నేడు తిరుపతికి సీఎం రాక
మూడు రోజుల పాటు
తిరుపతిలోనే మకాం
యూనివర్సిటీక్యాంపస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఈనెల 4వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుపతిలోనే ఆయన మకాంవేస్తారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమనాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 7.30 గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.25 గంటలకు దేశ ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి మోదీతో కలసి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎస్వీయూకు చేరుకుంటారు. 11 నుంచి 1 గంటల మధ్య ఎస్వీయూ స్టేడియంలో జరిగే 104 సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డుమార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. 1.45 నుంచి 2.45 మధ్య ప్రధానితో కలసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటారు. 2.50 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహం నుంచి 3.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
3.45 గంటలకు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం రోడ్డుమార్గంలో తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 4వ తేదీ ఉదయం 9 గంటలకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చిల్డ్రన్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఎస్వీయూ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.