
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడే కారణమని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. బాబు డైరెక్షన్‌లోనే బ్రహ్మారెడ్డి మాచర్లలో అలజడి సృష్టించారన్నారు. హత్యా రాజకీయాలను టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, బీసీలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.
చంద్రబాబు హయాంలో పల్నాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సీఎం జగన్ పాలనలో పల్నాడుకి జిల్లా వచ్చిందన్నారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాలను రూ. 4700 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని విషయం ప్రజలు గ్రహించాలన్నారు. పులివెందులతో సమానంగా పల్నాడు అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేస్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment