సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం డీజీపీ కార్యాలయం వద్ద హైడ్రామాకు తెర తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్ల ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ఆయన తనదైన శైలిలో యత్నించారు. డీజీపీ కార్యాలయం బయట పది నిమిషాల పాటు బైఠాయించారు. మీడియా కవరేజ్ కోసంచంద్రబాబు రోడ్డుపై కూచ్చుని హడావుడి చేశారు. మరోవైపు మాచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ తెలిపారు. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, మాచర్ల ఘటనను సుమెటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు దేనికోసం డీజీపీ కార్యాలయం ముందు ఎందుకు బైఠాయించారో అక్కడున్న వారికి సైతం అంతుపట్టంలేదు. ఎన్నికల్లో ప్రజల నుంచి సానుభూతి పొందట కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు నాయుడు.. తాజాగా మాచర్ల ఘటనను రాజకీయ పావుగా ఉపయోగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. (టీడీపీలో కల్లోలం)
తనతోపాటు కొంతమంది టీడీపీ నేతలను డీజీపీ ఆఫీసు వద్దకు వెంటవేసుకుని వచ్చిన టీడీపీ అధ్యక్షుడు.. అధికార పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేక అధినేత తలపట్టుకుంటుండగా.. మరోవైపు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా రాజీనామాలు చేయడం చంద్రబాబు అస్సలు మింగుడుపడటంలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలతో కలిసి మాచర్ల ఘటనను రాద్ధంతం చేయడానికి పూనుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఓవైపు ప్రభుత్వం భావిస్తుంటే.. సున్నితమైన అంశాలను ప్రజలను రుద్ది రాజకీయంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఆయన తీరుపై సగటు ప్రజనీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment