మాచర్ల (గుంటూరు) : పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారనే కారణంగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 తపంచా, 2 బుల్లెట్లు, 4 జిలిటిన్‌స్టిక్స్, 8 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న దుర్గంపూడి వెంకటరామిరెడ్డి దగ్గర పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.