Brahma Reddy
-
టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
సాక్షి, నరసరావుపేట: ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశాడు.. ఓటర్లను బెదిరించాడు.. ఎన్నికలు సక్రమంగా జరగలేదు’.. అని రెండ్రోజులుగా గగ్గోలు పెడుతున్న టీడీపీ, పచ్చ మీడియా వర్గాలు ఎందుకు ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని కోరలేదన్న ప్రశ్న అందరిలోనూ వేధిస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి.ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటూ అభివృద్ధి బాటపట్టిన మాచర్లను కావాలనే టీడీపీ అనుకూల మీడియా చంబల్‌లోయ అంటూ గత కొన్నినెలలుగా విషప్రచారం చేస్తోంది. అదే నిజమైతే అక్కడ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో అరాచకం సృష్టించాడు.. రీపోలింగ్ జరపండి అని ఈసీని కోరాలిగానీ అటువంటి చర్యలేవి తెలుగుదేశం పార్టీ, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తీసుకోలేదు, అంటే.. ఎన్నికల వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా? తాము చేసిన రిగ్గింగ్ వృథా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదన వినిపిస్తోంది.విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన జూలకంటి..నిజానికి.. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లలో కారంకొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయిగేట్, తుమృకోట, జెట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచర్లలో పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడిచేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు.అలాగే, రెంటచింతల మండలం తుమృకోటలో ఏజెంట్లుగా ఉన్న షేక్ సైషావలీ, షేక్ జానీబాషాలను బయటకు లాగి విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమృకోటలో నాలుగు ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకులాగి దాడిచేసి రిగ్గింగ్‌లకు తెగబడ్డాడు. 137, 138, 139, 140, 141 బూత్‌లలో కూర్చున్న వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకులాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. అంతేకాక.. మాచర్లలో బ్రహ్మారెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. ఇందుకు పోలీసుశాఖ పూర్తి సహాయ సహకారాలు అందించిందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.వీడియో బయటకు వచ్చాక గగ్గోలు..ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ, పచ్చమీడియా పోలింగ్ రోజు, తరువాత వారం రోజులపాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. టీడీపీ రిగ్గింగ్ చేయడంతో అడ్డుకోవడానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఈవీఎంలు పగలగొట్టాడు అని వార్తలు సైతం పెద్దగా రాయలేదు. కారణం పాల్వాయిగేట్‌లో టీడీపీ చేసిన రిగ్గింగ్ బయటపడుతుందన్న ఒకేఒక్క కారణంతో. అయితే, నిజమో కాదో తెలియని ఓ ఈవీఎం పగలగొడుతున్న వీడియో బయటకు రాగానే ఒక్కసారిగా మాచర్లలో అరాచకం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.అయినా సరే.. ఏ టీడీపీ నేత కూడా ఈవీఎంలు పగలినచోట్ల రీపోలింగ్ జరపమని మాటవరుసకైనా అనలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడంలేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం జూలకంటి బ్రహ్మారెడ్డి వర్గం చేసిన అరాచకాలు బయటపడితే వారి కుట్రలు ప్రజలకు తెలిసిపోతాయని.రీపోలింగ్ కోరిన పిన్నెల్లి..మరోవైపు.. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి రెండుసార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ మే 13వ తేదీ మ.3.33 గంటలకు.. సా.6.10 గంటలకు ఈసీకి రెండు లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు. ఆ గ్రామాలు కారంపూడి మండలంలో చింతపల్లి, ఒప్పిచర్ల, పేటసన్నెగుండ్ల, పెదకోడగుండ్ల, రెంటచింతల మండం తుమృకోట, పాల్వాయిగేట్, జెట్టిపాలెం, వెల్దుర్తి గ్రామాలున్నాయి. అయినా, ఈ లేఖలను ఎన్నికల సంఘం పట్టించుకున్న పాపాన పోలేదు.టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా.. వైఎస్సార్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని పదేపదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్‌కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లు ఎక్కుతారు? ఈ చిన్న లాజిక్‌వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని సృష్టమవుతోంది. -
నేను ఎక్కడికి పారిపోలేదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం
సాక్షి, పల్నాడు: ‘టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం..’ అని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని పిన్నెల్లి ప్రకటించారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోసి.. ఆయన మాత్రం నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదు. అటువంటి వ్యక్తి నేను పారిపోయానని చెప్పటం హాస్యాస్పదంగా ఉంది. ఏడు మర్డర్ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదు. నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డిని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు తీసుకొచ్చి పల్నాడులో ఫ్యాక్షన్‌కు ఆజ్యం పోశారు. కారెంపూడి మండలంలోని చింతపల్లి, ఒప్పిచర్ల, రెంటచింతల మండలంలో తుమృకోట, పాలవాయిగేటు గ్రామాల్లో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు మా ఏజెంట్లను తరిమికొట్టి గొడవలు సృష్టించారు. కారెంపూడి సీఐ నారాయణస్వామి ద్వారా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ గ్రామాల్లో గొడవలు జరుగుతాయని బందోబస్తు పెంచాలని హైకోర్టు నుంచి ముందుగానే ఆర్డర్ తీసుకొచ్చి ఎస్పీకి ఇచ్చినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజు గొడవలు జరిగినా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను. మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర నాకు లేదు. నేను ఎన్నడూ పారిపోలేదు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజికవర్గాన్ని ఒకటి చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మారెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు కలిసి గొడవలు చేశారు. టీడీపీని గెలిపించేందుకు సీఐ నారాయణస్వామి దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర నాది కాదు. నేను ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. మీ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చందాలు వసూలు చేసి ఇల్లు కట్టుకుని చందాల నాయకుడుగా మారిన బ్రహ్మారెడ్డి నన్ను విమర్శించడం సిగ్గుచేటు.’ అని పిన్నెల్లి రామకృష్ణరెడ్డి చెప్పారు. -
అజ్ఞాతంలోకి మాచర్ల టీడీపీ ఇన్ ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి
-
చంద్రబాబు డైరెక్షన్.. బ్రహ్మారెడ్డి యాక్షన్
సాక్షి, నరసరావుపేట: దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు మాచర్ల ఘటనలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజలను, రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ వాళ్లే రాళ్లు, మారణాయుధాలతో దాడులకు పాల్పడి.. వైఎస్సార్సీపీ బీసీ నేతలను తీవ్రంగా గాయపరిచి.. పట్టణ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి.. తీరా తమపైనే వైఎస్సార్సీపీ వర్గాలు దాడికి దిగాయని ఆందోళనలకు తెరలేపడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్టగా నిలిచింది. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ, ఎంపీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగింది. ఈ నేపథ్యంలో క్యాడర్‌ను కాపాడుకునేందుకు ప్రతిప„క్ష పార్టీ పడరాని పాట్లు పడుతోంది. ఇందులో భాగంగా ఏదో ఒక వివాదం సృష్టించి.. చంద్రబాబు మొదలు కార్యకర్త వరకు రచ్చ చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఏడాది కిందట హత్యకు గురైన చంద్రయ్య, జాలయ్య ఘటనలో సైతం ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా టీడీపీ నానా యాగీ చేసింది. ఇంత చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ ఉనికి కాపాడుకోవాలనే దింపుడు కల్లం ఆశతో కుట్ర రాజకీయాలకు తెర లేపింది. ఇలాంటి రాజకీయాలను పెంచి పోషించడంలో ఆరితేరిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇందుకు మాచర్లను వేదికగా ఎంచుకున్నారు. తను అనుకున్నది అనుకున్నట్లు చేయడానికి సరిగ్గా పనికొస్తాడని గమనించి ఫ్యాక్షన్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి భుజంపై చేయి వేశారు. ఒక పథకం ప్రకారం బాబు డైరెక్షన్ చేస్తుంటే.. జూలకంటి అమలు చేస్తున్నారు. ఇతన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నియమించినప్పటి నుంచి చోటుచేసుకున్న వరుస సంఘటనలు చూసి స్థానికులు ‘ఇదేం ఖర్మ మనకు’ అని వాపోతున్నారు. ప్రతి దానికీ రాజకీయ రంగు పులుముతున్న టీడీపీ, చంద్రబాబు ఉనికి పాట్ల రాజకీయం చూసి విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. ఇదీ జూలకంటి నేపథ్యం.. 2001 మార్చి 10న దుర్గి పోలీస్‌స్టేషన్‌లో కండీషన్ బెయిల్‌పై సంతకాలు చేసేందుకు వెళ్తున్న పులుసు నాగిరెడ్డి, సాంబిరెడ్డి, అతని కొడుకు కోటిరెడ్డి, మరో నలుగురిని లారీతో ఢీకొట్టించి.. కత్తులు, బాంబులతో దాడి చేయించి వెంటాడి మరీ బ్రహ్మారెడ్డి హత్య చేయించారు. ఏడుగురిని హత్య చేసిన కేసులో బ్రహ్మారెడ్డి ప్రధాన నిందితుడిగా కేసు నమోదైంది. ఈ నెల 14వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ ముందు తాగి రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులపై కేసు నమోదు చేసినందుకు బ్రహ్మారెడ్డి తన వర్గంతో వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకువెళ్లి, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీస్‌స్టేషన్, రహదారిపై వెళుతున్న వాహనాలు అడ్డగించి, భయాందోళన కలిగించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు. 2014, 2019 సాధారణ ఎన్నికలు, 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బ్రహ్మారెడ్డి ప్రవర్తించడంతో మరో నాలుగు కేసులు నమోయ్యాయి. నిన్నటి ఘటనతో కలిపి మొత్తంగా ఏడు కేసులున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉండి కొన్ని ఏళ్లపాటు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్న బ్రహ్మారెడ్డిని చంద్రబాబు తిరిగి రప్పించడంతో, మాచర్ల ప్రాంతంలో తిరిగి ఫ్యాక్షన్ కు తెరలేపుతున్నారు. బ్రహ్మారెడ్డి తన పాత అనుచరులతో వర్గాలను ప్రోత్సహిస్తున్నాడు. నిత్యం ఉద్రిక్తత నెలకొనేలా ఇతని వ్యవహారం ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. 20 ఏళ్లుగా ఒక్క ఫ్యాక్షన్ హత్య జరగని మాచర్లలో బ్రహ్మారెడ్డి ఇన్చార్జిగా వచ్చిన ఏడాది కాలంలోనే నిత్యం ఏదో ఒక అలజడి రేగుతోందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పల్నాడు అభివృద్ధికి అడ్డంకులు చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు పల్నాడు అభివృద్ధికి పని చేయలేదు. మూడున్నరేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసింది. పల్నాడు ప్రత్యేక జిల్లా, వరికపూడిసెల ప్రాజెక్టు, మెడికల్ కళాశాల, జాతీయ, రాష్ట్ర రహదారులు, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మన్నన అందుకుంటోంది. దీంతో టీడీపీ ఉనికి కోల్పోతుండటంతో ప్రభుత్వంపై కక్షకట్టిన చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారానికి తెరలేపారు. అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. మాచర్లపై ఏమాత్రం చంద్రబాబుకు ప్రేమ, బాధ్యత ఉన్నా, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న బ్రహ్మారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రహ్మారెడ్డికి నెల నెలా ఖర్చులకు డబ్బులు ఇచ్చి మరీ చంద్రబాబు పల్నాడులో ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. -
పల్నాడు: మాచర్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సహా కొంతమందిపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. 307,143,147,148,324,506 రెడ్ విత్ 149 సెక్షన్ కింద కేసు నమోదైంది. బ్రహ్మారెడ్డిని ఏ1గా పోలీసులు పేర్కొన్నారు. చల్లా మోహన్‌రెడ్డి ఫిర్యాదుతో బ్రహ్మారెడ్డిపై కేసు నమోదైంది. టీడీపీ నేతల దాడిలో చల్లా మోహన్‌రెడ్డి గాయపడ్డారు. కాగా, శుక్రవారం రాత్రి మాచర్లలో తెలుగుదేశం పార్టీ గూండాలు అత్యంత కిరాకతంగా ప్రవర్తించారు. విచక్షణ కోల్పోయి... బలంకొద్దీ బండరాళ్లతో బాదారు. కర్రలతో తరిమి తరిమి దారుణంగా కొట్టి.. గాయపరిచారు. మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారం చేశారు. విలేకరుల సమావేశం పేరిట పక్కా పథకం ప్రకారం రాడ్లు, కర్రలు ముందే తెచ్చుకుని... తమను అడ్డుకున్నారంటూ ఏ సంబంధం లేని ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హతమార్చబోయారు. ‘‘మా నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డి. మేం ఎవరినైనా చంపేస్తాం’’ అని కేకలు వేస్తూ పట్టణ నడిబొడ్డున వీరంగం సృష్టించారు. అంతు చూస్తామంటూ సవాళ్లు విసిరారు. చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం -
‘దందా’ పోలీసు!
♦ పోలీసుస్టేషన్లలో ప్రైవేట్ సెటిల్మెంట్లు ♦ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో విధులు ♦ ఆరోపణలొస్తున్నా బదిలీ లేకుండా తిష్ఠ ♦ స్టేషన్ల సుందరీకరణ ముసుగులో నొక్కుళ్లు ♦ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసుల్లో ఆవేదన ♦ కొత్త బాస్ త్రివిక్రమ వర్మ ఓ లుక్ వేయాల్సిందే! సీఎం త్రివిక్రమవర్మ... జిల్లా పోలీసు బాస్‌గా బ్రహ్మారెడ్డి స్థానంలో బాధ్యతలు స్వీకరించి బుధవారానికి నెల పూర్తవుతోంది! తొలి రోజు నుంచే ఆయనకు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి! వాటిలో మిగతావాటి మాటెలా ఉన్నా సొంత శాఖనే ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది! అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇద్దరు పోలీసు అధికారులను ఇటీవలే వీఆర్‌కు పంపించిన ఆయన తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు! కేసు నమోదులో నిర్లక్ష్యం వహించిన మరో ఇద్దరు పోలీసులపై కొరడా ఝుళిపించారు! వారే గాకుండా కొంతమంది స్టేషన్ అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారని తోటి పోలీసులే లోలోన ఆవేదన చెందుతున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు! అలాంటివారిని కొత్త బాస్ ఎలా దారిలో పెడతారో వేచి చూడాల్సిందే! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లా పోలీసు శాఖను సంస్కరించాలనే డిమాండ్లు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. కొన్ని పోలీసుస్టేషన్లు ప్రైవేట్ సెటిల్మెంట్లకు వేదికగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులెవ్వరైనా స్టేషన్‌కొచ్చి ఫిర్యాదు ఇస్తే చాలు... ఇరు పార్టీల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. కేసులు నీరుగార్చేస్తున్నారు. తాము చెప్పినదానికల్లా తలూపుతూ అడుగులకు మడుగులొత్తుతారనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నాయకులు కూడా వారికి అండగా నిలబడుతున్నారు! ఎస్పీ బంగళా, జిల్లాలో పలు పోలీసుస్టేషన్ల ఆధునికీకరణ ముసుగులో వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా వసూలు చేసి దిగమింగిన పోలీసు అధికారులపై సైతం ఈగ కూడా వాలకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొంతమందికి నేరగాళ్లతో తెరవెనుక సంబంధాలున్నాయనే ఆరోపణలు ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. లీలల్లో మచ్చుకు కొన్ని.... జిల్లా కేంద్రం శ్రీకాకుళం నగరంలోని రెండు పోలీసుస్టేషన్లలో ఇటీవలి వరకూ పనిచేసిన ఇద్దరు పోలీసు అధికారులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లోని ఇసుక ర్యాంపుల్లో అక్రమార్కుల నుంచి ఓ అధికారి బాగానే వసూలు చేశారట! తన జేసీబీని వమరవల్లికి చెందిన ఓ జేసీబీ యాజమానికి అప్పగించి అద్దె రూపేణా బాగానే ఆర్జించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయనకు బాగానే కలిసొచ్చింది. అలాగే మరో సర్కిల్ స్థాయి అధికారిది ముడుపుల వసూళ్లలో అందెవేసిన చేయి. ఇరు పార్టీల నుంచి ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వచ్చినా దీర్ఘకాలం నగరంలో తిష్ట వేయడం ఆయనకే చెల్లింది. అంతకాలం ఉన్నా పరిష్కారమైన, దర్యాప్తు పూర్తయిన కేసు ఒక్కటీ లేదంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం జిల్లా పోలీస్ కార్యాలయంలోనే ఇద్దరు గుమస్తాలు రూ.70 లక్షల వరకు స్వాహా చేసిన కేసు ఈయన హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇటీవల రిమ్స్‌లో సుమారు రూ.3 లక్షల విలువైన ఎండోస్కోపీలో ఒక ముఖ్య పరికరం మాయమైన కేసునూ నీరుగార్చేయడం ఆయనకే చెల్లింది. నగరంలోని ఓ హోటల్లో విశ్రాంత పోలీస్ ఉద్యోగి కుమారుడి హత్యలో కూడా నిందితుల నుంచి భారీగా నొక్కేశాడనే విమర్శలూ ఆయనపై వచ్చాయి. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్లో పనిచేసిన ఓ ఎస్సైపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓ ఐపీఎస్ అధికారితో విచారణకు డీఐజీ కార్యాలయం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచే గాకుండా పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాల యజమానుల నుంచి వసూళ్లు, పరిశ్రమల యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరించడం వంటి ఆరోపణలు అతనిపై వెల్లువెత్తాయి. ∙ రాజాం సర్కిల్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టినా, కేసు ఉపసంహరించుకోవాలనుకున్నా ఓ సర్కిల్ స్థాయికి ముడుపులు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా కొంతమంది కానిస్టేబుళ్లు సాయంత్రం సమయాల్లో పట్టణానికి సమీపంలో వాహనాలను తనిఖీ సాకుతో ఆపి వసూళ్లకు అలవాటు పడ్డారు. రాత్రివేళల్లో దాబాల వద్దకు చేరి నిర్వాహకుల నుంచి వసూళ్లు జరపడం షరా మామూలుగా మారింది. రూరల్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి కూడా మామూళ్లకు మారుపేరుగా మారారు. రోడ్డు ప్రమాదం జరిగితే చాలు ఇటు నిందితులు, అటు బాధితుల నుంచి ఎంతోకొంత నొక్కేయడంలో ఆయన సిద్ధహస్తుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ∙టెక్కలి సర్కిల్ స్టేషన్లో మూడేళ్లుగా పాతుకుపోయిన ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు అనేకం వస్తున్నాయి. ఆయనకు అధికార పార్టీలో ఓ ముఖ్య నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వైన్స్, మైన్స్ వ్యాపారుల నుంచి నెలవారీ మామూళ్లు భారీగానే దండేస్తున్నా ఆయనను దండించేవారే కరువయ్యారనేది బాధితుల ఆవేదన. కాశీబుగ్గ డివిజనల్ సర్కిల్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు ఒక్కటై దందా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. భూమి కబ్జాలు, స్థల వివాదాలు, అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణా... ఇలా ఏదైనా సరే సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీడిపప్పు రైలులో రవాణా చేయాలన్నా, పశువులను అక్రమంగా లారీలోకి ఎక్కించాలన్నా, గుట్కా గుట్టుగా సరిహద్దు దాటిపోవాలన్నా అక్రమార్కులు వారిని కలిస్తే సరిపోతుందట! కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు కార్పొరేట్ హంగుల పేరుతో ఓ అధికారి అన్ని రకాల వ్యాపారుల నుంచే గాకుండా చివరకు రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగానే వసూలు చేశారంట! వజ్రపుకొత్తూరు పోలీస్‌స్టేషన్ పూర్తిగా అధికార పార్టీ కార్యాలయంగా మారిపోయందనే విమర్శలు మార్మోగుతున్నాయి. ఇక్కడి అధికారి ఒకరు ఏకంగా ఇసుక, మద్యం, గనుల వ్యాపారుల నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల నుంచి, వారు ఫిర్యాదు ప్రకారం నిందితుల నుంచి ఇరువైపులా కేసు తీవ్రతను బట్టి రూ.2 వేల నుంచి రూ.50 వేల వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొనేందుకు ఏసీబీ ఇటీవల వలవేసినా చివరి నిమిషంలో తప్పించుకున్నారని తెలిసింది. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడంలో పాతపట్నం, మెళియాపుట్టి పోలీసుస్టేషన్లలో కొంతమంది పోలీసులను మించినవారు లేరనే విమర్శలు వస్తున్నాయి. గంజాయి, ఎర్ర చందనం అక్రమంగా సరిహద్దు దాటిపోతున్నా వీరిపై ఈగ కూడా వాలకపోవడానికి కారణం కూడా అదేనన్న ఆరోపణలు ఉన్నాయి. -
ఇచ్చిన హామీలు నేరవేర్చాలి: బ్రహ్మారెడ్డి
-
గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న హైకోర్టును గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భౌగోళికంగా, శాస్త్రీయంగా పెండింగ్, లిటిగేషన్ కేసుల దృష్ట్యా గుంటూరు విజయవాడల మధ్యే హైకోర్టును ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో జిల్లా ప్రధానమూర్తిగా పనిచేసి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎం. సత్యన్నారాయణమూర్తి గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణం నూతన హైకోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశంగా పేర్కొంటూ అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక పంపిన విషయాన్ని గుర్తుచేశారు. శాస్త్రీయత లేకుండా తొందరపాటుతో వేరేచోట ఏర్పాటు చేసేవిధంగా ప్రకటిస్తే న్యాయవాదుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తగు జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు.