St joseph
-
బుర్ఖా ధరించి బాయ్స్ డ్యాన్స్.. కాలేజీ ఈవెంట్‌పై దుమారం!
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్ నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన క్రమంలో వారిని సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. మరోవైపు.. బాలీవుడ్ సాంగ్‌కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. This is from #Mangaluru, #Karnataka. In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
ఈ కాలేజీలో అన్నీ అక్రమాలే.. వీడియో తీసి విద్యార్థిని...
మైసూరు: మైసూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల్లో చదువుకుంటున్న విద్యార్థిని ఒకరు చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఘటనకు ముందు ఆమె ఒక వీడియో రికార్డు చేసి అందులో తన ఆత్మహత్యకు కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది కారణమని తెలిపింది. తనకు కళాశాల్లో ప్రతి రోజూ ఇబ్బంది ఎదురవుతోందని, విద్యార్థుల పట్ల తారతమ్యం చూపిస్తున్నారని, రోజూ క్లాసులకు వెళ్తున్నా కూడా గైర్హాజరు వేస్తున్నారని వీడియోలో వాపోయింది. హాల్ టికెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని తెలిపింది. ఫీజులు కట్టినదానికి రసీదులు ఇవ్వడం లేదని, హాల్ టికెట్ సమస్యపై ప్రిన్సిపాల్ వద్ద ఎన్నిసార్లు చెప్పుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. విద్యార్థిని చెయ్యి కోసుకుని, నిద్ర మాత్రలు మింగగా, కొందరు గమనించి ఆస్పత్రిలో చేర్చారు. జయలక్ష్మి పురం పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చదవండి: (బెంగళూరు అతలాకుతలం) -
జ్ఞాపకాలు నిద్రలేచాయి..
31 ఏళ్ల తర్వాత కలిసిన సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రెంటచింతల: సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1984–85 సంవత్సరంలో పదో తరగతి చదవిన వారంతా మూడు దశాబ్దాల తర్వాత ఒకచోట కలిశారు. గుర్తుపట్టని ఆకారాలతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆ నాటి తీపిగుర్తులను నెమరు వేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 96 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని కుశల ప్రశ్నలతో ఆత్మీయంగా పలకరించుకొన్నారు. అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ వారు తరగతి గదుల్లో బోధించిన తీరును మననం చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు. మృతి చెందిన 10 మంది ఉపాధ్యాయులు, 9 మంది తమ తోటి విద్యార్థులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ విలువలకు క్రమశిక్షణకు మారు పేరుగా సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. దేవాలయం లాంటి ఈ విద్యాలయంలో చదువుకున్న వారంత చల్లగా ఉండేలా చూడాలని ప్రభువును కోరుకుంటునన్నారు. పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తే పూర్వ విద్యార్థులు కూడా భాగస్వాములవుతారని పేర్కొన్నారు.