విజయవాడ: రాష్ట్రంలో కరువుపై ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన కరువుపై రాష్ట్రంలో పార్టీ చేపట్టిన ధర్నాలన్నీ విజయవంతమయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజలు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నారని అన్నారు. పశుగ్రాసం దొరకక పశువులు చనిపోతున్నాయని అయినా కరువుపై బాబు ప్రభుత్వం స్పందించించడం లేదని ఆమె వాపోయారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు ప్రజల ఆగ్రహానికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ప్రతిపక్షం ధర్నాలతో అయినా కళ్లు తెరవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలను ఉధృతం చేసి ప్రభుత్వ పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
ప్రభుత్వం కళ్లు తెరవాలి: వాసిరెడ్డి పద్మ
Published Mon, May 2 2016 4:50 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement