మాచర్ల టౌన్ (గుంటూరు) : పాఠశాలకు వెళ్లే విద్యార్థినిని నిత్యం వేధిస్తున్న ఓ వివాహితుడికి దేహశుద్ధి జరిగింది. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని 18వ వార్డుకు చెందిన కర్రా దానం(22) వివాహితుడు. అతడు స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న విద్యార్థినిని రోజూ వేధిస్తున్నాడు. వెకిలి చేష్టలతో ఏడిపిస్తున్నాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపింది. వారు శుక్రవారం కాపు కాసి బాలికను వేధిస్తున్న దానంను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా అతడు తప్పించుకుని పారిపోయాడు. అనంతరం వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దానంపై ఫిర్యాదు చేశారు.