సీఈసీ తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అదే సమయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సీఈసీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్
- రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు
- రాష్ట్రంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు
- రాష్ట్రంలో ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్
- రాష్ట్రంలో ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
- రాష్ట్రంలో ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన
- రాష్ట్రంలో ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు
- మే 13న ఒకేరోజు ఏపీలో అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు
- దరఖాస్తు చేసిన వారందరికీ ఓటరు కార్డులు పంపిణీ చేస్తాం
- ఓటరు కార్డు లేకుంటే 12 గుర్తింపు కార్డులను చూపించవచ్చు
- ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం
- రాష్ట్రంలో మొత్తం 46 వేల పోలింగ్ కేంద్రాలు
- 85 ఏళ్లు దాటిన వారికి ఇంటివద్దే ఓటు వేసే అవకాశం ఉంది
- క్రిమినల్ కేసులు ఉన్నవారు పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి
- క్రిమినల్ కేసులు ఉంటే ఆయా పార్టీల వెబ్ సైట్ లో వివరాలు ఉంచాలి
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతాం
- ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం
- ఈవీఎంలు, వీవీప్యాట్ లను ఇప్పటికే పరీక్ష చేశాం
- ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
కాగా, 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 151 స్థానాలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇక టీడీపీ 23 స్థానాలు గెలుచుకోగా, జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. గత 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలోని 25 స్థానాల్లో 22 సీట్లను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment