మాచర్ల టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఛైర్ పర్సన్ మంగమ్మ అజ్ఞాతంలోకి వెళ్లటంతో.. నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ మొదలైంది. గతంలో అధిష్టానం ముగ్గురు ఛైర్ పర్సన్‌ల పదవీ కాలాన్ని పంచింది. అప్పట్లో శ్రీదేవి అనే ఛైర్ పర్సన్‌ను బలవంతంగా పదవీనుంచి తొలగించటంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత వచ్చిన మంగమ్మను సైతం బలవంతంగా పదవీనుంచి రాజీనామా చేయించారు.