ఫోర్జరీ పత్రాలతో ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అడ్డుకుని హైడ్రామా సృష్టించారు. వారంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాగ్వాదానికి దిగడంతో పాటు రాత్రంతా నిందితుడి ఇంట్లోనే ఉన్నారు.