
సాక్షి, మాచర్ల: అంధుల క్రికెట్‌లో గుంటూరు జిల్లా మాచర్ల వాసి ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి సత్తా చాటుతున్నాడు. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తూ అరుదైన విజయాలు అందిస్తున్నాడు. గతేడాది అజయ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో టీ20 వరల్డ్‌కప్ సాధించిన భారత జట్టు, ఈసారి వన్‌డే వరల్డ్ కప్‌ను సైతం కైవసం చేసుకుంది. శనివారం దుబాయ్‌లో జరిగిన వన్‌డే వరల్డ్‌కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.
అజయ్‌కుమార్‌రెడ్డి 1990 జూన్ 3న జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నాలుగేళ్ల వయసులో తలుపు గడియ తగిలి అజయ్‌కుమార్ కుడి కన్ను పూర్తిగా కోల్పోగా, ఎడమ కన్ను పాక్షికంగా దెబ్బతింది. అయినప్పటికీ ఆత్మస్థైర్యంతో అంధుల పాఠశాలలో విద్యనభ్యసించాడు. క్రికెట్‌పై ఆసక్తితో పట్టుదలగా సాధన చేసి అంచెలంచెలుగా ఎదిగాడు. 2017లో అంధుల టీ–20 జట్టుకు నాయకత్వం వహించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు. తాజాగా మరోసారి సత్తాచాటి దేశానికి వన్డే వరల్డ్ కప్ సాధించాడు. ప్రస్తుతం అజయ్‌కుమార్‌రెడ్డి గుంటూరులో ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment