కడప: వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా హైడ్రామా కొనసాగుతోంది. కోరం ఉన్నా రిటర్నింగ్ అధికారి అనారోగ్యాన్ని సాకుగా చూపి ఎన్నికను నిర్వహించలేదు. రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రఘునాథ్ రెడ్డికి తనకు బీపీ పెరిగిందని, ఎన్నికను నిర్వహంచలేనని చెప్పారు. అయితే వైద్యులు ఆయనను పరీక్షించి బీపీ సరిగానే ఉందని చెప్పారు.
రిటర్నింగ్ అధికారి పథకం ప్రకారమే వాయిదా వేయాలని కుట్ర పన్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ ఆరోపించారు. టీడీపీకి లబ్ది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్వించారు. ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశించినా ఆర్డీవో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు.
జమ్మలమడుగులో హైడ్రామా
Published Fri, Jul 4 2014 7:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement