సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అండదండలతో నకిలీ ఇంటి పన్ను పుస్తకాలతో భూ దందా సాగించిన ఇద్దరు భూ కబ్జాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురవాడ సర్వేనెంబర్ 388 వికలాంగుల కాలనీ లో 180 గజాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. టీడీపీ నేత అండదండలతో సాగిన ఈ నిర్వాకంలో భూ కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదయ్యాయి. పోలీసు యంత్రాంగాలు కదలికతో ఈ వ్యవహారంలో ఇద్దరు అరెస్టు కాగా, మరొక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గత టీడీపీ ఇంచార్జ్ చిక్కల విజయబాబు అండదండలతో అతని వద్ద పనిచేసిన డ్రైవర్ మల్లెల విజయ్ కుమార్, గంట లక్ష్మణ్ కుమార్, తమ్మినేని రమణ వీరు ముగ్గురూ కలిసి భూ అక్రమాలకు తెరతీశారు. మధురవాడ వికలాంగుల కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 336లో రెండు 90 గజలు బిట్లు దాదాపుగా 180 గజాలు ప్రభుత్వ భూమిని 2014 ఈ సంవత్సరం నుండి అక్కడ నివసిస్తున్నట్లు నకిలీ జీవీఎంసీ ఇంటి పన్ను పుస్తకాలను చూపించి గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పట్టాల పండుగలో క్రమబద్ధీకరణ చేయించుకొని సుమారు కోటి రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడినట్లు ఆధారాలు వెలువడ్డాయి.
ఇవే కాకుండా కాలనీల్లో పలు స్థల యజమానులను భయబ్రాంతులకు గురి చేసి స్థలాలను కాజేసినట్లు ఇప్పటికే పలు ఆధారాల దొరికాయని వాటి మేరకు స్థానికుల ఫిర్యాదుతో చిన్న గదిలి మండలం తహసిల్దార్ ఆర్ నరసింహమూర్తి ఆదేశాలు మేరకు ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడిన వీరి ముగ్గురి పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేసి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.
భూ కబ్జాలకు పాల్పడిన నిందితులు ఏ 1 మల్లెల విజయ్ కుమార్, ఏ3 నిందితుడు తమ్మినేని రమణలను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, ఏ 2 నిందితుడైన గంట లక్ష్మణ్ కుమార్ పరారీలో ఉన్నాడని అతనిని కూడా గాలించి పట్టుకుంటామని సీఐ రవికుమార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment