సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల దాడి ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సహా కొంతమందిపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. 307,143,147,148,324,506 రెడ్ విత్ 149 సెక్షన్ కింద కేసు నమోదైంది. బ్రహ్మారెడ్డిని ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. చల్లా మోహన్‌రెడ్డి ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల దాడిలో చల్లా మోహన్‌రెడ్డి గాయపడ్డారు.
కాగా, శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాలు అత్యంత కిరాకతంగా ప్రవర్తించారు. విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి.. గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు.
విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు.
చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం
Comments
Please login to add a commentAdd a comment