విద్యా వ్యవస్థలో సమూల మార్పులు | Radical changes in the education system | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

Published Sun, Dec 8 2024 5:00 AM | Last Updated on Sun, Dec 8 2024 5:00 AM

Radical changes in the education system

పేరెంట్స్‌–టీచర్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఏటా డిసెంబర్‌ 7న మెగా ఈవెంట్‌ నిర్వహిస్తాం

అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతాం 

మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తాం

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం నిర్వహి­స్తున్న మెగా పేరెంట్, స్టూడెంట్స్, టీచర్స్‌ ఈవెంట్‌ గిన్నిస్‌ బుక్‌లో శాశ్వతంగా లిఖించదగ్గ కార్యక్రమ­మని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు  తీసుకొస్తున్నా­మన్నా­రు. శనివా­రం బాపట్ల మున్సి­పల్‌ పాఠశా­లలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యా­యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లా­డారు. హైదరాబాద్‌ దేశంలో నంబర్‌ వన్‌ అయిందంటే తాను అమలు చేసిన విజనేన­న్నారు. ఇప్పుడు 2047 విజన్‌ తెచ్చాన­న్నారు. 

ప్రైవేట్‌ పాఠశాలలకంటే బెటర్‌గా ప్రభుత్వ పాఠశా­లల పిల్లలను చదివిస్తామన్నారు. ఏడాదికి మూడు సార్లు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏటా డిసెంబర్‌ 7న మెగా ఈవెంట్‌ నిర్వ­హిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు విద్యతో­పాటు ఆసక్తి ఉన్న అన్ని రంగాల్లోని అంశాలపై శిక్షణ ఇస్తామ­న్నారు. తన హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించి.. 1.50 లక్షల మందికి టీచర్‌ పోస్టులు ఇచ్చామన్నారు. 

16,347 మెగా డీఎస్సీ పోస్టులు జూన్‌ నాటికి భర్తీ చేస్తామ­న్నారు. ఇక నుంచి ఏటా డీఎస్సీ ఉంటుందన్నారు. 117జీవో 4 లక్షల మంది పిల్లలు పాఠశాలలకు రాని పరిస్థితి ఉందన్నారు. రాబోయే ఏడాదికి పాఠశా­లల్లో పెనుమార్పులు తెస్తామ­న్నారు. కాగా సభకు చ్చిన ఓ విద్యార్థి తండ్రి గుండెపోటుకు గురైతే నడిపించుకుంటూ తీసుకెళ్ల­డం ఆందోళనకు గురి చేసింది. సభకు ఎనిమిదో తరగతి చదువుతున్న సాహుల్‌ అనే విద్యార్థి తండ్రి పఠాన్‌బాజీ హాజరయ్యారు. 

ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను హై­స్కూ­లుకు పిలిపించారు. సీఎం వచ్చే వరకు అందరినీ  అక్కడి నుంచి లేవకుండా ఉంచారు. కనీసం ఫ్యాన్లు కూడా వేయలేదు. ఈ వాతావరణం మధ్య ఇమడలేక 11 గంటల సమయంలో పఠాన్‌­బాజీ గుండె­పోటుకు గురయ్యాడు. అక్కడే మెడికల్‌ క్యాంపు ఉన్నప్పటికీ వీల్‌చైర్‌ కూడా లేకపోవటం, అంబులెన్సు లేకపోవటంతో బాధితుడిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement