బల్లికురవ: అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ రాష్ట్రీయ రహదారిపై కూర్చుని బెదిరింపులకు దిగిన ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సిమెంట్, ఇనుము వ్యాపారం చేసేవారు. వ్యాపార నిమిత్తం పలువురి వద్ద అప్పులు చేశారు. నాలుగేళ్ల క్రితం ఆయన చనిపోయారు.
తరువాత ఆయన భార్య అప్పులు తాను తీరుస్తానని చెప్తూ వస్తున్నారు. ఎన్నేళ్లయినా అప్పులు తీర్చకపోవడంతో విసిగిన బాధితులు శనివారం ఆమెను దుకాణం వద్ద నిలదీశారు. దీంతో ఆమె కుమార్తె అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై కూర్చుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగింది. దీంతో వారికి అప్పులు ఇచ్చిన వారు అవాక్కయ్యారు. మహిళ రోడ్డుకు అడ్డుగా బైఠాయించడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వారిద్దరినీ పక్కకు తీసుకొచ్చి ట్రాఫిక్ పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment