కళాశాలకు వెళ్తున్న విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని గుర్తించిన బాలిక స్నేహితులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మాచర్ల (గుంటూరు) : కళాశాలకు వెళ్తున్న విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని గుర్తించిన బాలిక స్నేహితులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(17) రోజూ కళాశాలకు నడుచుకుంటూ వెళ్లి వస్తోంది. గత కొంత కాలంగా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన తాడి రమణయ్య(20) ఆ విద్యార్థిని వెంటపడుతూ.. వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని దారి కాచి అడ్డుకొని తన బైక్ ఎక్కమని బెదిరించాడు. ఈ విషయాన్ని బాలిక తన స్నేహితులతో పాటు స్థానికులకు చెప్పడంతో.. బాలిక స్నేహితులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారం రోజుల క్రితమే మాచర్లలో ఆకతాయిల వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.