
విశాఖపట్నం, సాక్షి: నాకు మాత్రం ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉంది.. ఎన్నికలొచ్చినప్పుడల్లా నియోజకవర్గం మారే గంటా శ్రీనివాస రావు ఆవేదన ఇది. అయితే మరోస్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశించడంపై గంటా గరం గరంగా ఉన్నారు.
‘‘నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది. నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు. విశాఖ నార్త్ లో వేరే ఇన్ ఛార్జ్ ని పెట్టమన్నా. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది. కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు. అది నాకు 150కిలోమీటర్ల దూరం. పైగా జిల్లా కూడా వేరు కావడంతో ఆలోచనలో పడ్డా.
.. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు. కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది. వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా?. పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను.రెండు రోజుల్లో నిర్ణయం ఏంటన్నది చెప్తాను. ప్రతీ ఎన్నికల్లో నేను నియోజకవర్గం మారుతున్నా. కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది అని గంటా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment