Hydrama
-
అప్పులు ఎగ్గొట్టేందుకు మహిళ హైడ్రామా
బల్లికురవ: అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ రాష్ట్రీయ రహదారిపై కూర్చుని బెదిరింపులకు దిగిన ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిమెంట్, ఇనుము వ్యాపారం చేసేవారు. వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన చనిపోయారు. తరువాత ఆయన భార్య అప్పులు తాను తీరుస్తానని చెప్తూ వస్తున్నారు. ఎన్నేళ్లయినా అప్పులు తీర్చకపోవడంతో విసిగిన బాధితులు శనివారం ఆమెను దుకాణం వద్ద నిలదీశారు. దీంతో ఆమె కుమార్తె అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై కూర్చుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది. దీంతో వారికి అప్పులు ఇచ్చిన వారు అవాక్కయ్యారు. మహిళ రోడ్డుకు అడ్డుగా బైఠాయించడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వారిద్దరినీ పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్ పునరుద్ధరించారు. -
గారపాడులో టీడీపీ గూండాల హైడ్రామా
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో టీడీపీ గూండాలు హైడ్రామాకు తెరతీశారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో వారిలోవారే పొలాల వద్ద గొడవ పడినట్లు నటించి తమపై వైఎస్సార్సీపీ నేతలు దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు విన్న పోలీసులు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి మహిళలు, వృద్ధులు, యువకులను తీవ్రంగా కొట్టారు. గ్రామంలో నాలుగు రోజుల కిందట టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడిచేశారు. వైఎస్సార్సీపీ మండల కన్వినర్ కళ్లల్లో కారంకొట్టి మహిళలతో దాడి చేయించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ప్రణాళిక ప్రకారం మంగళవారం పొలాల వద్ద గొడవ జరుగుతున్నట్లు సృష్టించి పోలీసులకు ఫోన్ చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, వీరయ్య, పల్లపాటి నవీన్ తదితరులు పోలీసులకు డబ్బు ఎరజూపి తమపై దాడిచేయించారని బాధితులు విలపిస్తున్నారు. ఇంట్లోంచి బయటకు లాగి కొట్టారు పొలం పనికి వెళ్లి వచ్చి ఇంట్లో పడుకున్న వృద్ధులను పోలీసులు బయటకు లాక్కొచ్చి కొట్టారు. టీడీపీ నాయకులు దగ్గరుండి మరీ మమ్మల్ని కొట్టించారు. పోలీసులు కొడుతుంటే, టీడీపీ వాళ్లు ఒక నెల ఆగండి మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదంటూ బెదిరించారు. పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారు. మమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. – మేరి, గారపాడు మిమ్మల్ని బతకనివ్వబోమని బెదిరిస్తున్నారు టీడీపీ వాళ్లు కావాలని మమ్మల్ని పోలీసులతో కొట్టించారు. మేము కూలీనాలీ చేసుకుని జీవిస్తుంటాం. వాళ్లే మాపై దాడులు చేసి కొడుతూ మాపై కేసులు పెడుతున్నారు. పైగా పోలీసులను పిలిపించి వారితో కూడా కొట్టిస్తున్నారు. అదేమని పోలీసులను అడిగితే.. ఎందుకు అడుగుతున్నావని కూడా కొడుతున్నారు. – కె.కోటేశ్వరమ్మ, గారపాడు పొలంలో పనిచేసుకునే వారిని కొట్టారు పొలంలో పనిచేసుకుంటున్నవారిని పోలీసులు పిలిచి మరీ కొట్టారు. టీడీపీ నాయకులు పోలీసులను తీసుకొచ్చి కొట్టించారు. మేము ఏమీ చేయలేదుకదా.. ఎందుకు కొడుతున్నారంటే.. పోలీసులనే ప్రశి్నస్తావా అంటూ ఇంకా కొట్టారు. మేము వైఎస్సార్సీపీకి సానుభూతిపరులమని టీడీపీ వాళ్లు మాపై దాడులు చేయి స్తున్నారు. – కారసాల రమేష్, గారపాడు మహిళలను, వృద్ధులను కూడా పోలీసులు కొట్టారు టీడీపీ వాళ్లు కావాలని ప్రతి చిన్నవిషయానికి గొడవలు పెడుతూ దాడులు చేస్తున్నారు. మేము వారి గ్రామంలోనుంచి పొలాలకు వెళుతుండగా కొట్టారు. మళ్లీ పోలీసులకు చెప్పి వారితో కూడా కొట్టించారు. ఇంట్లో పడుకున్న వృద్ధులను, మహిళలను కూడా కొట్టారు. న్యాయం చేయండి. – బేతపూడి వినయ్‌కుమార్, గారపాడు -
లోకేశ్ హైడ్రామా
సాక్షి అమలాపురం/రాజోలు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంతో ఆయన కుమారుడు నారా లోకేశ్ బస చేసిన హోటల్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు లోకేశ్‌ను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన తండ్రిని చూసేందుకు విజయవాడ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ తాను బస చేసిన హోటల్ బయట రోడ్డుపై బైఠాయించి లోకేశ్ నిరసన తెలిపారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో సాగుతోంది. శుక్రవారం రాత్రి లోకేశ్ పాదయాత్ర ముగించుకుని పొదలాడలోని శుభం గ్రాండ్ హోటల్లో బస చేశారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు వార్త తెలిసి విజయవాడ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పుడు విజయవాడ వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని చెప్పడంతో వారిపై లోకేశ్ విరుచుకుపడ్డారు. రాజోలు సీఐ గోవిందరాజుతో వాగ్వాదానికి దిగారు. అలాగే కొత్తపేట డీఎస్పీ కేవీ రమణతో సైతం గొడవపడ్డారు. పరిస్థితిని చక్కదిద్దాక బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు వారిస్తున్నా లోకేశ్ వినిపించుకోలేదు. తీవ్ర పదజాలంతో పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘మీకు సిగ్గులేదా? నన్ను అడ్డుకోమన్న వాడు ఎవరు?’ అంటూ పరుష పదజాలంతో దూషణలకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడే ఉన్నారు. పోలీసులు పలు సందర్భాల్లో నచ్చజెప్పినా లెక్క చేయలేదు. ‘తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసు అనుమతి కావాలా’ అనే ప్లకార్డు, రాజ్యాంగ ప్రతులను చేతితో పట్టుకుని నిరసనకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో లోకేశ్ మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి వెళ్లారు. నిరసన తెలుపుతున్న సమయంలో ముఖ్యమైన సన్నిహితులతో లోకేశ్ ఫోనులో మంతనాలు జరిపారు. -
MLC Kavitha-ED Investigation: తుగ్లక్ రోడ్లో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి హాజరయ్యే విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. గురువారం విచారణలో ఆమెను అరె స్టు చేస్తారన్న ఊహాగానాలతో ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసం ఉన్న తుగ్లక్ రోడ్ ప్రాంతం, ఈడీ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండు చోట్లా కవితకు సంఘీభావంగా వచ్చిన నేతలు, కార్యకర్తల హడావుడి, అదే సమయంలో కేంద్ర బలగాల మోహరింపు, జాతీయ మీడియా హడావుడితో రోజంతా ఉత్కంఠ కొనసాగింది. మంత్రులు, న్యాయ నిపుణులతో భేటీ బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులు గురువారం ఉదయం ఏడున్నరకే తుగ్లక్‌రోడ్‌లోని సీఎం నివాసానికి చేరుకొని కవితతో భేటీ అయ్యారు. విచారణ అంశాలపై వారితో మాట్లాడుతున్న సమయంలోనే.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సోమ భరత్, మరికొందరు కూడా కలిసి మాట్లాడారు. ఈడీ విచారణను ఎదుర్కొనే అంశమై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు కవిత మీడియాతో మాట్లాడతారని సమాచారం ఇచ్చారు. ఇందుకోసం గేటు బయట ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పదకొండు గంటలైనా కవిత బయటికి రాలేదు. అప్పటికే చాలామంది పార్టీ నేతలు, కార్యకర్తలు తుగ్లక్‌రోడ్ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు భద్రత పెంచారు. ఐదారు పోలీస్ బస్సులను రప్పించారు. కవిత భద్రత కోసం ఎస్కార్ట్ వాహనం కూడా సిద్ధం చేయడంతో.. ఆమె ఈడీ విచారణకు వెళతారని అంతా భావించారు. ఈడీ కార్యాలయానికి కవిత న్యాయవాది పదకొండున్నర గంటలకు కూడా నివాసం నుంచి కవిత బయటికి రాలేదు. దీనితో ఆమె ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. కాసేపటికే సోమ భరత్‌తోపాటు మరికొందరు న్యాయవాదులు తుగ్లక్ రోడ్ నివాసం నుంచి బయటికి వచ్చి .. ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీకి కవిత రాసిన లేఖను, ఇతర డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. విచారణకు ఆమె రాలేకపోతున్న అంశాన్ని వివరించారు. అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చి న సోమ భరత్.. సుప్రీం పిటిషన్, మహిళను విచారించే అంశాలపై ఈడీకి వివరణ ఇచ్చామని, దీనిపై ఈడీ ఎలాంటి స్పందన తెలపలేదని మీడియాకు వెల్లడించారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. సోమ భరత్ మాట్లాడిన కొంతసేపటి తర్వాత.. కవిత భద్రత కోసం సీఎం నివాసానికి వచ్చి న పోలీస్ ఎస్కార్ట్ వాహనం బయటికి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనితో కవిత ఈడీ విచారణకు హాజరుకావడం లేదని స్పష్టత వచ్చింది. అయితే 20న విచారణకు రావాలంటూ ఈడీ మరోమారు కవితకు నోటీసులు ఇచ్చి ంది. దీనిపై కవిత, ఇతర మంత్రులు న్యాయ నిపుణులతో చర్చించారు. మళ్లీ సుప్రీం తలుపు తట్టే అంశంపై వారితో చర్చించినట్టు సమాచారం. -
బెంగాల్ అసెంబ్లీలో హైడ్రామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే సభలో హైడ్రామా చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హింసను ఖండిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. గవర్నర్ జగదీప్ ధన్ఖర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హింసకు సంబంధించిన పోస్టర్లు, ఫోటోలను బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ప్రదర్శించారు. వెల్‌లో బైఠాయించారు. శాంతించాలని, వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని గవర్నర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రసంగాన్ని విరమించి, బయటకు వెళ్లిపోయేందుకు గవర్నర్ సన్నద్ధం కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు అధికార తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. బయటకు వెళ్లొద్దంటూ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా నిరసన ఆపాలని గవర్నర్ కోరినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. దీంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. మళ్లీ గవర్నర్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తృణమూల్ ఎమ్మెల్యేలు ఆయనను వారించారు. చేసేది లేక నినాదాల హోరు కొనసాగుతుండగానే గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యుల తీరు పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి ప్రజాస్వామ్యాన్ని కించపర్చేలా ఉందన్నారు. బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్నదే వారి కుట్ర అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో హింసాకాండపై మాత్రమే తాము నిరసన తెలిపామని, సభను అడ్డుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి చెప్పారు. (చదవండి: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?) -
శ్రీలంక-వెస్టిండీస్ టీ-ట్వంటీలో హైడ్రామా
-
చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు
-
రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు హైడ్రామా
సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి.. చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవ్వగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. ఎస్ఈసీ ఆధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొన కూడదని నిన్ననే ఎస్ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు హితవు పలికిన సంగతి విధితమే. చదవండి: చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..! కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ.. -
చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం నామినేషన్ల పరిశీలనకు హాజరైన టీడీపీ శ్రేణులు కవ్వింపులకు పాల్పడ్డాయి. రెబల్స్‌ను రెచ్చగొట్టి, వెనకాల నామినేషన్లు తిరస్కరించారని గొడవకు దిగి డ్రామా లాడాయి. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని కొండామారిపల్లె, రామాచార్లపల్లె పంచాయతీల సర్పంచ్ పదవులకు టీడీపీ రెబల్ అభ్యర్థులుగా సరస్వతి, ఉమామహేశ్వరి, చెడే పుష్ప రెండు రోజుల క్రితం నామినేషన్లను దాఖలు చేశా రు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా కొండామారిపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉమామహేశ్వరి గ్రామానికి ఆశా వర్కర్‌గా పనిచేస్తోందంటూ, ఆ పదవికి రాజీనామా చేయలేదని సరస్వతి వర్గీయులు ఆ ర్వోను నిలదీయడంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. (చదవండి: నిమ్మగడ్డకు ఆ అధికారం ఎక్కడిది?) అదే అదనుగా టీడీపీ వర్గీయులు అక్కడే ఉన్న ఓ రెబల్ అభ్యర్థిని రెచ్చ గొట్టి వెనకాల డ్రామా నడుపుతూ కవ్వింపులకు పాల్పడ్డారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రం రామాచార్లపల్లె గ్రామానికి టీడీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన చెడే పుష్ప వర్గీయు లు సర్టిఫికెట్లను సమర్పించడానికి ఆర్వో వద్దకు వస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. నామినేషన్లు వేయడం నిన్నటితో ముగిసిందని ఇప్పు డు పత్రాలు తీసుకెళ్లి ఇవ్వడం ఏమిటని? తాము ఒప్పుకునేది లేదని గ్రామస్తులు కొందరు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎట్టకేలకు గొడవ సద్దు మణిగింది.(చదవండి: టీడీపీ ఆఫర్: నామినేషన్ వేస్తే రూ.2 లక్షలు!) -
నిరసన దీక్ష పేరుతో హైడ్రామా
భవానీపురం(విజయవాడ పశ్చిమ): మంత్రి కొడాలి నాని తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ నిరసన దీక్ష పేరుతో హైడ్రామాకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెరలేపారు. మంగళవారం ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తననెవరూ గుర్తుపట్టకుండా నెత్తిన టోపీ, ముఖానికి మాస్క్ ధరించి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు ఉమాను అరెస్టు చేసి పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీలు వైఎస్సార్సీపీ శ్రేణులతో అక్కడకు వచ్చారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశారు. కాగా, దేవినేని ఉమాను మంగళవారం సాయంత్రం పమిడిముక్కల పోలీసులు విడుదల చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం ఉమా హైడ్రామా నేపథ్యంలో మంగళవారం ఉదయం గొల్లపూడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేత తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ, ఎంపీ నందిగం సురేష్‌లు అక్కడినుంచి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి చివరికి చంపేసిన చంద్రబాబు, వదినను చంపేసిన ఉమా ఆయన విగ్రహానికి దండేసి ఆత్మక్షోభకు గురిచేసినందుకు నిరసనగా క్షీరాభిõÙకం చేశామన్నారు. -
అనంతపురం జైలు వద్ద హైడ్రామా!
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని జైలుకు తరలించే విషయంలో హైడ్రామా నడిచింది. అనంతపురం జిల్లా జైలులో ఓ ఖైదీకి కరోనా లక్షణాలు బయటపడటంతో.. అక్కడ ఉండలేమని వారు అభ్యంతరం తెలిపారు. మరో జైలుకు మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి న్యాయమూర్తి వద్ద మరో పిటిషన్ దాఖలు చేశారు. కడప, గుత్తి, తాడిపత్రి జైళ్లలో ఏదో ఒక జైలుకు తమను తరలించాలని పిటిషన్లో విన్నవించారు. కాగా, ఫోర్జరీ కేసులో అరెస్టైన వీరిద్దరికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. (చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) (చదవండి: తీగలాగితే డొంక కదిలింది!) -
డీజీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు హైడ్రామా
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం డీజీపీ కార్యాలయం వద్ద హైడ్రామాకు తెర తీశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్ల ఘటనను రాజకీయంగా వాడుకునేందుకు ఆయన తనదైన శైలిలో యత్నించారు. డీజీపీ కార్యాలయం బయట పది నిమిషాల పాటు బైఠాయించారు. మీడియా కవరేజ్ కోసంచంద్రబాబు రోడ్డుపై కూచ్చుని హడావుడి చేశారు. మరోవైపు మాచర్ల ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ తెలిపారు. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, మాచర్ల ఘటనను సుమెటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు వివరించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు దేనికోసం డీజీపీ కార్యాలయం ముందు ఎందుకు బైఠాయించారో అక్కడున్న వారికి సైతం అంతుపట్టంలేదు. ఎన్నికల్లో ప్రజల నుంచి సానుభూతి పొందట కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు నాయుడు.. తాజాగా మాచర్ల ఘటనను రాజకీయ పావుగా ఉపయోగించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. (టీడీపీలో కల్లోలం) తనతోపాటు కొంతమంది టీడీపీ నేతలను డీజీపీ ఆఫీసు వద్దకు వెంటవేసుకుని వచ్చిన టీడీపీ అధ్యక్షుడు.. అధికార పార్టీపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేక అధినేత తలపట్టుకుంటుండగా.. మరోవైపు పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా రాజీనామాలు చేయడం చంద్రబాబు అస్సలు మింగుడుపడటంలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలతో కలిసి మాచర్ల ఘటనను రాద్ధంతం చేయడానికి పూనుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఓవైపు ప్రభుత్వం భావిస్తుంటే.. సున్నితమైన అంశాలను ప్రజలను రుద్ది రాజకీయంగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఆయన తీరుపై సగటు ప్రజనీకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాను మించిన ట్విస్ట్‌లతో మహారాష్ట్రలో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దాంతో ‘మహా’ ఉత్కంఠకు తెరపడనుందని సోమవారం ఉదయం వరకూ అంతా భావించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చోటు చేసుకున్న వరుస నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు.. ‘మహా’ ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్‌తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. గవర్నర్‌ను కలిసిన ఆదిత్య ఠాక్రే మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్ కోష్యారీ నిరాకరించడంతో రాజ్‌భవన్ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెనుతిరిగింది. ఆ తరువాత, అనూహ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించి, నేటి(మంగళవారం) రాత్రి 8.30 వరకు ఏ విషయం చెప్పాలన్నారు. దాంతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయబోతున్నాయన్నది సస్పెన్స్‌గా మారింది. ఉదయం నుంచి చర్చోపచర్చలు.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోరిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొనసాగాయి. తొలుత పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో మరోసారి భేటీ అయ్యారు. సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సోనియా చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్.. తదితరులు భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా శివసేనకు మద్దతివ్వాలా? వద్దా? ఇస్తే.. ప్రభుత్వంలో చేరాలా? లేక బయటనుంచి మద్దతివ్వాలా? మద్దతిచ్చేందుకు ఎలాంటి షరతులు విధించాలి? మద్దతివ్వడం లేదా ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీకి ఎలా ప్రయోజనకరం? తదితర అంశాలపై వారు చర్చించారు. శివసేనకు మద్దతివ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారని, సైద్ధాంతికంగా విభేదాలున్న శివసేనకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు గట్టిగా వాదించినట్లు తెలిసింది. శివసేనకు మద్దతివ్వాలని, ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని మెజారీటీ ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం. చివరకు, శివసేనకు మద్ధతిచ్చేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఖండించారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తామని హామీ ఇస్తూ ఎలాంటి లేఖను శివసేనకు కాంగ్రెస్ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడానికి సంబంధించి కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోనియాకు ఫోన్; పవార్‌తో భేటీ ఇదే సమయంలో, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి, మద్దతు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సోనియా ఠాక్రేకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని ఠాక్రేకు చెప్పారని వెల్లడించాయి. సోనియాగాంధీకి ఉద్ధవ్‌ఠాక్రే చేసిన ఫోన్ కాల్‌పై ప్రశ్నించగా.. ‘అది మర్యాదపూర్వక ఫోన్‌కాల్ మాత్రమే’ అని ఆ తరువాత వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో ముంబైలోని ఒక హోటల్లో దాదాపు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ముంబైలో ఎన్సీపీ నేతలతో మంగళవారం తదుపరి చర్చలు జరుగుతాయని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియాగాంధీ నివాసంలో నేడు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఎన్సీపీకి పిలుపు రాత్రి 8 గంటల సమయంలో అనూహ్యంగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ పంపారు. దాంతో, ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీ బృందం గవర్నర్‌ను కలిసి, తమ మిత్రపక్షం కాంగ్రెస్‌తో చర్చించేందుకు సమయం కావాలని, మంగళవారం రాత్రిలోగా తమ నిర్ణయం చెబుతామని వివరించారు. శివసేనకు షాక్ కాంగ్రెస్ ప్రకటనతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, వారి నుంచి మద్దతు లేఖలు వస్తాయని ఆశించిన శివసేన ఒక్కసారిగా షాక్ తిన్నది. సాయంత్రం 7.30కు గవర్నర్ గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌కు ఆదిత్య ఠాక్రే బృందం వెళ్లి, మరో 48 గంటల గడువు కావాలని కోరింది. అందుకు గవర్నర్ నిరాకరించడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ‘గడువు పొడిగించేందుకు గవర్నర్ నిరాకరించారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మా ప్రతిపాదనను తిరస్కరించలేదు’ అని ఆదిత్య చెప్పారు. మరోవైపు, మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వంలో శివసేన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ సోమవారం మంత్రిపదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో సావంత్ ఆ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖతో అరవింద్ సావంత్ -
లగడపాటి హైడ్రామా
-
లగడపాటి హైడ్రామా
హైదరాబాద్: ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో కలకలం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని కమాన్ లోపల షేక్‌పేట మండలం పరిధిలోని సర్వే నం. 120/30లో ఉన్న స్థలానికి సంబంధించి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ స్థలం ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి కేటాయించగా, ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. కాగా జూబ్లీíహిల్స్ రోడ్ నం.65లో ఉండే గోడి పిచ్చిరెడ్డి అలియాస్ జీపీ రెడ్డి ఈ స్థలానికి ఫోర్జరీ పత్రాలను సృష్టించి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఎం.కృష్ణారెడ్డి 2016లో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన కల్పన నుంచి ఈయన ఈ స్థలానికి జీపీఏ పొందారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని గత యేడాది డిసెంబర్లో అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పిచ్చిరెడ్డి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పొందారు. ఏసీబీ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు... ఫిర్యాదుదారులు హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్ రద్దు చేయడంతోపాటు ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిచ్చిరెడ్డి అజ్ఙాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి నిందితుడు వచ్చినట్లు తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్టేషన్‌కు రావాలని కోరారు. బట్టలు మార్చుకుని వస్తానంటూ లోనికి వెళ్లిన పిచ్చిరెడ్డి తన స్నేహితుడైన లగడపాటికి ఫోన్ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో లగడపాటి అక్కడకు చేరుకున్నారు. స్థల (సివిల్) వివాదంలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారంటూ హుంకరించారు. 5 నెలల క్రితం నుంచి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదని ఎస్ఐలు శ్రీనివాస్, పీడీ నాయుడు లగడపాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. మీడియాను పిలిపిస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఉదయాన్నే తాను పిచ్చిరెడ్డిని తీసుకువచ్చి అప్పగిస్తానంటూ చెప్పారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసిస్తే తాము వెళ్లిపోతామని పోలీసులు అన్నారు. అయితే పేపర్‌పై రాసివ్వను.. అరెస్ట్ చేయనివ్వను.. అని రాజగోపాల్ భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధుల ముందు లగడపాటి మరోసారి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం వేశారు. తనను దాటి వచ్చి అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరి బెడ్రూమ్లోకి వెళ్లి పిచ్చిరెడ్డి నిద్రిస్తుండగా పక్కనే కూర్చున్నారు. తాము వెళ్లిపోతే పిచ్చిరెడ్డి పారిపోతారని పోలీసులు కూడా అతని ఇంటి వద్దే కూర్చున్నారు. తెల్లవారుజాము 6గంటల దాకా ఇదే హైడ్రామా సాగింది. ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే... ఉదయం 7గంటల తర్వాత లగడపాటి మళ్లీ పోలీసులపై ఆరోపణలు కొనసాగించారు. ఈ కేసు సివిల్ వ్యవహారం అని ఐజీ నాగిరెడ్డి ఒత్తిడితోనే అర్ధరాత్రి పోలీసులు ఇంటిపైకి వచ్చారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వచ్చిన కారణంగా ఎవరూ బదిలీ చేయరన్న ధీమాతో ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారా అని నిలదీశారు. పోలీసులకు ఎవరిపైనైనా కేసులు పెట్టే అధికారం ఉందని కానీ విస్తృత అధికారాలు ఉపయోగించి ఎవరినైనా అరెస్ట్ చేయాలని అనుకుంటే కుదరదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.12లో ఐపీఎస్ అధికారికి చెందిన భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసు కేసు ఉందని, ఈ విషయమై జీపీ రెడ్డి 20 సార్లు స్టేషన్లో హాజరయ్యారన్నారు. ఈ వ్యవహారాన్ని నాగిరెడ్డితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు తన స్నేహితుడిని వేధిస్తున్నారన్నారు. ఈ సోదాల వెనుక నాగిరెడ్డితో పాటు ఓ డీసీపీ ఉన్నారని దీనిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ ఉన్నతాధికారులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. జీపీ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసు.. సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలను తయారు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టర్ జీపీ రెడ్డిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరు కేంద్రంగా పలు వివాదాల్లో పిచ్చిరెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఆయనపై విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. లగడపాటి వ్యాఖ్యల్లో వాస్తవం లేదు తాము కూడా బాధితులమేనన్న ఐజీ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీ వివాదం నేపథ్యంలో తనను ఉద్దేశించిన లగడపాటి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐజీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉన్న తన సమీప బంధువు పల్లంరెడ్డి హంసమ్మ స్థలం ఖరీదు చేసి మోసపోయారని, ఈ నేపథ్యంతో తమ కుటుంబమూ బాధితులుగా మారిందని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తు తదనంతర చర్యల్లో రెండేళ్లు జాప్యం జరిగి, నిందితుడు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ఏ దశలోనూ తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. జీపీ రెడ్డిని కానీ, ఆయన అల్లుడిని కానీ కలవడం, మాట్లాడటం జరగలేదని పేర్కొన్నారు. వారిని బెదిరించానంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. చట్ట ప్రకారం స్థానిక పోలీసులు తీసుకున్న చర్యల్ని తనకు ఆపాదించడం సబబుకాదన్నారు. పోలీసులు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో సొసైటీ సభ్యులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని నాగిరెడ్డి అన్నారు. -
విశాల్ నామినేషన్‌పై హైడ్రామా
సాక్షి, చెన్నై : ఈనెల 21న నిర్వహించే ఆర్కే నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన సందర్భంగా మంగళవారం భారీ హైడ్రామా నడిచింది. సాంకేతిక కారణాలు చూపుతూ తొలుత ఎన్నికల అధికారులు సినీ నటుడు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. అయితే ఆయన ఎన్నికల ప్రధాన అధికారిని కలుసుకుని తనను బలపరిచిన వారికి బెదిరింపులు వచ్చాయని చెప్పడంతో రాత్రి 8.30 గంటలకు ఆయన నామినేషన్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా విశాల్ ఇచ్చిన వివరణ అవాస్తమని తేలడంతో తిరిగి రాత్రి 11 గంటలకు ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరోవైపు, జయలలిత మేనకోడలు దాఖలుచేసిన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఒక్క రోజులో ఎన్ని మలుపులో... చెన్నై తండయార్ పేటలోని మండల కార్యాలయంలో ఎన్నికల అధికారి వేలుస్వామి పర్యవేక్షణలో ఉదయం నుంచి నామినేషన్ల పరిశీలన జరిగింది. విశాల్ పేరును ప్రతిపాదించిన ఆర్కేనగర్కు చెందిన పదిమందిలో ఇద్దరి పేర్లు, వివరాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు, అనేకచోట్ల అవును, లేదు అన్న సమాధానాలు కూడా ఇవ్వకుండా ఖాళీగా వదలి పెట్టడంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వేలుస్వామి ప్రకటించారు. దీంతో ఆందోళనకు దిగిన విశాల్ పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించారు. అనంతరం ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానికి చేసిన ఫిర్యాదులో తన పేరును ప్రతిపాదించిన వారికి బెదిరింపులు వచ్చాయని, వాటిని నిరూపించే వీడియో తన వద్ద ఉందని విశాల్ పోరాటానికి దిగారు. దీంతో రాత్రి 8.30 గంటలకు విశాల్ నామినేషన్ ఆమోదించినట్లు అధికారులు చెప్పారు. చివరకు రాత్రి 11 గంటలకు మళ్లీ ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు 26ఐ పత్రాన్ని పూర్తిగా నింపకుండానే సమర్పించడంతో దీప నామినేషన్‌ను తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోరులో మొత్తం 131 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 54 తిరస్కరణకు గురయ్యాయి. -
జమ్మలమడుగులో హైడ్రామా
కడప: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా హైడ్రామా కొనసాగుతోంది. కోరం ఉన్నా రిటర్నింగ్ అధికారి అనారోగ్యాన్ని సాకుగా చూపి ఎన్నికను నిర్వహించలేదు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రఘునాథ్ రెడ్డికి తనకు బీపీ పెరిగిందని, ఎన్నికను నిర్వహంచలేనని చెప్పారు. అయితే వైద్యులు ఆయనను పరీక్షించి బీపీ సరిగానే ఉందని చెప్పారు. రిటర్నింగ్ అధికారి పథకం ప్రకారమే వాయిదా వేయాలని కుట్ర పన్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ ఆరోపించారు. టీడీపీకి లబ్ది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్వించారు. ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించినా ఆర్డీవో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు.