వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లకు టీడీపీ నేతల బెదిరింపులు | Telugu Desam Party warns YSR Congress agents in Madhurawada | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లకు టీడీపీ నేతల బెదిరింపులు

Published Wed, May 7 2014 2:59 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Telugu Desam Party warns YSR Congress agents in Madhurawada

విశాఖపట్నం నగరం మధురవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 244 నుంచి 258 వరకూ ఉన్న బూత్లలో ఓటర్ల స్లిప్పులు ఆధారాలు సరిగా లేవని టీడీపీ స్థానిక నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అయా పోలింగ్ బూత్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు వెళ్లిపోవాలని వారు హుంకరించారు.

 

అందుకు బయటకు వెళ్లేది లేదంటూ వైఎస్ఆర్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్ద భీష్మించుకుని కూర్చున్నారు. వైఎస్ఆర్ ఏజెంట్లను బయటకు పంపాలంటూ స్థానిక అధికారులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement