![Chandrababu Hydrama At Renigunta Airport - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/1/Chandrababu.jpg.webp?itok=KNf-4knC)
సాక్షి, తిరుపతి: రేణిగుంట ఎయిర్‌పోర్టు వద్ద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం హైడ్రామాకు తెరతీశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి.. చిత్తూరు, తిరుపతిలో దీక్ష చేసేందుకు చంద్రబాబు సిద్ధమవ్వగా.. ఎన్నికల కోడ్ దృష్ట్యా దీక్షలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పోలీసులు వివరించారు.
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా.. ఎస్‌ఈసీ ఆధీనంలో అధికారులు పనిచేస్తున్నారు. ఐదుగురికి మించి ప్రచారంలో పాల్గొన కూడదని నిన్ననే ఎస్‌ఈసీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు హితవు పలికిన సంగతి విధితమే.
చదవండి:
చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..!
కుప్పం పర్యటన: చంద్రబాబుకు ఊహించని దెబ్బ..
Comments
Please login to add a commentAdd a comment