ఎన్నికల పోలింగ్ హింసాత్మక ఘటనల నుంచి తేరుకోవడానికి.. ప్రశాంతత నెలకొనేందుకు పల్నాట నాలుగురోజుల సమయం పట్టింది. అలాంటి చోట మళ్లీ అల్లర్లకు తెలుగు దేశం పార్టీ కుట్రలు చేస్తోందా?. వద్దని పోలీసులు వారిస్తున్నా చలో మాచర్ల చేపట్టం వెనుక ఆంతర్యం ఏమిటి?.
👉మాచర్లకు టీడీపీ నేతలు.. మంచిది కాదు: సీఈవో ముకేష్ కుమార్ మీనా
పిన్నెల్లి వీడియోపై సీ ఈవో సంచలన ప్రకటన
ఆ వీడియోను మేము విడుదల చేయలేదు
ఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదు
అది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం
దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లింది
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీ ఓ, ఏపీ ఓలను సస్పెండ్ చేశాం
మాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదు
ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చింది
టీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాం
వాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారు
మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉంది
బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదు
ఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను
👉టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్
- ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది
- 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది
- ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు
- ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
- ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు
- ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారు
- ఈసీ తీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
- ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారు
- పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు
- తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు
- చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు
- పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు
- టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?
- ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా?
- టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి
- ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం
👉టీడీపీ కీలక నేతల గృహనిర్బంధం
మాచర్లలో టీడీపీ ‘చలో మాచర్ల’కు అనుమతి లేదని పోలీసుల స్పష్టీకరణ
ఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ విజ్ఞప్తి
- మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహ నిర్బంధం
- గొల్లపూడిలో దేవినేని ఉమ, విజయవాడలో వర్ల రామయ్య, గుంటూరులో నక్కా ఆనంద్, కనపర్తిలో శ్రీనివాసరావు ఇళ్ల వద్ద పోలీసులు
- అయినా మాచర్ల వెళ్లితీరతామంటూ టీడీపీ నేతల మొండిపట్టు.. ఉద్రిక్తత
👉మాచర్లలో భారీ పోలీసు బందోబస్తు
పల్నాడు జిల్లాలో మరొక భారీ కుట్రకు ప్లాన్ చేసిన తెలుగుదేశం పార్టీ?
- పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు చలో పల్నాడు.. మాచర్ల పేరుతో తెలుగుదేశం నేతలు మరొక డ్రామా
- ఉమ్మడి గుంటూరు ,కృష్ణా జిల్లాల నేతలతో చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ
- జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది అని చెబుతున్న పోలీసులు
- నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పోలీసులు
- పోలీసుల హెచ్చరికలను పట్టించుకోని తెలుగుదేశం పార్టీ
- చలో మాచర్ల పేరుతో పల్నాడులో మరోసారి విధ్వంసం సృష్టించడానికి తెలుగుదేశం రెడీ అవుతున్న తెలుగుదేశం నేతలు
👉 పల్నాడులో టీడీపీ చలో మాచర్ల పిలుపుతో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు
👉 మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేత దేవినేని ఉమా గృహ దిగ్భంధం.. మరికొందరు నేతల్ని సైతం అడ్డుకున్న పోలీసులు
👉 మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదు: పోలీసులు
👉 మాచర్లలో ఎలాగైనా పర్యటన చేపడతాం: టీడీపీ నేతలు
తెలుగు దేశం పార్టీ ఇవాళ చలో మాచర్లకు పిలుపు ఇచ్చింది.
ఈ ఉదయం మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క , ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవీ ప్రకాష్ లాంటి కీలక నేతలు పాల్గొనేందుకు ప్రణాళిక రూపొందించారు.
పోలింగ్ సందర్భంగా ఇక్కడ జరిగిన అల్లర్లపై ఈసీ సీరియస్ అయ్యింది.
దీంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మాచర్లలోఎలాంటి పర్యటనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.
అయినా కూడా టీడీపీ సానుభూతిపరులకు పరామర్శ పేరిట చలో మాచర్ల నిర్వహించి తీరతామని టీడీపీ అంటోంది.
దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండగా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొందక్కడ.
Comments
Please login to add a commentAdd a comment