పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను | Article About Gadwal to Macherla Railway Project | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కని గద్వాల - మాచర్ల రైల్వే లైను

Published Sat, Sep 14 2019 11:06 AM | Last Updated on Sat, Sep 14 2019 11:07 AM

Article About Gadwal to Macherla Railway Project - Sakshi

గద్వాల నుంచి రాయచూరు కొత్త లైన్లో ఐదేళ్లుగా నడుస్తున్న ఏకైక డెమో రైలు

గద్వాల టౌన్‌: ఒక ప్రాజెక్టును చేపడితే తదుపరి కార్యచరణ ఉండాలనే ఆలోచనను రైల్వే ఉన్నతాధికారులు మరిచినట్టున్నారు. నిజాం  కా లంలోనే గద్వాల రైల్వేస్టేషన్‌ను తూర్పు, పడమ ర రైల్వేలను కలిపే జంక్షన్‌ చేయాలనే లక్ష్యంతో 117 ఎకరాలు కేటాయించారు. కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు గద్వాల మీదుగా వనపర్తి, నాగర్‌కర్నూలు, దేవరకొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్‌ ఏర్పాటుకు అప్పట్లోనే ప్రతిపాదించారు. ముఖ్యంగా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తూర్పు, పడమర భారతాన్ని రైల్వే రవాణాలో ఏకం చేయాల ని ఆనాడే తలంచారు. ఆ తర్వాత కాలంలో ఆ లైన్‌ ప్రతిపాదనను 1990 వరకు ఎండమావిగా నే వదిలేశారు.

చివరకు అది ఎ న్నికలలో వాగ్దానంగా మారింది. 2002లో అప్ప టి కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ గద్వాల–రాయచూరు మధ్య మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. దశల వారీగా మాచర్ల వరకు లైన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గద్వాల నుంచి మాచర్ల వరకు సర్వేను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించగా పూర్తయింది. కొత్త లైన్‌ను పీపీసీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించినా కార్యరూపం దాలచ్చడం లేదు. 

55 కి.మీ–పుష్కర కాలం 
గద్వాల–రాయచూరు పట్టణాల మధ్య రాయచూరు–మాచర్లలో భాగమైన మొదటి దశను 12ఏళ్ల పాటు పనులు కొనసా..గించారు. కేవలం 55 కి.మీ. పనిని పుష్కర కాలం చేశారు. ఎ ట్టకేలకు 2013లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ మం త్రి మల్లికార్జునఖర్గే రాయచూరులో గద్వాల–రాయచూరు లైన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచే గద్వాల–రాయచూరు మధ్య డెమో రైలు రాకపోకలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత రా యచూరు నుంచి గద్వాల, కర్నూలు, నంద్యాల, గుంటూరు మీదుగా విజయవాడకు ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రతిపాదించారు. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కాకినాడ నుంచి రాయచూరు వరకు రైలు వేస్తారను కుంటే అది కూడా కర్నూలు, కాకినాడకే పరిమితం చేశారు.

3ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల దారి మళ్లింపు 
కాచిగూడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని యశ్వంతపూర్‌కు నడుస్తున్న మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించాలని అధికారులు ప్ర తిపాదనలు పంపారు. కాచిగూడ నుంచి య శ్వంతపూర్‌కు వెళ్లే ఈ రైళ్లకు డోన్‌ వరకే ట్రాఫిక్‌ ఉండడం వల్ల డిమాండ్‌ ఉన్న రాయచూరు ద్వా రా మళ్లించాలని ఆలోచిస్తున్నారు. ఈ రైళ్లు కా చిగూడ నుంచి మహబూబ్‌నగర్, గద్వాల మీ దుగా రాయచూరు ద్వారా బెంగళూరులోని య శ్వంతపూర్‌ మళ్లించాలని ప్రతిపాదనలు చేశా రు. రాయచూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ప్ర యాణికులతో పాటు హైదరాబాద్‌ నుంచి రా యచూరుకు, రాయచూరు నుంచి హైదరాబా ద్‌కు వెళ్లే వారికి ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూడు యశ్వంతపూర్‌కు వెళ్లే రైళ్లను మాత్రమే మళ్లించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

రైల్వే జంక్షన్‌గా మారిన గద్వాల రైల్వేస్టేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement