గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
Published Tue, Mar 18 2014 1:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న హైకోర్టును గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భౌగోళికంగా, శాస్త్రీయంగా పెండింగ్, లిటిగేషన్ కేసుల దృష్ట్యా గుంటూరు విజయవాడల మధ్యే హైకోర్టును ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో జిల్లా ప్రధానమూర్తిగా పనిచేసి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎం. సత్యన్నారాయణమూర్తి గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణం నూతన హైకోర్టు నిర్మాణానికి అనువైన ప్రదేశంగా పేర్కొంటూ అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక పంపిన విషయాన్ని గుర్తుచేశారు. శాస్త్రీయత లేకుండా తొందరపాటుతో వేరేచోట ఏర్పాటు చేసేవిధంగా ప్రకటిస్తే న్యాయవాదుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తగు జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు.
Advertisement
Advertisement