
నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు.
సాక్షి, పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం కనపర్రులో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టీడీపీ నేతలు కారుతో ఢీకొట్టారు. పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సర్పంచ్ వెంకటేశ్వర్లుపై కూడా టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. నిన్నటి నుంచి గ్రామంలో రెచ్చగొట్టే చర్యలతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. ప్రశ్నించిన సర్పంచ్ వెంకటేశ్వర్లుపైనా టీడీపీ నేతలు దాడికి యత్నించారు.