![A full inquiry Into The Macherla Incident DGP Rajendranath Reddy - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/17/DGP.jpg.webp?itok=Mg83Wpcv)
విజయవాడ : మాచర్ల ఘటనపై విచారణకు ఆదేశించారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. దీనిలో భాగంగా ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్లకు పంపారు.మాచర్లలో నిన్న(శుక్రవారం) రాడ్లు, కర్రలతో స్వైర విహారం చేసిన ఘటనపై డీజీపీ ఆరా తీశారు. అదనపు బలగాలను కూడా మాచర్లలో మోహరించినట్లు డీజీపీ తెలిపారు.
ప్రస్తుతం మాచర్లలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అవాంఛనీయ శక్తులను ఉపేక్షించబోమని పేర్కొన్న డీజీపీ.. మాచర్ల ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ అల్లర్ల ఘటనకు సంబంధించి నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు డీజీపీ.
చదవండి: టీడీపీ రౌడీల స్వైర విహారం
Comments
Please login to add a commentAdd a comment