Madhurawada
-
విశాఖ మధురవాడ ఎన్జీవోస్ కాలనీలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
మధురవాడలో రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయం!
సాక్షి, విశాఖపట్నం: దసరా నుంచి పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి కార్యాలయాలకు భవనాల ఎంపిక కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాన్ని మధురవాడలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దసరా నుంచి రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రితోపాటు విశాఖ వచ్చే ఉన్నతాధికారులు, ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయాల ఏర్పాటు, పని విభజనపై కసరత్తు వడివడిగా జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం జాయింట్ కమిషనర్(జేసీ)–1, 2 కార్యాలయాలు, కొన్ని సర్కిల్ కార్యాలయాలు ముడసర్లోవ సమీపంలో ఉన్నాయి. ఈ భవనాన్నే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి కేటాయించాలని భావించారు. కానీ, సరిపడా గదులు లేకపోవడంతో దానికి ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని పన్నుల శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారుల కోసం కేటాయించాలని ప్రయత్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు విశాఖ డివిజన్ అధికారులు నివేదిక పంపించారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలో భవనాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దీంతో విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ కార్యాలయ అధికారులు మధురవాడలో ఉన్న భవనాలను పరిశీలించారు. నాలుగు అంతస్తులు ఉన్న మూడు భవనాలను పరిశీలించి వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. రెండు వారాల్లోపు ఉన్నతాధికారుల బృందం వచ్చి ఆ భవనాలను పరిశీలించి ఒకదానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. -
విశాఖ సిగలో మరో మణిహారం.. 19 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్
సాక్షి, అమరావతి: మహానగరంగా వేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం సిగలో మరో మణిహారం వచ్చి చేరుతోంది. ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్, ఐటీ బిజినెస్ పార్క్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలతో అభివృద్ధి చెందుతున్న విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో భారీ బిజినెస్ పార్క్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అంతర్జాతీయ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా మధురవాడ హిల్ నంబర్–3లో 18.93 ఎకరాల్లో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. ఇందుకు సుమారు రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసే కంపెనీ (ఎస్పీవీ)లో ఏపీఐఐసీ 26 శాతం వాటాను కలిగి ఉంటుంది. మిగిలిన 74 శాతం వాటాను భాగస్వామ్య కంపెనీ కలిగి ఉంటుంది. భూమికి అత్యధిక ధరను కోట్ చేసిన సంస్థను ఎంపిక చేస్తారు. ఎంపికైన సంస్థ ఏపీఐఐసీకి 26 శాతం వాటా కింద రూ.78 కోట్లు సమకూర్చాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని భాగస్వామ్య కంపెనీ ఈక్విటీగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బహుళజాతి సంస్థలను ఆకర్షించే విధంగా ఈ బిజినెస్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఏపీఐఐసీ వీసీ, ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరడానికి ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల సంస్థలు జూన్ 20లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? మధురవాడ, రుషికొండ ప్రాంతాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఆకర్షించేలా ఈ బిజినెస్ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తు్తండటంతో దానికి అనుగుణంగా ఏపీఐఐసీ బిజినెస్ పార్కులను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. డిజైన్ దగ్గర నుంచి నిర్వహణ వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో బిజినెస్ పార్కును నిర్మించేలా డిజైన్ దగ్గర నుంచి నిధుల సమీకరణ వరకు భాగస్వామ్య కంపెనీనే చూసుకోవాల్సి ఉంటుందని ఏపీఐఐసీ స్పష్టం చేసింది. అలాగే ఐటీ, ఐటీ ఆధారిత, ఆర్థిక కంపెనీల అవసరాలకు అనుగుణంగా కమర్షియల్ ఆఫీస్ స్పేస్, బిజినెస్ సెంటర్‌తోపాటు సమావేశ మందిరాలు, బిజినెస్ హోటల్స్, సర్విస్ అపార్ట్మెంట్స్, ఎయిర్ థియేటర్, ఫుడ్ బేవరేజ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతర మౌలిక వసతులతోపాటు పార్కింగ్ సౌకర్యాలు కూడా భాగస్వామ్య కంపెనీనే కల్పించాల్సి ఉంటుంది. -
మధురవాడ: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నూతన కార్యాలయం ప్రారంభం
-
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
Photo Feature: ఆనాటి స్నేహం.. ఆనందగీతం
ఆరిలోవ(విశాఖ తూర్పు): మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం పాఠశాలకు చెందిన 1997–98 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం కంబాలకొండలో కలిశారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఇక్కడకు చేరుకుని రోజంతా సరదాగా గడిపారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తరగతి గదుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. రాని మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు.. వారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్నం అంతా కలసి భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఆట పాటల్లో మునిగి తేలారు. మాదు నారాయణ, కుసుమ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే! -
పెళ్లి పీటలపైనే నవ వధువు మృతి.. ఎన్నో అనుమానాలు..
పెళ్లంటే తాళాలు, తప్పట్లు, పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడుముళ్లు, బంధువుల సందడి ..ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, పెళ్లి ఇంట సందడే సందడి. ఘనంగా వేడుకకు ఏర్పాట్లు చేసుకున్నారు. మరేం జరిగిందో...వధువు పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. ఆ సందడంతా క్షణకాలంలో చెదిరిపోయింది. బంధువులంతా షాక్ నుంచి తేరుకోలేదు..ఏమైందో ఒకటే ఆందోళన...ఆస్పత్రిలో చేర్పించారు. రాత్రంతా చికిత్స అందించారు. గురువారం ఉదయం నవ వధువు మృతి చెందింది. ఆమె మృతి వెనుక ఎన్నో అనుమానాలు...ఎన్నో సందేహాలు..పెళ్లింట సమాధానం చెప్పలేని ప్రశ్నలు... సాక్షి, మధురవాడ (భీమిలి): మధురవాడ కళానగర్‌కు చెందిన టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ, హైదరాబాదు చందానగర్ పాపిరెడ్డి కాలనీ, ఆర్జీకే కాలనీ బ్లాక్ నెంబరు.58 జీఎఫ్ 6లో నివాసం ఉంటున్న ముంజేటి సాయి సృజన (22)కు వివాహం నిశ్చయించారు. పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం ఈ నెల 7న మధురవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఇందులో భాగంగా 8వ తేదీన ప్రదానం పూర్తయ్యింది. అదే రోజు సాయంత్రం సంగీత్ కూడా జరిపించారు. వధువు రుతుక్రమం నుంచి తప్పించడానికి 5వ తేదీ నుంచి 10 వరకు మాత్రలు వాడింది. బుధవారం ఉదయం 7 గంటలు సమయంలో వధువు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయింది. దీంతో వైద్యం నిమిత్తం వెంకోజీపాలెంలోని అమ్మ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి ఇంటికి తీసుకు వచ్చారు. అదే రోజు 4గంటలకు ఇంటి వద్దనే కాళ్ల గోరు సంబరం, పెళ్లి కూతురుగా అలంకరణ, ఇతర కార్యక్రమాలు కూడా జరిపించారు. 9.45 గంటలకు మధురవాడ కళానగర్‌లోని శివాజీ ఇంటి సమీపంలోని వివాహ వేదిక వద్దకు తీసుకు వచ్చి పెళ్లి తంతు ప్రారంభించారు. యువతి బ్యాగులో లభ్యమైన గన్నేరు పప్పు మాదిరిగా ఉన్న తొక్కలు మరి కొద్ది సయంలో వేద మంత్రాలు నడుమ తాళి బొట్టు కడతాడనుకునే క్రమంలో రాత్రి 10.10 గంటలకు వధువు కుప్పకూలిపోయింది. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి మొదట తరలించారు. పరిస్థితి మెరుగవుతుందని భావించి మళ్లీ 2 గంటలకు కూడా మరో ముహూర్తం ఖరారు చేసి వధువు కోసం పెళ్లి మండపం వద్ద బంధువులు వేచి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వధువు పరిస్థితి విషమించడంతో ఇండస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందిందని వైద్యులు సమాచారం ఇచ్చినట్టు మధురవాడ జోన్(విశాఖ నార్త్ జోన్) ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు చెప్పారు. గుర్తు తెలియని విషపదార్థం తీసుకోవడం వల్ల మృతిచెందిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామన్నారు. పోస్టు మార్టం నివేదిక వస్తే మృతికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు. మృతురాలి తండ్రి ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు బీకాం పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుంది. వధువు సృజన కుటుంబం శ్రీకాకుళం జిల్లా జలుమూరు నుంచి ఉపాది నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈశ్వరరావు ట్రెడెంట్ లైఫ్ కెమికల్స్ కంపెనీలో మెయింటినెన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మృతురాలి బ్యాగులో గన్నేరు తొక్కలు వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమయ్యాయి. గన్నేరు పప్పు తిని ఉంటుందా? మరేమన్న కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..) -
మధురవాడే హాట్ కేక్.. పోటీపడుతున్న అనకాపల్లి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేనే నంబర్ అంటోంది మధురవాడ. రియల్ రంగంలో ఇప్పుడు ఈ ప్రాంతమే కేంద్ర బిందువు. నగరంలో జరుగుతున్న నిర్మాణాలు మాత్రమే కాదు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా వచ్చిన ఆదాయాన్ని గమనించినా ఇదే విషయం స్పష్టమవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది 1207.45 కోట్ల ఆదాయం రాగా.. కేవలం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏకంగా 243.06 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా 10,096 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాతి స్థానంలో విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిలిచింది. ప్రధానంగా చినగదిలి, మద్దిలపాలెం, రుషికొండ, కలెక్టరేట్ వంటి మంచి మార్కెట్ ధర ఉన్న ప్రాంతాలు.. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉండటంతో గతేడాది రూ. 203.63 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు అనకాపల్లి పరిధిలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్య అధికంగా ఉంది. యలమంచిలి ప్రాంతం కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లల్లో మూడు ప్రాంతాలతో పోటీ పడుతోంది. పోటీపడుతున్న అనకాపల్లి రిజిస్ట్రేషన్ల ఆదాయపరంగా చూస్తే మధురవాడ, విశాఖపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పోటీ పడుతున్నాయి. మధువాడ కార్యాలయం నుంచి రూ.243.06 కోట్ల ఆదాయం రాగా.. విశాఖపట్నం కార్యాలయం నుంచి రూ.203.63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రధానంగా కలెక్టరేట్‌తో పాటు బీచ్‌రోడ్, రుషికొండ, చినగదిలి ప్రాంతాల్లో మార్కెట్ ధర అధికంగా ఉండటంతో పాటు రుషికొండ వరకు నూతన నిర్మాణాల వల్ల విశాఖపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆదాయం బాగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా అన్ని ప్రాంతాల కంటే ఎక్కువే. ఇక మధురవాడ నిర్మాణ రంగానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఈ ప్రాంతం నుంచి బాగా ఆదాయం సమకూరుతోంది. అయితే.. డాక్యుమెంట్ల పరంగా ఈ రెండు ప్రాంతాలతో అనకాపల్లి పోటీపడుతోంది. మధురవాడలో గడిచిన ఏడాదిలో 10,096 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. విశాఖపట్నంలో అంతకంటే ఎక్కువగా 12,946 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోటీగా అనకాపల్లిలో ఏకంగా 12,228 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగడం విశేషం. అంటే మధురవాడ కంటే ఎక్కువ డాక్యుమెంట్లు ఇక్కడ రిజి్రస్టేషన్ జరిగాయి. మరోవైపు యలమంచిలిలో కూడా ఈ మూడు ప్రాంతాలతో పోటీ పడుతూ 10,523 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు లేవు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎలా ఉందంటే...! ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్(విశాఖపట్నం, అనకాపల్లి) కార్యాలయాలు, మొత్తం 19 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు(ఎస్ఆర్వో) ఉన్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏయే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంత మేర ఆదాయం(కోట్లలో) వచ్చింది? ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయనే వివరాలను గమనిస్తే.... 83 శాతం లక్ష్యం సాధించాం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1449.56 కోట్ల మేర ఆదాయం అర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 31 మార్చి 2022 నాటికి 1207.45 కోట్ల మేర ఆదాయం సమకూరింది. నిరీ్ణత లక్ష్యంలో 83.29 శాతం మేర సాధించాం. మధురవాడ, విశాఖపట్నం రిజి్రస్టేషన్ కార్యాలయాల పరిధిలో మాత్రం నిరీ్ణత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటాం. –ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
సాక్షి, మధురవాడ (భీమిలి): మిత్రుని ఇంటిలో శుభకార్యానికి విజయనగరం వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలయింది. పీఎం పాలెం పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా బూరగాం గ్రామానికి చెందిన గేదెల కృష్ణారావు రైల్వేలో క్లర్క్(టీఎన్సీ)గా విశాఖలో పనిచేస్తున్నారు. ఉద్యోగం నిమిత్తం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మర్రిపాలెం టైప్ – 3 రైల్వే కాలనీలో కుటుంబంతో నివసిస్తున్నారు. విజయనగరంలో మిత్రుడి ఇంటిలో శుభకా ర్యం నిమిత్తం బుధవారం ఉదయం 8.30 సమయంలో స్కూటీపై భార్య వేణు(31)తో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో వీరు పీఎం పాలెం కారుషెడ్ కూడలి వద్దకి వచ్చేసరికి వెనుక నుంచి ఎమ్కే బిల్డర్స్‌కి చెంది న కాంక్రీట్ మిక్సింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న వేణు రోడ్డు మీద పడిపోగా ఆమె మీద నుంచి వాహనం వెళ్లిపోవడంతో శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కృష్ణారావు పక్కకు పడడంతో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వైద్యం నిమిత్తం అతడిని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. వారికి ఆరో తరగతి చదువుతు న్న కుమారుడు యుగంధర్, నాలుగో తరగతి చదువుతున్న కుమార్తె ఉదయశ్రీ సంతానం. మృతురాలి భర్త కృష్ణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పీఎం పాలెం ఎస్ఐ నిహార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. -
కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది..
పీఎంపాలెం(భీమిలి): వాల్తేరు.. వైజాగ్.. విశాఖపట్నం.. ఇలా ముచ్చటైన పేర్లతో అలరారుతున్న విశాఖ మహా నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర ప్రాంతంలో విస్తరించిన సుందర నగరం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విశాఖ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు ప్రాంతం జగదాంబ ఎలాగో.. పీఎంపాలెం మధురవాడ ప్రాంత వాసులకు కారుషెడ్ అలాగ.! ఈ ప్రాంతవాసుల మాటల్లో తరచూ వినిపించే పేరు కార్‌షెడ్. నేను కార్‌షెడ్ దగ్గర ఉన్నాను.. కార్‌షెడ్‌కు దగ్గరకు వస్తావా? కార్‌షెడ్ వద్ద ఉండు.. ఇలా సాగుతుంటుంది. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే వారైతే కార్‌షెడ్.. ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తారు. ఇక్కడ కారూ లేదు.. షెడ్డూ లేదు. దీనికి ఓ కథ మాత్రం ఉంది. చెన్నై– కోల్‌కతాకు వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారిలో విశాఖ శివారులో ఈ కూడలి ఉంది. ఈ కూడలి పేరే కార్‌షెడ్. చదవండి: ఏపీలో ‘రేషన్ డోర్ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం ఆ పేరు ఎలా వచ్చిందంటే.? పోతిన వారి కుటుంబానికి చెందిన నర్సింనాయుడు 1960 ప్రాంతంలో తన హోదాకు తగ్గట్టుగా కారు కొనుక్కున్నారు. అప్పట్లో విశాఖ నుంచి ఆనందపురం, తగరపువలస మీదుగా విజయనగరం, శ్రీకాకుకుళం తదితర ప్రాంతాలకు వెళ్లడానికి చిన్న తారురోడ్డు ఉండేది. అదే ప్రధాన రహదారి. నర్సింనాయుడు కారయితే కొన్నారు గానీ.. కారుపై నేరుగా ఇంటికి వెళ్లడానికి అనుకూలమైన కనీస రహదారి లేదు. ప్రధాన రహదారి వద్ద కారు దిగి ఇంటికి నడిచి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆయన తన కారును పార్కింగ్ చేయడానికి రహదారికి సమీపంలో షెడ్ నిర్మించారు. అప్పట్లో రోడ్డు మీద అడపాదడపా ప్రయాణించే ప్రైవేట్ బస్సులు తప్పితే.. మరో మోటారు వాహనం కనిపించేది కాదట. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో సొంత కారున్న వ్యక్తి నర్సింనాయుడు ఒక్కరే అని నిన్నటితరం పెద్దలు చెబుతారు. కారు కోసం నిర్మించిన షెడ్‌కు సమీపంలో చిన్న చిన్న దుకాణాలు, టీ కొట్లు వెలిశాయి. దీంతో అదో సెంటర్ అయిపోయింది. అలా కార్‌షెడ్ సెంటర్‌గా మారింది. ఈ ప్రాంతం మహా విశాఖలో విలీనం చేయడం, తారురోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతం తక్కువ సమయంలోనే విశేషంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారిపోయాయి. అపార్టుమెంట్లు వెలిశాయి. 50 ఏళ్ల కిందట ఈ ప్రాంతం మొత్తానికి ఒకే కారు ఉంటే.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎదురెదురు వాహనాలు తప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి కారు ఇప్పుడు లేదు, ఆ కారు పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్డూ లేదు. ప్రజల నాలుక మీద నడియాడిన కార్‌షెడ్ పేరు మాత్రం చిరస్థాయిగా ఉండిపోయింది. జాతీయ రహదారి నుంచి పీఎంపాలెం–పాత పీఎంపాలెం వుడా రోడ్డుకు వెళ్లేందుకు, కొమ్మాది, చంద్రంపాలెం సర్వీసు రోడ్లకు వెళ్లడానికి వీలుగా నిర్మించిన కూడలిలో ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ పాయింట్ ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు కారుషెడ్ సెంటర్ అంటే.. స్థానికులు మాత్రం కార్òÙడ్ అని పిలుస్తుంటారు. ఇదండీ కార్‌షెడ్ కథాకమామీషు! -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Visakhapatnam Road Accident Today: విశాఖప్నటం జిల్లాలోని మధురవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం మధురవాడ వద్దపై బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. మధురవాడ నుంచి విశాఖ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: Gunture: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
రెండేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో..
సాక్షి, మధురవాడ (భీమిలి): కొందరు చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరుస్తుంటారు. ఇటువంటివాళ్లను చూసి ఇది గాడ్ గిఫ్ట్ అంటాం. ఈ చిన్నారి విషయంలో మదర్ గిఫ్ట్ కూడా ఉంది. తన బిడ్డను తీర్చిదిద్దిన వైనం రికార్డులు తెచ్చిపెట్టింది. రెండేళ్ల వయసులోనే జ్ఞాన్దేవ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన గంధం అమిత ప్రియ ఏకైక కుమారుడు జ్ఞాన్దేవ్. బాలుడు తల్లి అమిత ప్రియ గీతం యూనివర్సిటీలో ఎం.కామ్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రి మనోహర్, తల్లి ఈశ్వరి కుమారీల సంరక్షణలో ఉంటుంది.అమితప్రియ రెండేళ్ల కుమారుడు జ్ఞాన్దేవ్కు 6 జాతీయ చిహ్నాలు , 12 రాశి ఫలాలు, 24 వాహనాలు, 13 రకాలు పండ్లు, 21 సంగీత పరికరాలు, 13 సముద్ర జీవ రాశులు, 10 చారిత్రక స్థలాలు, 10 స్టేషనరీ వస్తువులు, 10 కంప్యూటర్ విడిభాగాలు, 10 రకాల క్రీడల బంతులు, 8 ఇండియన్ సీఈవోలు, 5 ప్రార్థనా స్థలాలు, 6 మతాలు, 8 రకాల నీటి మొక్కల మూలాలు, 9 మంచి అలవాట్లు గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. అలాగే 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. చదవండి: (విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి) -
మధురవాడలో టీడీపీ నేత హల్చల్
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో టీడీపీ నేత మొల్లి లక్ష్మణరావు హల్చల్ సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్‌నంటూ వార్డు సచివాలయంలో కార్యకర్తలతో కలిసి లక్ష్మణరావు తనిఖీలు చేశారు. జీవీఎంసీ 5వ వార్డు కార్పొరేటర్ తండ్రి లక్ష్మణరావు.. కుమార్తె స్థానంలో తానే కార్పొరేటర్ అంటూ నానా హంగామా చేశారు. సచివాలయంలో సిబ్బంది వివరాలు చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఇకపై సచివాలయంలో తనకు తెలీకుండా ఏమీ జరగకూడదంటూ హుకుం జారీ చేశారు. చదవండి: భూముల స్వాధీనంపై ఎల్లోమీడియా గగ్గోలు: అంబటి త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు -
‘మా అన్నయ్య టెకీ, వదిన డాక్టర్.. తనపై ఆ ముద్ర సరికాదు’
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ/పీఎంపాలెం: మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఎన్నారై కుటుంబం అనుమానాస్పదమృతి మిస్టరీ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పోలీసులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఏసీపీ కుమార స్వామి నేతృత్వంలో పీఎంపాలెం సీఐ రవికుమార్ దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం నాలుగు మృతదేహాలను సొంతగ్రామమైన విజయనగరం జిల్లా గంట్యాడకు తరలించారు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. గంట్యాడలో బంగారునాయుడు కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా స్థిరపడింది. ఆయనకు విజయనగరం, విశాఖ జిల్లాలో పలు చోట్ల భూములు, స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాదులో విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల పరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బంగారునాయుడు బెహరెయిన్‌లో ఉద్యోగంతోపాటు పెట్రో సంబంధ వ్యాపారాలు చేసేవారు. వ్యాపార పరమైన తగాదాలు ఉండవచ్చునని బంధువుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొడుకే తల్లిదండ్రులను హత్యచేసి ఉండవచ్చునని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉండకపోవచ్చునని వారు భావిస్తున్నారు. హత్యాకోణంలో పోలీసులు దర్యాప్తు జరపాలని వారు కోరుతున్నారు. బంగారునాయుడు కుటుంబం ఉంటున్నది ‘సి’ బ్లాక్ కావడంతో బయట వ్యక్తులు ప్రవేశించేందుకు అవకాశం ఉందని వారు చెబుతున్నారు. హత్య కోణంలో దర్యాప్తు చేయాలి మధురవాడ (భీమిలి) : ఢిల్లీ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న దీపక్ మెరిట్ స్టూడెంట్ అని, మానసిక రోగిగా ముద్ర వెయ్యడం సరికాదని మృతి చెందిన బంగారునాయుడు ఆఖరి సోదరుడు చిన అప్పలనాయుడు పేర్కొన్నారు. తన అన్నయ్య కుటుంబాన్ని ఎవరో హత్య చేసి ఉంటారని, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయమని నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాను కోరతామని చినఅప్పలనాయుడు ‘సాక్షి’కి చెప్పారు. తమది బాగా స్థిరపడిన కుటుంబమని, తమ తండ్రి శ్రీరాములు నాయుడు డీసీఎంస్ ప్రెసిడెంట్‌గా 15ఏళ్లు పనిచేశారన్నారు. ‘‘మా సోదరుడు కూడా బాగా స్ధిపడిన వ్యక్తి. మా వదిన డాక్టర్ ఆవిడ పెంపకంలో పెరిగిన వ్యక్తి దీపక్... అతనికి ఏ రకమైన మానసిక ఇబ్బందులు లేవన్నారు. నా సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆయన ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నాం. మృతి చెందినవారి శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయని, వీటిని చూస్తే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అనుమానం కలుగుతోంది’’ అని అన్నారు. -
ఎన్ఆర్ఐ కుటుంబం మృతి: అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది?
-
ఎన్ఆర్ఐ కుటుంబం మృతి: అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం / మధురవాడ / పీఎం పాలెం : మధురవాడ ఆదిత్య ఫార్చ్యూన్ అపార్టుమెంట్లో అగ్ని ప్రమాదంలో ఎన్ఆర్ఐ కుటుంబం మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తమ్ముడి శరీరంపై గాయాలుండడంతో మానసిక స్థితి సరిగా లేని పెద్ద కుమారుడే హతమార్చి తనూ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అన్న అనుమానాలు పోలీసులు ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బహ్రెయిన్‌లో స్థిరపడిన విజయనగరం జిల్లా గంట్యాడ వాసి సుంకరి బంగారునాయుడు నాలుగేళ్ల కిందట నగరానికి విచ్చేశారు. మధురవాడ మిథిలాపురి ఉడాకాలనీలోని విలాసవంతమైన ఆదిత్య ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ సి బ్లాకు, 505 ప్లాట్‌లో భార్య నిర్మల, ఇద్దరు కుమారులు దీపక్, కశ్యప్‌లతో కలిసి 8 నెలలు క్రితం అద్దెకు దిగారు. అక్కడికి సమీపంలోనే సుమారు కోటి రూపాయల విలువ చేసే భవనం నిర్మించుకుంటుండడంతో అక్కడ అద్దెకు దిగారని బంధువులు చెబుతున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది..? బంగారునాయుడు నివసిస్తున్న ప్లాట్‌లో బుధవారం రాత్రి ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సివిల్ ఇంజినీర్‌గా పనిచేసిన బంగారునాయుడు బహ్రెయిన్‌లో తెలుగు అసోసియేషన్ కార్యదర్శిగా గతంలో పనిచేశారు. 2007లో ఏయూ నుంచి డాక్టరేట్ తీసుకున్నారు. రఘు కళాశాలకు కన్సటెంట్‌గా పనిచేస్తున్నారు. అతని భార్య నిర్మల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. దీపక్ ఢిల్లీ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి సివిల్స్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. చిన్నకుమారుడు కశ్యప్ ఇంటర్ చదువుతున్నాడు. అందరూ విద్యావంతులై అన్యోన్యంగా జీవిస్తున్న ఇంటిలో ఏం జరిగిందన్నది తెలియడం లేదు. చివరగా ఆ ఇంటిలోకి బుధవారం రాత్రి 8.55గంటలకు బంగారునాయుడు ప్రవేశించినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా తెలిసింది. అనంతరం పెద్దగా గొడవ జరిగినట్లు పక్క ప్లాట్ల వారు చెబుతున్నారు. అయితే కుటుంబ వ్యవహారం కావడంతో ఎవరూ జోక్యం చేసుకోలేదంటున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారి 3 గంటల సమయంలో ఒక్కసారిగా శబ్ధం వచ్చినట్లు సెక్యూటీ సిబ్బంది గ్రహించారు. నాలుగు గంటల సమయంలో ప్లాట్ నుంచి పొగ రావడంతో అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనతో అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ప్లాట్ వద్దకు చేరుకుని స్థానికుల సాయంతో తలుపులు బద్దలు గొట్టి చూసేసరికి బంగారునాయుడు తలుపును అనుకుని పడి ఉన్నాడు. మరికొద్ది దూరంలో భార్య నిర్మల మృతదేహం ఉంది. చిన్నకుమారుడు కశ్యప్ ఓ బెడ్ రూమ్‌లో... పెద్ద కుమారుడు దీపక్ బాత్రూమ్లో అచేతనంగా పడి ఉన్నారు. దీపక్ మానకసిక స్థితి బాగోలేకే గురువారం ఉదయం సంఘటన స్థలికి చేరుకున్న నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ బంగారునాయుడు, అతని భార్య నిర్మల, చిన్నకుమారుడు కశ్యప్ మృతదేహాలపై గాయాలుండడంతో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోందన్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ముగ్గురినీ దీపక్ హతమార్చి ఉంటాడని అనుమానిస్తున్నామన్నారు. పరిసర ప్లాట్ల వారితో మాట్లాడాక అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. 5వ అంతస్తులో ఒకే సీసీ కెమెరా ఉందని, అక్కడి ఫుటేజీ క్షుణ్ణంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే వారే ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా హత్య చేశారా? అని విచారణ చేస్తున్నట్లు సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. మరోవైపు బంగారునాయుడు కుటుంబంలో వివాదాలు, మనస్పర్థలు లేవని కాలనీవాసులు చెబుతున్నారు. దీపక్ మానసిక స్థితి అంతా సక్రమంగా ఉందని, సివిల్స్‌కు సిద్ధమవుతున్నాడని, బంధువులు చెబుతున్నారు. దీపక్ మానసిక స్థితిని అనుమానించాల్సిన పని లేదని, పక్కా ప్రణాళిక ప్రకారం ఎవరో హత్య చేశారని... ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రమాదం నుంచి బయటపడేందుకు యత్నించాడా..? బంగారునాయుడు, నిర్మల, కశ్యప్ మృతదేహాలపై గాయాలున్నప్పటికీ దీపక్ శరీరంపై గాయాలేవీ లేవు. మానసిక సమస్యతో బాధపడుతున్న దీపక్... క్షణికావేశంలో తల్లిదండ్రులు, తమ్ముడిని హతమార్చి... తాను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సంఘటన జరిగిన తీరు పరిశీలిస్తే... బాత్రూమ్లో కుళాయి విప్పి ఉండడం... అక్కడే దీపక్ పడి ఉండడంతో... ముగ్గురినీ హతమార్చాక ప్రమాదంగా చిత్రీకరించి తాను అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో అగ్నికి ఆహుతైపోగా... ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు బాత్రూమ్లోకి ఏమైనా వెళ్లాడా..? అని అనుమానిస్తున్నారు. చదవండి: మధురవాడలో మరణ మృదంగం -
పోలీస్ సైరన్ వేసుకుని వచ్చి బురిడీ!
సాక్షి, విశాఖపట్నం: పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు కొట్టేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన మధురవాడలో మంగళవారం ఈ చోటుచేసుకుంది. వివరాలు.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లుతో కలిసి చర్చించాడు. ఇద్దరూ కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. (చదవండి: కస్టడీ నుంచి నిందితుడి పరారీ) అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ వాహనంలో వచ్చిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇటీవల ఓ భూమి అమ్మగా వచ్చిన రూ.50 లక్షల నగదులో 20 లక్షలతో మరో భూమిని కొనుగోలు చేయడానికి తాను వచ్చానని నాగేశ్వరావు చెబుతున్నాడు. బాధితుని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ దోపిడీ విషయం పై కొన్ని అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావుతో పాటు బ్రోకర్ వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారిస్తున్నారు. (విశాఖ సీపీగా మనీష్‌కుమార్ సిన్హా బాధ్యతలు) -
టీడీపీ నేత అనుచరులు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అండదండలతో నకిలీ ఇంటి పన్ను పుస్తకాలతో భూ దందా సాగించిన ఇద్దరు భూ కబ్జాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ సర్వేనెంబర్ 388 వికలాంగుల కాలనీ లో 180 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. టీడీపీ నేత అండదండలతో సాగిన ఈ నిర్వాకంలో భూ కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసు యంత్రాంగాలు కదలికతో ఈ వ్యవహారంలో ఇద్దరు అరెస్టు కాగా, మరొక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత టీడీపీ ఇంచార్జ్ చిక్కల విజయబాబు అండదండలతో అతని వద్ద పనిచేసిన డ్రైవర్ మల్లెల విజయ్ కుమార్, గంట లక్ష్మణ్ కుమార్, తమ్మినేని రమణ వీరు ముగ్గురూ కలిసి భూ అక్రమాలకు తెరతీశారు. మధురవాడ వికలాంగుల కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 336లో రెండు 90 గజలు బిట్లు దాదాపుగా 180 గజాలు ప్రభుత్వ భూమిని 2014 ఈ సంవత్సరం నుండి అక్కడ నివసిస్తున్నట్లు నకిలీ జీవీఎంసీ ఇంటి పన్ను పుస్తకాలను చూపించి గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పట్టాల పండుగలో క్రమబద్ధీకరణ చేయించుకొని సుమారు కోటి రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడినట్లు ఆధారాలు వెలువడ్డాయి. ఇవే కాకుండా కాలనీల్లో పలు స్థల యజమానులను భయబ్రాంతులకు గురి చేసి స్థలాలను కాజేసినట్లు ఇప్పటికే పలు ఆధారాల దొరికాయని వాటి మేరకు స్థానికుల ఫిర్యాదుతో చిన్న గదిలి మండలం తహసిల్దార్ ఆర్ నరసింహమూర్తి ఆదేశాలు మేరకు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వీరి ముగ్గురి పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. భూ కబ్జాలకు పాల్పడిన నిందితులు ఏ 1 మల్లెల విజయ్ కుమార్, ఏ3 నిందితుడు తమ్మినేని రమణలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ఏ 2 నిందితుడైన గంట లక్ష్మణ్ కుమార్ పరారీలో ఉన్నాడని అతనిని కూడా గాలించి పట్టుకుంటామని సీఐ రవికుమార్ వెల్లడించారు. -
విశాఖ ఏసీబీ వ్యవహారంపై సీఎం సీరియస్
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, తప్పుడు విధానాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది కూడా తేల్చాలని స్పష్టం చేశారు. ఈ నెల 9న ఏసీబీ డీఎస్పీ, సీఐ, సిబ్బంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరిపి.. రూ.61,500 నగదు రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్లో కనిపించినట్లు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. అయితే, ఏసీబీ అధికారులే బయటి నుంచి డబ్బు తెచ్చి డాక్యుమెంట్ రిజిస్టర్లో పెట్టారని, తాము ఎలాంటి తప్పు చేయకపోయినా కేసు నమోదు చేశారని సబ్ రిజిస్ట్రార్ తారకేష్ మంగళవారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతోపాటు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీసీ కెమెరా ఫుటేజీని సైతం ఆయన సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ తదుపరి చర్యలకు ఆదేశించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం ఈ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తక్షణమే ప్రతిపాదనలు పంపాలని బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి.తొలుత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ముందుగా అధిక రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగే ‘ఎ’ కేటగిరీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటిని అమరుస్తారు. అనంతరం ‘బి’, ‘సి’ కేటగిరీ కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేస్తారు. తదుపరి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమరుస్తారు. డీఐజీ సస్పెన్షన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ విశాఖపట్నం డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఎ.రవీంద్రనాథ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా, బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మధురవాడ సబ్ రిజిస్ట్రారు టి.తారకేష్‌ను డీఐజీ రవీంద్రనాథ్ బదిలీ చేశారు. ప్రాథమిక ఆధారాల పరిశీలన అనంతరం డీఐజీ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు బుధవారం ప్రకటించారు. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం : ఉప ముఖ్యమంత్రి బోస్ ఇదిలావుంటే.. బుధవారం కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను సచివాలయంలో కలిశారు. తప్పు చేయకపోయినా ఏసీబీ అధికారులు తమను కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయన స్పందిస్తూ.. తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని, తప్పు చేయని వారికి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని అన్నారు. అనంతరం వారిని వెంటబెట్టుకుని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులే బయటినుంచి డబ్బు తెచ్చి పెట్టినట్లు పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని మంత్రి బోస్ విలేకరులకు చెప్పారు. విశాఖ రేంజ్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల డీఐజీని ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. -
సబ్ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్, ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ దృష్టికి వెళ్లడంతో.. తీవ్రంగా స్పందించిన ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్, అవినీతి నిరోధక శాఖల్లో కలకలం రేపింది. అసలేం జరిగిందంటే.. ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్‌పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్ రిజిస్ట్రార్ టి.తారకేష్‌ను ఏసీబీ సీఐ గఫూర్ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్‌లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ తీసుకొచ్చిన మధ్యవర్తులు తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించడంతో కేసు పెట్టడం వీలు కాలేదు. ఏసీబీ సీఐ బయట నుంచి డబ్బు తెచ్చి రికార్డుల్లో పెట్టినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సొమ్ముతో లంచం తీసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని బెదిరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. ఇందుకోసం విచారణల పేరుతో వేధించారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీపై ఒత్తిడి తెచ్చి సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేయించారు. ఆ తరువాత తారకేష్‌ను డీఐజీ యథాస్థానానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ సీసీ కెమెరాలోని ఫుటేజిని సాక్ష్యాలుగా తీసుకుని మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను కలిశారు. సీసీ ఫుటేజిని వీక్షించిన ఉప ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏసీబీ అధికారులపై విచారణ జరిపించి.. డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. సీసీ ఫుటేజి సాక్ష్యాలను, సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదును ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు పంపించారు. ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గి సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖపట్నం డీఐజీని సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చారు. -
భార్యపై అనుమానంతో...!
సాక్షి, పీఎంపాలెం/మధురవాడ(భీమిలి): పచ్చని కుటుంబంలో అనుమానం కల్లోలాన్నే సృష్టించింది. కాయకష్టంతో జీవనం సాగించే అన్యోన్యమైన సంసారంలో నిప్పులు పోసింది. చివరకు భార్య హత్యకు దారి తీసింది. ఈ ఘటనతో మధురవాడ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భార్యపై అనుమానంతో ఆమె మెడపై కాలితో తొక్కి ఓ వ్యక్తి అతికిరాతకంగా హతమార్చిన ఘటన మధురవాడ జీవీఎంసీ శివశక్తినగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ పి.సూర్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శివశక్తినగర్‌లో నివసిస్తున్న ఇంటి సింహాచలంతో భీమిలి మండలం తాటితూరుకు చెందిన పద్మ(29)తో సుమారు 11 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ధర్మతేజ(9), సంజన(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింహాచలం ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు చేదోడువాదోడుగా ఉంటుందని పద్మ మారికవలస కూడలిలో టీకొట్టు నడుపుతోంది. సాయంత్రం వేళ న్యూడిల్స్ షాపు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్వహిస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మద్యం రక్కసి ప్రవేశించింది. మద్యానికి బానిసైన సింహాచలం.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో నిత్యం ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో అనుమానం పెనుభూతమైంది. పద్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిందన్న అనుమానం అతనికి నిద్ర పట్టనివ్వలేదు. దీంతో భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింహాచలం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. పద్మ మెడ మీద కాలు వేసి తొక్కి కిరాతకంగా చంపేశాడు. ఆమె మరణించదని నిర్ధారించుకుని తరువాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శుక్రవారం పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ తెలిపారు. తల్లి పరలోకానికి.. తండ్రి జైలుకు.. ఎంతో అన్యోన్యంగా జీవించిన ఆ కుటుంబంలోకి అనుమానం చొరబడి జీవితాంతం అండగా ఉంటానని మూడు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్న భర్తే యముడై కడతేర్చాడు. దీంతో అభం శుభం ఎరుగని ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. తల్లి కాటికి, తండ్రి జైలుకి వెళ్లడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది -
‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’
అమరావతి: విశాఖ జిల్లాలో భూబకాసురులు పెట్రేగిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ రూరల్, భీమునిపట్నం మండలాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. మధురవాడలో 10 ఎకరాల ప్రభుత్వ భూమికి టీడీపీ నాయకుడు మదమంచి రామకృష్ణ తప్పుడు పట్టా సృష్టించి అమ్మేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారాయని చెప్పారు. విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు సంబంధించిన భూ రికార్డులు టాంపరింగ్ అయినట్లు జిల్లా కలెక్టర్ పత్రికాముఖంగా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. భూబకాసురులపై, సహకరించిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని సూచించారు. -
మధురవాడలో అగ్ని ప్రమాదం
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మధురవాడ శివశక్తి నగర్లో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్థమయ్యాయి. సుమారు రూ.5లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. -
సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడులు
మధురవాడ (విశాఖపట్నం) : సబ్ రిజిస్ట్రార్ ఆనందరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహిస్తున్నారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న ఆనందరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో విశాఖపట్నం ఏసీబీ అధికారులు, పశ్చిమగోదావరి ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆయన కార్యాలయం, ఇంటిపై దాడులు నిర్వహించారు. మధురవాడలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పశ్చిమగోదావరి ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం లాసన్స్‌బే కాలనీలోని సబ్ రిజిస్ట్రార్ ఇంటిపై విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అలాగే పశ్చిమ గోదావరి నర్సాపురంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. -
విశాఖలో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
- ఐదుగురి పరిస్థితి విషమం మధురవాడ(విశాఖపట్టణం): విశాఖపట్నం లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఆర్టీసీ బస్సు విశాఖ వైపు వెళ్తోంది. అదే సమయంలో మారికవలస వద్ద సర్వీసు రోడ్డులోంచి ఓ స్కార్పియో ఒక్కసారిగా హైవేపైకి వచ్చింది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బస్సును కుడిచేతి వైపు తీసుకెళ్లాడు. దీంతో అటువైపున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ క్రమంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్ పై నుంచి దూసుకెళ్లి పది మీటర్ల ముందుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో, పాన్ షాప్ వద్ద ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఆరుగురు మృతిచెందగా, క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.