సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను
ఇదిలా ఉంటే.. కోటి రూపాయల పరిహారం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే రూ. కోటి చెక్కు ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. అయితే, చంద్రబాబు వెళ్లిన తర్వాత అధికారులు మాట మర్చారు. డెడ్‌బాడీలను ఇంటికి తీసుకెళ్లే సమయంలో దారి ఖర్చులకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తామని అధికారులు అంటున్నారు. రూ కోటి పరిహారం ఇస్తేనేగాని ఇంటికి తీసుకెళ్లమంటున్న బంధువులు.. రూ.10 వేల కోసం కుక్కర్తి పడేవాళ్లలా కనిపిస్తున్నామా అంటూ నిలదీశారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా!?
కాగా, ఎక్కడో మదనపల్లిలో ఓ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఫైళ్లు దగ్ధమైతేనే ఏదో భారీ ఉపద్రవం ముంచుకొచ్చినట్లు హడావిడి చేసి, ఆగమేఘాల మీద హెలికాఫ్టర్‌లో డీజీపీని పంపి సీఎం చంద్రబాబు హడావుడి చేశారు. విశాఖలో ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తే, ఇంత మంది ప్రాణాలు పోతే స్పందించకుండా తాపీగా ప్రభుత్వ శాఖలపై సమీక్ష చేస్తూ కూర్చోవడం విమర్శలకు తావిస్తోంది.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ, తనను మించిన విజనరీ, సమర్థుడు ఈ దేశంలోనే లేడని తనకు తానే డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. రియాక్టర్ ప్రమాద ఘటనలో మాత్రం చతికిలబడ్డారు. చంద్రబాబు పరిపాలనలో బేలతనం ఈ దుర్ఘటనతో స్పష్టంగా బయటపడింది.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో హోం శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలోనే హోం మంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి కూడా సహాయక చర్యలపై వారితో సీఎం చంద్రబాబు సమీక్షించలేదని తెలిసింది. చంద్రబాబు సీఎం సమీక్ష అనంతరం కూడా సచివాలయంలోనే ఉన్న హోం మంత్రి అనిత.. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు.
అచ్యుతాపురం ఘటనపై ఆమె కనీసం స్పందించ లేదు. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదంలో మృతుల వివరాలు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అంతెందుకు రాత్రి 7 గంటల వరకు అనకాపల్లి కలెక్టర్‌తో సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. సచివాలయంలోనే ఉన్నా, హోం మంత్రి, డీజీపీలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అర్ధరాత్రయినా ప్రమాద స్థలానికి మంత్రులుగానీ, ఉన్నతాధికారులుగానీ చేరుకోలేదు. ప్రెస్ నోట్లు, మీడియాలో దిగ్భ్రాంతులకే పాలనా యంత్రాంగం పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment