old students
-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
బీకామ్ బ్యాచ్.. పెద్ద సందడి..
అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్‌గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్‌లో సభ్యుడే. వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు. వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు. -
ఐఐటీ బాంబేకి పూర్వ విద్యార్థుల భారీ విరాళం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే)కి పూర్వ విద్యార్థులు భారీగా విరాళం అందించారు. 1998 బ్యాచ్‌కి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు రూ. 57 కోట్లు ప్రకటించారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా 1971 బ్యాచ్ విద్యార్థులు ఇచ్చిన రూ. 41 కోట్లకన్నా ఇది అధికం కావడం గమనార్హం. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ్ సక్సేనా, పీక్ ఫిఫ్టీన్ ఎండీ శైలేంద్ర సింగ్, గ్రేట్ లెరి్నంగ్ సీఈవో మోహన్ లక్కంరాజు, వెక్టర్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ తదితరుల 1998 బ్యాచ్‌లో ఉన్నారు. ఈ నిధులు సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడగలవని ఐఐటీ బాంబే డైరెక్టర్ శుభాశీస్ చౌదరి తెలిపారు. అలాగే 2030 నాటికల్లా ప్రపంచంలోనే టాప్ 50 యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్న లక్ష్య సాకారానికి కూడా తోడ్పడగలదని పేర్కొన్నారు. -
Photo Feature: ఆనాటి స్నేహం.. ఆనందగీతం
ఆరిలోవ(విశాఖ తూర్పు): మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం పాఠశాలకు చెందిన 1997–98 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం కంబాలకొండలో కలిశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఇక్కడకు చేరుకుని రోజంతా సరదాగా గడిపారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. రాని మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు.. వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం అంతా కలసి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఆట పాటల్లో మునిగి తేలారు. మాదు నారాయణ, కుసుమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే! -
53 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
సాక్షి, ప్యాపిలి: కర్నూలు జిల్లా ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాలలో 1966–67 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడిన వారంతా ఎంతో ఉత్సాహంగా ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత హెచ్ఎం చంద్రలీలమ్మ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఆనాటి ఉపాధ్యాయులు బాలసంజీవయ్య, రాణిరెడ్డి, హనీఫ్, ప్రసాద్, శివరామిరెడ్డి, ప్రసాద్, మహమ్మద్ సాహెబ్, శ్రీరాంశెట్టి, రమణ తదితరులను ఘనంగా సన్మానించారు. పాఠశాలకు రూ.24 వేల విలువైన బీరువాలను అందజేశారు. 53 ఏళ్ల తర్వాత తామంతా ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖలో ఏఎస్ఓగా పనిచేసి, రిటైర్ అయిన రాముడు అన్నారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో అరుదుగా వస్తాయని మహబూబ్ సాహెబ్ అన్నారు. (చదవండి: విమానం దిగింది.. ఎగిరింది..! ) -
ఎస్ఆర్ఆర్లో సందడే సందడి!
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ (1975-1978) బి.కాం (ఇంగ్లీష్ మీడియం) బ్యాచ్ మేట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం (డిసెంబరు 21) ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సుమారు 40 మంది రోజంతా కాలేజీ నాటి సంగతులతో సరదా సరదాగా గడిపారు. కాలేజీ నేర్పిన జీవిత సత్యాలు తమ ఎదుగుదలకు ఎలా సోపానంగా మారాయో అంతా అనుభవాలను పంచుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో "నాటి స్నేహితుల నేటి కలయిక" విజయవంతంగా జరిగింది. కళాశాల ఆవరణ అంతా కలియతిరిగి.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వాట్సాప్ సంధాన సందేశాల సాయంతో ఒక్కో బ్యాచ్ మేట్ వివరాలను ఒకచోట చేర్చిన మిత్ర బృందం కెజిఎన్ గుప్తా, యనమండ్ర రమేష్, వైవి కృష్ణయ్య అభినందనలు అందుకున్నారు. గెట్ టుగెదర్ నిర్వహించుకోవడానికి కళాశాల ఏసి కాన్ఫరెన్స్ హాలు ఇచ్చి, పూర్తి సహాయ సహకారాలు అందించి, కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపాల్ జోషి కి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసేరు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ పరిమి శ్రీధర్ మోడరేటర్ గా వ్యవహరించారు. -
అమ్మలేని వాడని ఆదరించారు
సాక్షి, గుమ్మఘట్ట: ‘చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. 1 నుంచి 5 వరకు స్వగ్రామం నాగిరెడ్డిపల్లిలో చదువు పూర్తిచేశాను. తర్వాత చదువుకెళ్లేందుకు ఆర్థిక ఇబ్బంది అడ్డుతగిలింది. చదివింది చాలు.. పశువులు తోలుకెళ్లమని ఇంట్లో వాళ్లు ఆదేశించారు.. జొన్న సంకెటి ఓ పూట తింటే మరో పూట ఉండేదికాదు. కడు పేదరికం అనుభవించా.. గుణిగానపల్లిలో ప్రారంభమైన ప్రాథమికోన్నత పాఠశాల మూతపడకుండా ఉండటం కోసం సమీప బంధువు ఒకరు 6 వ తరగతికి అక్కడ చేర్చారు. ఎన్నో రోజులు ఉపావాసం ఉండి చదువుకున్నా.. అమ్మలేని పిల్లోడని అందరు నాపై జాలిపడి ఆదరించేవారు. 7వ తరగతిలో ఫస్ట్‌క్లాస్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించా.. 8లో మీరంతా నాకు మిత్రులు అయ్యారు. పట్టుదల, క్రమశిక్షణే నన్ను ఇంతటిస్థాయికి చేర్చింది. మిమ్మల్ని ఇలా చూడటం చాల అదృష్టంగా భావిస్తున్నా’ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. 40 ఏళ్ల తర్వాత... గుమ్మఘట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1975 – 85 మధ్యగల హైస్కూల్ విద్యార్థులంతా ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. కాపు రామచంద్రారెడ్డితో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా హాజరై పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తమ ఆత్మీయ మిత్రుడు ముచ్చటగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం గర్వించదగ్గ విషయమని మిత్రులంతా కొనియాడారు. అనంతరం పాఠశాల హెచ్ఎం శ్రీదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల తర్వాతా ఇలా అందరు కలవడం హర్షణీయమన్నారు. ఇకపై ఈ ఆత్మీయ కలయికను ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిద్దామన్నారు. అందరం కలిసి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మనలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా చేయిచేయి కలిపి ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడే మన జీవితాలకు సార్థకత లభిస్తుందన్నారు. అమ్మలేని నాకు.. నియోజకవర్గ ప్రజలే అమ్మాలాంటి వారని.. వీరి ఆశీర్వాదం ఉన్నంత కాలం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఎమ్మెల్యేను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు ఇంటర్ కళాశాల ఏర్పాటుకు కృషి.. ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా చదువుకున్న గుమ్మఘట్ట పాఠశాలను మరిచిపోలేనని.. మిత్రులందరి విజ్ఞప్తి మేరకు గుమ్మఘట్టలో ఇంటర్ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఏర్పాటయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాపు హామీ ఇచ్చారు. అందరు మన కళాశాల వైపే చూసేలా మంచి మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆత్మీయ కలయికకు కారకులైన గోనబావి వడ్డే మారెప్పను మిత్రులంతా అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థునులు కాపు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమార్తె స్రవంతిరెడ్డి, మిత్రులు వడ్డే మారెప్ప, క్రిష్టప్ప, సక్రప్ప, సిద్ద రామప్ప, లక్ష్మినారాయణ, ప్రకాష్, మల్లికార్జున, తిప్పేస్వామి, నాగప్ప, శ్రీనివాసులు, ధనుంజయ్యశెట్టి, అనంతరెడ్డి, నాగభూషన, రామాంజినేయులు, ఇబ్రహీమ్, విజయబాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి (వేవ్స్–2018) బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ కేంద్రం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ సమావేశం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా హాజరుకానున్నారు. ఈయన రాకతో సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. ఉదయం ప్రతీ విభాగంలో ఆయా విభాగాల పూర్వ విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రధాన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేస్తారు. సాయంత్రం 4.45 గంటలకు రతన్ టాటా కన్వెన్షన్ సెంటర్‌కు విచ్చేసి వేవ్స్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. అ‘పూర్వ’ సహకారం ఘన చరిత గల విశ్వవిద్యాలయాన్ని మరింత వృద్ధి చేసేందుకు అపూర్వ సహకారం అందిస్తున్నారు పూర్వ విద్యార్థులు. ఇంజినీరింగ్ విద్యార్థుల జ్ఞాపిక: ఏయూ హాస్పిటల్ : ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఉత్తర ప్రాంగణంలో 1981–85 బ్యాచ్ విద్యార్థులు వైద్యశాలను నిర్మించి అందించారు. రెండు అంతస్తుల్లో వైద్యసేవలు, ఎక్స్‌రే, ఫార్మసీ వంటి సేవలు అందించేలా దాదాపు 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.75లక్షలతో భవనాన్ని నిర్మించి వర్సిటీకి కానుకగా అందించారు. మైకేల్ స్మతిచిహ్నం ఫార్మసీ భవనం : ఏయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి తాటికొండ కృపాకర్ పాల్ తన కుమారుడు మైకేల్ జ్ఞాపకార్థం రూ.5కోట్లతో నూతన భవనాన్ని అందించారు. పురాతన రాతి భవనాన్ని తలపించేలా దీనిని నిర్మించారు. జీఎంఆర్ : వ్యాపార దిగ్గజం గ్రంథి మల్లికార్జునరావు ఏయూ టీచర్స్ అసోసియేషన్‌కు సొంత భవనాన్ని నిర్మించారు. ఆచార్య బీల సత్యనారాయణ వీసీగా ఉన్న సమయంలో జీఎంఆర్ రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం పైభాగంలో ఆపూస కార్యాలయాన్ని ఆధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీనికి అదనంగా స్మార్ట్ సెమినార్ హాల్, మల్టీ పర్పస్ హాల్‌ను రూ 50 లక్షలు వ్యయంతో నిర్మించారు. అదే విధంగా సంఘానికి రూ. కోటి నిధులను అందించారు. తండ్రి కానుకగా ఆడిటోరియం అందించిన వైవీఆర్ : ఏయూ ఇంజినీరింగ్ కళాశాల కెమికల్ ఇంజినీరింగ్ విభాగ పూర్వవిద్యార్థి వై.వి.ఎస్ మూర్తి వర్సిటీకి రూ.50 లక్షలు అందించాలని భావించారు. ఆ కోరికను తీర్చారు ఆయన కుమారుడు వై.వెంకటరావు. రూ 2 కోట్ల వ్యయంతో మూడు వందల మంది పట్టే విధంగా వైవీఎస్ మూర్తి ఆడిటోరియంను బహుమతిగా అందజేశారు. మరెందరో స్ఫూర్తిప్ర‘దాతలు’ ♦ పారిశ్రామిక వేత్త కుమార్‌రాజా తాను చదువుకున్న మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో రూ. 10 లక్షలతో డిజిటల్ తరగతిని ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగానికి మరో తరగతి గదిని అందించారు. ♦ కామర్స్ విభాగం 1983–85 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థులు సమావేశ మందిరాన్ని ఆధునికీకరించారు. దీనికి రూ. 10 లక్షల వరకు వెచ్చించారు. ♦ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 1966–71 బ్యాచ్ విద్యార్థులు 8.5 లక్షలతో వర్చువల్ క్లాస్‌రూమ్‌ను అభివృద్ధి చేశారు ♦ ఏయూ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు విశ్రాంత ఆచార్యురాలు సహాయం అందించారు. ♦ సివిల్ ఇంజినీరింగ్ విభాగ పూర్వవిద్యార్థులు విభాగ విద్యార్థినులకు ఉపయుక్తంగా అవసరమైన భవనాన్ని, వసతులను నిర్మించి అందించారు. కట్టమంచి దత్తపుత్రికలా..ఆవిర్భవించిందిలా.. ‘మనం పేదవాళ్లం కావచ్చు, బిచ్చగాళ్లం కానవసరం లేదు’ అని చెప్పేవారట కట్టమంచి రామలింగారెడ్డి. అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో ప్రత్యేక విశ్వవిద్యాలయం కోసం నాటి పాలకులతో పోరాటమే చేశారాయన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వంపై పలుమార్లు తెచ్చిన ఒత్తిడి ఫలితంగా వారు అంగీకరించక తప్పలేదు. ఆయన కృషి ఫలితంగా .. మానస పుత్రికలా అంకురార్పణ జరిగింది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి.. 1926 ఏప్రిల్ 26న తమ కలల సాకారంగా ఆవిర్భవించిన ఏయూను అభివృద్ధి చేసే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్న కట్టమంచి తన వేతనం రూ. 2 వేలలో సగాన్ని వర్సిటీ అభివృద్ధికి విరాళంగా అందించేవారు. దేశాభివృద్ధికి ఉపకరించే విలువైన మానవ వనరులను తయారు చేయాలని నిరంతరం పరితపించేవా రు. ఈ ప్రక్రియలో ఉపకులపతి పదవిని తృణ ప్రాయంగా త్యజించి.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను వీసీగా తీసుకువచ్చారు. సర్వేపల్లి అనంతరం రెండో పర్యాయం ఉపకులపతిగా పనిచేసిన కట్టమంచి ఏయూ ఖ్యాతిని దిగంతాలకు వ్యాప్తిచేశారు. విశ్వవిద్యాలయం బోధన నియామకాలలో కేవలం ప్రతిభకు ప్రాధాన్యం ఇచ్చి విభిన్న ప్రాంతాల నిపుణులకు స్థానం కల్పించారు. మేధావుల నిలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ, న్యాయ శాస్త్ర కోవిదులను అందించింది. తత్వశాస్త్రం, ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్రం, హిందీ, పారా సైకాలజీ విభాగాలకు చెందిన ఆచార్యులు పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పనిచేశారు. క్రీడల్లో అత్యుత్తమ స్థానాలను అందుకోవడం, పరిపాలనా పరంగా రాణించడం జరిగింది. రాజకీయ రంగంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా, పార్లమెంట్ స్పీకర్‌గా ఏయూ పూర్వవిద్యార్థులు పనిచేయడం వర్సిటీకి నూతన చరిత్రను ఆపాదించాయి. శాస్త్ర పరిశోధన రంగానికి నిపుణులను, శాస్త్రవేత్తలను అందించింది. షార్, ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఏయూ విద్యార్థులు నేడు పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అణుశాస్త్ర వికాసానికి ఎంతో దోహదం చేసింది. అణుభౌతిక శాస్త్రం, మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ వంటి వి భా గాలు దూరదృష్టితో ప్రారంభించబడి దేశానికి మేధావుల కొరత రాకుండా చూస్తున్నాయి. భౌగోళికంగానూ ప్రత్యేకమే.. ఎదురుగా ఉవ్వెత్తున ఎగసి పడే సముద్ర కెరటాలు.. మరో వైపు నిశ్చలంగా దర్శనమిచ్చే పర్వత శ్రేణి. ఈ రెంటికి నడుమ విశాల ప్రాంగణంలో నెలవైన ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఈ భౌగోళిక స్వరూపమూ యువతకు ఓ సందేశాన్నిస్తున్నట్లుగా ఉంటుంది. కెరటంలా ఉవ్వెత్తున ఎగిసే అనంత శక్తిని తనలో నింపుకొని వచ్చిన యువతను తొణకని, బెణకని మేరు శిఖరంలా మలచే, మేధావిగా తీర్చిదిద్దే విద్యానిలయంగా వర్థిల్లాలనే ఆకాంక్ష నిబిడీకృతమైనట్లు కనిపిస్తుంది. ఇటువంటి రెండు విభిన్న ప్రాంతాల మధ్య నెలకొన్న విశ్వవిద్యాలయం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. దీనిని గుర్తించి, ఇక్కడ ఏర్పాటు చేసిన కట్టమంచి మరెంతో మహోన్నతుడు. స్ఫూర్తిప్రదాత రాజా విక్రమ్‌దేవ్ వర్మ వర్సిటీకి విలువైన భూములు, నిధులను అందించారు జైపూర్ సంస్థానాధీశులు. విశ్వవిద్యాలయానికి మూడు వందల ఎకరాల వరకు భూములతో పాటు భౌతిక శాస్త్రవిభాగాన్ని అందించారు రాజా విక్రమ్ దేవ్‌వర్మ. ఉన్నత విద్యావంతుడైన రాజా విక్రమదేవ్ వర్మ సైన్స్ కళాశాల భవనాలను నిర్మించడమే కాకుండా విశ్వవిద్యాలయం నిర్వహణకు ఏడాదికి లక్ష రూపాలను ప్రతీ సంవత్సరం వర్సిటీకి అందించేవారు. నాటి రోజుల్లో లక్ష రూపాయలు నేటి కోట్లకు సమానం. -
హక్కుల కార్యకర్తలను విడుదల చేయండి
లక్నో: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా రచయితలు, మేధావులు, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు కొనసాగింపుగానే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయని వ్యాఖ్యానించారు. భరద్వాజ్‌కు బెయిల్ రాకుండా చేసేందుకే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు ఆమెపై కేసు నమో దు చేశారన్నారు. భరద్వాజ్ పేరును చెడగొట్టేలా అధికారులు తప్పుడు కథనాలను కొన్ని టీవీ చానల్స్ ద్వారా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. సుధా భరద్వాజ్ సహా పోలీసులు అరెస్ట్ చేసిన హక్కుల కార్యకర్తలందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులపై జాతీయ మానవహక్కుల కమిషన్‌తో నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. -
మనసున్న వైద్యులు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల పూర్వ వైద్య విద్యార్థులు చేస్తున్న సేవలు దేశంలోని వైద్యులందరికీ ఆదర్శం. ప్రతి ఒక్కరూ జింఖానా వైద్యులను ఆదర్శంగా తీసుకొని తమ మాతృసంస్థలకు సేవ చేయాలి. ఇది సాక్షాతూ కలెక్టర్, గుంటూరు జీజీహెచ్ చైర్మన్ కోన శశిధర్ ఈనెల 7న జింఖానా వైద్యులను ఉద్ధేశించి మాట్లాడిన మాటలివి. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి చదువుకున్న మాతృ సంస్థ రుణం తీర్చుకుంటూ సంస్థ అభివృద్ధికి నిరంతరం అవిరళ కృషి చేస్తున్నారు. ఆసంఘం పేరే జింకానా. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లంతా ఉన్నత స్థానాల్లో స్థిరపడి తాము చదువుకున్న కళాశాలను మరిచిపోకుండా అభివృద్ధికి కృషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుంటూరు వైద్య కళాశాల అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా (జింకానా) 1981లో ఏర్పడింది. సుమారు 2,500 మంది పూర్వ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ప్రతి ఏడాది తాము వైద్య వృత్తిలో సంపాదించుకున్న ధనంలో కొద్దో గొప్పో గుంటూరు వైద్య కళాశాలకు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధికి విరాళంగా అందజేస్తూ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. జింకానా ఆడిటోరియంతో వెలుగులోకి... జింకానా ఆధ్వర్యంలో కళాశాల, ఆసుపత్రికి ప్రతి ఏడాది నిధులు అందుతున్నా 2004లో కళాశాలలో జింకానా ఆడిటోరియం నిర్మాణంతో పూర్వ విద్యార్థుల సేవలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ. 2.50 కోట్లతో ఉమ్మడి రాష్ట్రాల్లో ఏవైద్య కళాశాలలో లేని విధంగా 850 సీటింగ్ సామర్ధ్యంతో విదేశాల్లో ఉండే మాదిరిగా జింకానా ఆడిటోరియం నిర్మించారు. ఈ ఆడిటోరియం పలువురు ఉన్నతాధికారుల మన్ననలు సైతం పొందింది. 2009లో డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ, ట్రామా సెంటర్ నిర్మాణంలో జింకానా సభ్యుల పాత్ర ఎంతో కీలకం. రూ. 35 కోట్లతో భవన నిర్మాణం జరుగ్గా అందులో రూ. 20 కోట్లు జింఖానా సభ్యులు విరాళంగా అందజేశారు. డాక్టర్ పొదిల ప్రసాద్ ఒక్కరే రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో పొదిల ప్రసాద్ భవన నిర్మాణం జరిగింది. ప్రపంచ స్థాయి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ జింఖానా బిల్డింగ్‌లో నిర్మించడంతో నేడు గుండె, కిడ్ని మార్పిడి, మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో జరుగుతున్నాయి. ఈ భవన నిర్మాణంతో జీజీహెచ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వైద్య విద్య బలోపేతం కోసం... గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించడంలో జింకానా తన వంతు పాత్ర పోషిస్తోంది. కళాశాలలో లెక్చరర్ గ్యాలరీలు ఆధునీకరించి ఆడియో, వీడియో సిస్టమ్‌లు ఏర్పాటు చేసి ఎంసీఐ గుర్తింపు కోసం ఇబ్బంది లేకుండా చేశారు. దాంతోపాటు ఈ–లైబ్రరీ నిర్మించి వైద్య విద్యలో వస్తున్న ఆధునిక వైద్య పద్ధతులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా మెరుగు పరిచారు. తాజాగా ఎంసీహెచ్ నిర్మాణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాతా శిశు మరణాలు తగ్గింపే లక్ష్యంగా జీజీహెచ్‌లో మాతా, శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌వార్డు) నిర్మించాలని నిర్ణయించాయి. ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ప్రభుత్వం నిర్మించే ఎంసీహెచ్ బ్లాక్‌తో పూర్తి సేవలు లభించక పోవడంతో జింఖానా వైద్యులు ముందుకొచ్చారు. జింఖానా సభ్యులు రూ. 30కోట్లు విరాళం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఐదుకోట్లు విరాళం ఇచ్చిన డాక్టర్ పొదిల ప్రసాద్ ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం మరో రెండు కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మొత్తం రూ. 65 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం త్వరలో జరుగనుంది. సుమారు 600 పడకలతో ఐదంతస్తులు భవనాన్ని నిర్మించనున్నారు. అప్పుడే పుట్టిన పసికందుకు, గర్భిణులకు,బాలింతలకు కార్పొరేట్ వైద్యసేవలు ఎంసీహెచ్ వార్డులో ఉచితంగా అందనున్నాయి. 40 ఏళ్ల తరువాత వైద్యుల అపూర్వ కలయిక గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 1978లో ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించిన వైద్యులు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం కళాశాల జింఖానా ఆడిటోరియంలో కలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి వృత్తి మెలకువలు నేర్పిన కళాశాల అభివృద్ధి కోసం తమ వంతు సాయం చేయాలని ముందుకొచ్చారు. వైద్య కళాశాలలోని ఓ లెక్చర్ గ్యాలరీని ఆధునీకరణ చేసేందుకు ఎనిమిది లక్షలు విరాళం ఇచ్చేందుకు అంగీకారం తెలిపి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావుకు విషయాన్ని తెలిపారు. ఈనెల 23న తమ బ్యాచ్ వైద్యులంతా హాజరై నిధులు ఇస్తామని వెల్లడించారు. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జీజీహెచ్ రేడియాలజిస్ట్ డాక్టర్ వూటుకూరి సురేష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయ, కంటి వైద్యనిపుణుల డాక్టర్ పసుమర్తి రాజశేఖర్ తదితరులు కళాశాలలో కలుసుకుని నాటి జ్ఙాపకాలు నెమరువేసుకున్నారు. -
మార్చిలో కేఎంసీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
–ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్య బోధనలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న కర్నూలు మెడికల్ కాలేజిలో వచ్చే మార్చి నెల నుంచి డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2006లో జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల కంటే ఘనంగా ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు కర్నూలు జిల్లా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజల కోసం వినోదాత్మకంగా, విజ్ఞానదాయంగా ఉండే ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో బోధనాసుపత్రిలోని 35 విభాగాల నుంచి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత వైద్యశిబిరాన్ని మూడురోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఫాకల్టీని సగౌరవంగా ఆహ్వానించి, ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వైద్యనిపుణుల ఆద్వర్యంలో విద్యార్థుల నైపున్యాన్ని అభివృద్ధి చేసేలా వైద్యవిజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలు, ప్రస్తుత విద్యార్థుల అపురూప విషయాలతో కలిపి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ సావనీర్‌ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో అకడమిక్ అంశాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రొఫెసర్లతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు భారత రాష్ట్రపతి, భారత ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రులకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. కార్యక్రమాలకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల చే స్తామని ప్రిన్సిపల్ డాక్టర్ రామప్రసాద్ వెల్లడించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ రామక్రిష్ణనాయక్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎస్.వెంకటరమణ, వైద్యులు పాల్గొన్నారు. -
6 నుంచి ‘బడి రుణం..తీర్చుకుందాం’
కర్నూలు సిటీ: గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని ప్రభుత్వ స్కూళ్లలో ఎంతో మంది చదివి నేడు ఉన్నత స్థానాల్లో స్థిర పడి ఉంటారు. అలాంటి వారందరూ తను చదివిన స్కూల్ రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాలోని 54 మండల కేంద్రాల్లో పాఠశాల విద్యార్థులతో బడి రుణం తీర్చుకుందాం రండి.. అంటూ ర్యాలీలు నిర్వహించనున్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఏజేసీ రామ స్వామి, డిప్యూటీ ఈఓ తహెరాసుల్తానా, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ జయ రామకృష్ణారెడ్డిలు ర్యాలీల పోస్టర్లను ఆవిష్కరించారు. మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు ఎస్ఎస్ఏ అధికారులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయనున్నారు. సహాయం చేస్తే...నోటిస్ బోర్డులలో దాతల పేర్లు స్కూల్ అబివృద్ధి కోసం 10 నుంచి 20 లక్షల రూపాయలను సహయం చేసే వారి పేర్లను నోటీస్ బోర్డులలో చిరకాలం ఉండిపోయేలా రాస్తారు. దాతలు ఇచ్చిన విరాళాలను ఒక పుస్తకంలో పక్కాగా లెక్కలు రాస్తారు. దాతల పేర్లు, ఫోటోలు ఠీఠీఠీ.టట్చ్చp.జౌఠి.జీn అనే వెబ్సైట్లో పొందుపరుస్తారు. -
అలల్లో అలనాటి జ్ఞాపకాలు
వైనతేయ పుష్కరఘాట్‌లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–83 బ్యాచ్ భేటీ పి.గన్నవరం : వారంతా నూనూగు మీసాలు, పరికిణీ, ఓణీల ప్రాయంలో విడిపోయిన వారు. యవ్వనం గడిచి, నడివయసు నడుస్తున్న వేళ తిరిగి వైనతేయ తీరంలో కలుసుకున్నారు. నేటి సమాజంలో తమ స్థానాలనూ, హోదాలనూ గడ్డిపరకల్లా పక్కకు నెట్టి నాటి చనువుతోనే పలకరించుకున్నారు. మూడు దశాబ్దాల కిందటి తమ అనుభవాలనూ, అనుభూతులనూ కలబోసుకున్నారు. నాటి చిలిపిపనులనూ, కొంటె పనులనూ ప్రేమగా గుర్తు చేసుకున్నారు. శిఖరాల నుంచి దుమికే జలపాతాల వంటి; బండరాళ్లను ఢీకొని ఉరకలేసే కొండవాగుల వంటి ఆనాటి తమను ఆ నది అలల్లో దర్శించుకున్నారు. మనసులు తిరిగి ఆ తరుణయవ్వనంలో కాలిడగా.. కాల ప్రవాహానికి ఎదురీది.. దాని ప్రభావం దేహంపైనే తప్ప హృదయం మీద కాదని రుజువు చేసుకున్నారు. పి.గన్నవరం జెడ్పీ హైస్కూలు 1983–84 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఇక్కడి పాత అక్విడెక్టు పుష్కర ఘాట్ వేదికగా జరిగింది. 32 ఏళ్ల కిందట విడిపోయిన వారిలో అనేకులు ఉద్యోగ, వ్యాపార తదితర కారణాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కాగా వారిలో స్థానికంగా ఉన్న కొందరు రెండు నెలలు శ్రమించి నాటి సహాధ్యాయుల చిరునామాలు సేకరించి ఆహ్వానాలు పంపగా 60 మంది హాజరయ్యారు. ఆ నాటి ముచ్చట్లను కలబోసుకుని మురిసిపోయారు. ఇంటిపేర్లతో పిలుచుకుంటూ చిన్నపిల్లల్లా మారిపోయారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఒకరి చిరునామాలు, సెల్ నెంబర్లు మరొకరు తీసుకున్నారు. నాడు తమకు చదువుచెప్పిన గురువులను వచ్చే ఏడాది జనవరిలో సత్కరించాలని, ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. తమ బ్యాచ్‌లో అకాలంగా మరణించిన కొందరి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం బస్సులు, కార్లలో దిండి చేరుకుని ‘గెట్ టు గెదర్’ కేకును కట్ చేశారు. అక్కడ నుంచి అంతర్వేది యాత్రకు తరలివెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు అన్నాబత్తుల అనుబాబు, వాసంశెట్టి కుమార్, నేలపూడి సత్యనారాయణ, మానేపల్లి వెంకటేశ్వరరావు, సుంకర శ్రీను, వరిగేటి పద్మావతి, మొల్లా షేరా, పైడి బుజ్జి, కొండా వెంకటేశ్వరరావు, యడ్లపల్లి వెంకటేశ్వర రావు, కూనపరెడ్డి వెంకటేశ్వర రావు, పీవీఎస్ ప్రసాద్, కట్టా లక్ష్మీ బంగారం, వంకాయల రజని, అడబాల అలివేణి తదితరులు పాల్గొన్నారు. కేరళ నుంచి వచ్చా.. పదో తరగతి వరకూ ఇక్కడే చదివాను. కేరళలో స్థిరపడ్డాను. మా టెన్త్ బ్యాచ్ సమావేశమవుతుందని తెలుసుకుని మూడు రోజులు లీవు తీసుకుని వచ్చా. చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నారాయణ విజయలక్ష్మి, కేరళ బాల్యం గుర్తుకొచ్చింది.. మేమంతా మళ్లీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది. బాల్యం గురుక్తు వచ్చింది. ఉద్యోగ బాధ్యతల్లో క్షణం తీరికలేకుండా ఉండే నాకు గత స్మృతులు గుర్తుకు వచ్చాయి. అంబటి అనంతలక్ష్మి, ఏపీ ట్రాన్స్‌కో ఏఓ, హైదరాబాద్ గ్రామానికి సేవ చేయాలి.. ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సేవలందించాలి. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఇతరులకు సాయపడాలి. పూర్వ విద్యార్థులు కలిసినపుడల్లా గుర్తుగా గ్రామానికి ఏదో ఒక మంచిపని చేయాలి. పి.వాలెంటీనా, హిందీ టీచర్, రాజమండ్రి పేదస్నేహితులకు చేయూతనివ్వాలి.. కలిసి చదువుకున్న వాళ్లమంతా ఇలా తిరిగి కలవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి చోటా జరగాలి. పేదరికంలో ఉన్న స్నేహితులకు ఉన్నతస్థితిలో ఉన్నవారు సహాయ పడాలి. –చింతపల్లి సుజాత, హెచ్ఎం, జెడ్పీ హైస్కూలు, అంతర్వేదిపాలెం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు మా బ్యాచ్ విద్యార్థులంతా కలిసి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం. వచ్చే జనవరిలో కుటుంబాలతో సహా హాజరై, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. బాల్యమిత్రులను కలవడం ఆనందంగా ఉంది. –మానేపల్లి వెంకటేశ్వరరావు, పాలకొల్లు -
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
హుజూర్నగర్ : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1966–67లో హెచ్ఎస్సీ చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి పాఠశాలల మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. అనంతరం మెమెుంటోలు అందజేశారు. అదే విధంగా పూర్వ విద్యార్థి డాక్టర్ ఎన్వీ.రాఘవరావు అంద జేసిన రూ. లక్ష విరాళాన్ని ప్రతిభ గల విద్యార్థులకు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయుడు లక్పతినాయక్కు అందజేశారు. ఇటీవల భారీ వర్షానికి కూలిపోయిన పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి సైతం హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు యుగంధరశర్మ, నర్సింహారావు, పెంటయ్య, సోమయ్య, విశ్వేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’సాయం..!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా అమెరికాలో స్థిరపడినా... తమకు భవిష్యత్‌ను ఇచ్చిన పాఠశాలను మరువలేదు. తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పదేళ్లుగా పాఠశాల అభివృద్ధిగా భాగస్వాములవుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారే... మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు లెంక విజయభాస్కర్, జగన్‌లు. వీరి సేవలను ఓ సారి పరికిస్తే... సంతకవిటి: మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న మందరాడ గ్రామానికి చెందిన లెంక విజయ్‌భాస్కర్, లెంక జగన్‌లు అన్నదమ్ములు. స్థానిక పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్నారు. అనంతరం ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. గ్రామానికి దూరంగా నివసిస్తున్నా గ్రామం, పాఠశాలపై మమకారం వీడలేదు. తమ ఉన్నతికి కారణమైన పాఠశాల బాగుకోసం నడుంబిగించారు. పదేళ్లుగా పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు... –పాఠశాల విద్యార్థులకు బెంచీల సదుపాయం కల్పించారు. వసతి సమస్య పరిష్కారం కోసం రెండు షెడ్లు నిర్మించారు. –వ్యాయామ ఉపాధ్యాయుడు కె.సన్నిబాబు విజ్ఞప్తి మేరకు విద్యార్థులకు ఏటా క్రీడా దుస్తులను అందజేస్తున్నారు. ఏడాది కిందట పాఠశాలలో గ్రిగ్స్ పోటీల నిర్వహణకు అయిన రూ.2లక్షల ఖర్చును భరించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. – ప్రస్తుతం పాఠశాలలోని క్రీడాకారులుకు రూ.20 వేలు విలువచేసే క్రీడాపరికరాలను పీడీ కె.సన్నిబాబు చేతుల మీదుగా పాఠశాల హెచ్ఎం యాగాటి దుర్గారావుకు పూర్వవిద్యార్థి లెంక జగన్ శనివారం అందజేశారు. జావెలిన్ త్రో, డిస్క్, వాలీబాల్, క్రికెట్కిట్ వంటి పరికరాలు సమకూర్చారు. –పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనందిస్తున్నారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్షిస్తున్నారు. -
జ్ఞాపకాలు నిద్రలేచాయి..
31 ఏళ్ల తర్వాత కలిసిన సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రెంటచింతల: సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1984–85 సంవత్సరంలో పదో తరగతి చదవిన వారంతా మూడు దశాబ్దాల తర్వాత ఒకచోట కలిశారు. గుర్తుపట్టని ఆకారాలతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఆ నాటి తీపిగుర్తులను నెమరు వేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 96 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని కుశల ప్రశ్నలతో ఆత్మీయంగా పలకరించుకొన్నారు. అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ వారు తరగతి గదుల్లో బోధించిన తీరును మననం చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను సత్కరించారు. మృతి చెందిన 10 మంది ఉపాధ్యాయులు, 9 మంది తమ తోటి విద్యార్థులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ విలువలకు క్రమశిక్షణకు మారు పేరుగా సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలకు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. దేవాలయం లాంటి ఈ విద్యాలయంలో చదువుకున్న వారంత చల్లగా ఉండేలా చూడాలని ప్రభువును కోరుకుంటునన్నారు. పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం అందించేందుకు ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తే పూర్వ విద్యార్థులు కూడా భాగస్వాములవుతారని పేర్కొన్నారు. -
గుర్తుకొస్తున్నాయి..
లయోలా స్కూల్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అది బాల్యంలో అనుబంధం... అరమరికలు లేని స్నేహం... 33 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్న ఆ క్షణం... మాటల్లో చెప్పలేని అనుభూతి... కళ్లల్లో ఉప్పొగిన సంతోషం... ఈ ఉదయం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూపులు ఫలించిన వేళ...ఒకరినొకరు పలకరింపులు...ఆప్యాయతతో ఆలింగనాలు... యోగ క్షేమ సమాచారాల కుశలప్రశ్నలు.. ఈ భావోద్వేగ క్షణాలకు శనివారం వినుకొండ లయోలా స్కూల్ వేదికైంది. ఆ పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన 58 మంది పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను నెమరువేసుకొని ఆనందించారు.అడపాదడపా ఒకరినొకరు కలుస్తున్నా, అందరినీ ఒక్కసారిగా కలవాలనే వారి ఆశ నెరవేరింది. ఆనాటి గురువులతో ఉన్న అనుబంధాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. మళ్లీ ఆనాటి విద్యార్థుల్లాగా వీరంతా ఉదయం స్కూల్ డ్రెస్‌తో అసెంబ్లీలో పాల్గొనడం గమనార్హం. నాడు ఏ క్లాస్‌రూమ్‌లో పాఠాలు నేర్చుకున్నారో అదే క్లాస్‌రూమ్‌లో కూర్చొని క్రిష్టయ్య మాస్టార్ చే అటెండెన్స్ వేయించుకొని పాఠం చెప్పించుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల ముఖద్వారం నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. పూర్వ విద్యార్థులు మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు, విజయరాజకుమార్, ఆదాం, సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.మురళి, సురేష్, జి. శ్రీనివాసరావు, సీహెచ్ శ్రీనివాసరావు, ఫరీద్‌బాబు, పవన్‌కుమార్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీరిలో మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఫరీద్‌బాబు అమెరికాలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. పవన్‌కుమార్ డిఫెన్స్‌లో రీసెర్చ్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. సీహెచ్ శ్రీనివాసరావు భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఎన్ఐపీహెచ్ఎం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. – వినుకొండ రూరల్ -
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండలో గట్టుప్పుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2006–2007 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. -
జ్ఞాపకాల పూదోటలో..
జ్ఞాపకాల పూదోటలో.. చిన్ననాటి మధుర స్మృతులను నెమరేసుకుంటూ 30 ఏళ్ల తరువాత స్నేహితులు ఒక్కటయ్యారు. తమ ఉన్నతికి బాటలు వేసిన గురుదేవులను ఘనంగా సన్మానించారు. ఆత్మీయ స్వాగతంతో గురువుల సేవలను గుర్తు చేసుకున్నారు. జ్ఞాపకాల పూదోటలో విహరించారు. ఆదివారం ఇందుకు స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల వేదికైంది. 1977 నుంచి 1988 వరకు ప్రాథమిక పాఠశాల, హైస్కూలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు కలిశారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఐదుగురు, హైస్కూలులో పనిచేసిన 25 మంది విశ్రాంత ఉపాధ్యాయులు, 15మంది విశ్రాంత అధ్యాపకులను సత్కరించారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, పాకాల హైస్కూలు, జూనియర్ కళాశాలలో చదివిన వారు దేశ, విదేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిమెంటు రేకుల షెడ్డు స్థితి నుంచి పక్కా భవనాల స్థాయికి హైస్కూలు అభివృద్ధి చెందడం వెనుక పూర్వ విద్యార్థుల కృషి కూడా ఎంతో ఉందని తెలిపారు. ఇదో మరపురాని అ‘పూర్వ’ ఘట్టమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు గురువుల ఆశీస్సులు పొందారు. పాఠశాల ప్రాంగణంలో 250 మొక్కలను నాటారు. తాము హైస్కూలు అభివృద్ధికి మున్ముందు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. తాము ఎక్కడెక్కడ స్థిరపడ్డామో తెలియజేస్తూ, ఆనాటి జ్ఞాపకాలు పంచుకున్నారు. సహపంక్తి భోజనాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో పూర్వ విద్యార్థులు కిర్రెత్తించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఈఓ మునస్వామి, విశ్రాంత టీచర్లు, విశ్రాంత అధ్యాపకులు, విశ్రాంత పీడీలు వెంకటరమణారెడ్డి, డీ.కృష్ణమనాయుడు, శ్రీరామరెడ్డి, రాఘవాచారి, దామోదర్‌రెడ్డి, జ్యోతీశ్వర్‌రెడ్డి, కె.రఘునాథరెడ్డి, సుబ్రమణ్యం, నరసింహారెడ్డి, విజయ్‌కుమారి, విక్టోరియా, విమలమ్మ, సుగుణ, శారద, హనుమంతనాయుడు, శివకుమార్ తదితరులను సన్మానించారు. అలాగే, ఒకప్పటి తమ ట్యూషన్ మాస్టారు, ప్రస్తుతం గోవాలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ను కూడా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాల హెఎం.చంద్రశేఖర్‌నాయుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొండలరాయుడు, పాకాల, మదనపల్లె, తిరుపతి, అమెరికా, బెంగళూరు, ఒంగోలు, హైదరాబాద్, తిరుపతి, తమిళనాడు తదితర ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
గుర్తుకొస్తున్నాయి..!
ఉత్సాహంగా బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: అరే భాయ్.. హౌ ఆర్ యూ.. వేర్ ఆర్ యూ నౌ.. అంటూ ఆత్మీయ పలకరింపులు! మనోడేం మారలేదు.. అంటూ ఆత్మీయ ఆలింగనాలు!! బిట్స్ పిలానీకి చెందిన వివిధ క్యాంపస్‌లలో చదువుకుని ఉన్నత స్థానాలను అలంకరించిన ప్రముఖలంతా కాసేపు స్టూడెంట్స్‌లా మారిపోయారు. నాటి కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. దీనికి బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ వేదికైంది. గతంలో బిట్స్ క్యాంపస్ (పిలానీ, గోవా, దుబాయ్, హైదరాబాద్)లలో చదువుకున్న వారంతా శుక్రవారం బిట్స్ పిలానీ, బిట్స్ అలేమ్నీ అసోసియేషన్ (బిట్సా) ఆధ్వర్యంలో జరిగిన బిట్స్ పిలానీ గ్లోబల్ మీట్‌కు (జీబీఎం-2014) హాజరయ్యారు. వీరిలో కొందరు కంపెనీలకు సీఈవోలు అయితే.. మరికొందరు విదేశీ విశ్వ విద్యాయాల్లో ప్రొఫెసర్లు.. ఇంకొందరు ప్రముఖ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రావు, హిటాచీ కంపెనీ ఆసియా ఛైర్మన్ సలహాదారు రాజురెడ్డి, ఎస్‌క్యూఎల్ స్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ ఫార్మర్ చైర్మన్ అశోక్‌కుమార్ అగర్వాల్, జనరల్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన కృష్ణ వావిలాల, విశాఖపట్నం షిప్‌యార్డ్‌లో క్వాలిటీ డివిజన్ మేనేజర్‌గా చేసిన ఎస్వీ రమణయ్య ఇలా అనేక జీబీఎంకు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బిట్సా చైర్మన్ రాజురెడ్డి తెలిపారు.