జ్ఞాపకాలు నిద్రలేచాయి..
జ్ఞాపకాలు నిద్రలేచాయి..
Published Sun, Jul 31 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
31 ఏళ్ల తర్వాత కలిసిన సెయింట్ జోసఫ్
ఉన్నత పాఠశాల విద్యార్థులు
రెంటచింతల: సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1984–85 సంవత్సరంలో పదో తరగతి చదవిన వారంతా మూడు దశాబ్దాల తర్వాత ఒకచోట కలిశారు. గుర్తుపట్టని ఆకారాలతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆ నాటి తీపిగుర్తులను నెమరు వేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 96 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని కుశల ప్రశ్నలతో ఆత్మీయంగా పలకరించుకొన్నారు. అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ వారు తరగతి గదుల్లో బోధించిన తీరును మననం చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు. మృతి చెందిన 10 మంది ఉపాధ్యాయులు, 9 మంది తమ తోటి విద్యార్థులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ విలువలకు క్రమశిక్షణకు మారు పేరుగా సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. దేవాలయం లాంటి ఈ విద్యాలయంలో చదువుకున్న వారంత చల్లగా ఉండేలా చూడాలని ప్రభువును కోరుకుంటునన్నారు. పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తే పూర్వ విద్యార్థులు కూడా భాగస్వాములవుతారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement