
ఆరిలోవ(విశాఖ తూర్పు): మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం పాఠశాలకు చెందిన 1997–98 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం కంబాలకొండలో కలిశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఇక్కడకు చేరుకుని రోజంతా సరదాగా గడిపారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. రాని మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు.. వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం అంతా కలసి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఆట పాటల్లో మునిగి తేలారు. మాదు నారాయణ, కుసుమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!
Comments
Please login to add a commentAdd a comment