సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి శనివారం హైకోర్టు జడ్జిల బృందం చేరుకుంది. రాష్ట్ర హైకోర్టు ను ఏపీ రాజధానిలో ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఏఎన్‌యూలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ఉన్న మౌలిక వసతులు, పరిస్థితులను జడ్జిల బృందం పరిశీలిస్తోంది.
జిల్లా కలెక్టర్ శశిధర్ తో కలసి జడ్జిలు యూనివర్సిటీ పరిశీలన చేస్తున్నారు. అనంతరం వర్సిటీ ఉన్నతాధికారులతో జడ్జిల బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించనుంది. మరోవైపు హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాధన కమిటీ వినత పత్రం అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment