
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇండియన్ బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తులను వేలం వేయడానికి ఆ బ్యాంక్ సిద్ధమైంది.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్ నుంచి సుమారు రూ. 409 కోట్లు రుణం తీసుకున్న గంటా అండ్ కో ఎగ్గొట్టింది.
తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆగష్టు 8న సంబంధిత ఆస్తులు వేలం వేస్తామని పత్రిక ప్రకటనలో ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. లోన్‌కు టీడీపీ ఎమ్మెల్యే గంటా సహా మరో 8 మంది హామీదారులు ఉండగా, రుణాలు తీసుకోవడం.. తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టడాన్ని టీడీపీ నేతలు అలవాటుగా చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment