పోలీస్‌ సైరన్‌ వేసుకుని వచ్చి బురిడీ! | Miscreants Looted Rs 20 Lakhs At Madhurawada In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో ఘటన, రూ.20 లక్షలు చోరీ!

Aug 18 2020 2:42 PM | Updated on Aug 18 2020 3:42 PM

Miscreants Looted Rs 20 Lakhs At Madhurawada In Visakhapatnam - Sakshi

అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ వాహనంలో వచ్చిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు.

సాక్షి, విశాఖపట్నం: పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు దుండగులు ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి రూ. రూ.20 లక్షలు కొట్టేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన మధురవాడలో మంగళవారం ఈ చోటుచేసుకుంది. వివరాలు.. మధురవాడకు చెందిన రియల్టర్ కోటేశ్వరరావు ఓ స్థలం కొనుగోలు విషయంపై మరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ వెంకటేశ్వర్లుతో కలిసి చర్చించాడు. ఇద్దరూ కలిసి నగర శివారులోని ఓ స్థలాన్ని మంగళవారం పరిశీలించారు.
(చదవండి: కస్టడీ నుంచి నిందితుడి పరారీ)

అదే సమయంలో పోలీస్ సైరన్ మోగిస్తూ వాహనంలో వచ్చిన దుండగులు నాగేశ్వరరావు వద్ద ఉన్న 20 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఇటీవల ఓ భూమి అమ్మగా వచ్చిన రూ.50 లక్షల నగదులో 20 లక్షలతో మరో భూమిని కొనుగోలు చేయడానికి తాను వచ్చానని నాగేశ్వరావు చెబుతున్నాడు. బాధితుని ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ఈ దోపిడీ విషయం పై కొన్ని అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావుతో పాటు బ్రోకర్ వెంకటేశ్వరరావును కూడా పోలీసులు విచారిస్తున్నారు.
(విశాఖ సీపీగా మనీష్‌కుమార్‌ సిన్హా బాధ్యతలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement