గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడులో టీడీపీ గూండాలు హైడ్రామాకు తెరతీశారు. గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో వారిలోవారే పొలాల వద్ద గొడవ పడినట్లు నటించి తమపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు విన్న పోలీసులు వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి తలుపులు పగలగొట్టి మహిళలు, వృద్ధులు, యువకులను తీవ్రంగా కొట్టారు.
గ్రామంలో నాలుగు రోజుల కిందట టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడిచేశారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ కళ్లల్లో కారంకొట్టి మహిళలతో దాడి చేయించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ప్రణాళిక ప్రకారం మంగళవారం పొలాల వద్ద గొడవ జరుగుతున్నట్లు సృష్టించి పోలీసులకు ఫోన్ చేశారు. టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, నవతా సుబ్బారావు, వీరయ్య, పల్లపాటి నవీన్ తదితరులు పోలీసులకు డబ్బు ఎరజూపి తమపై దాడిచేయించారని బాధితులు విలపిస్తున్నారు.
ఇంట్లోంచి బయటకు లాగి కొట్టారు
పొలం పనికి వెళ్లి వచ్చి ఇంట్లో పడుకున్న వృద్ధులను పోలీసులు బయటకు లాక్కొచ్చి కొట్టారు. టీడీపీ నాయకులు దగ్గరుండి మరీ మమ్మల్ని కొట్టించారు. పోలీసులు కొడుతుంటే, టీడీపీ వాళ్లు ఒక నెల ఆగండి మిమ్మల్ని ఏం చేస్తామో తెలియదంటూ బెదిరించారు. పోలీసులు సైతం వారికే వత్తాసు పలుకుతున్నారు. మమ్మల్ని చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. – మేరి, గారపాడు
మిమ్మల్ని బతకనివ్వబోమని బెదిరిస్తున్నారు
టీడీపీ వాళ్లు కావాలని మమ్మల్ని పోలీసులతో కొట్టించారు. మేము కూలీనాలీ చేసుకుని జీవిస్తుంటాం. వాళ్లే మాపై దాడులు చేసి కొడుతూ మాపై కేసులు పెడుతున్నారు. పైగా పోలీసులను పిలిపించి వారితో కూడా కొట్టిస్తున్నారు. అదేమని పోలీసులను అడిగితే.. ఎందుకు అడుగుతున్నావని కూడా కొడుతున్నారు.
– కె.కోటేశ్వరమ్మ, గారపాడు
పొలంలో పనిచేసుకునే వారిని కొట్టారు
పొలంలో పనిచేసుకుంటున్నవారిని పోలీసులు పిలిచి మరీ కొట్టారు. టీడీపీ నాయకులు పోలీసులను తీసుకొచ్చి కొట్టించారు. మేము ఏమీ చేయలేదుకదా.. ఎందుకు కొడుతున్నారంటే.. పోలీసులనే ప్రశి్నస్తావా అంటూ ఇంకా కొట్టారు. మేము వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులమని టీడీపీ వాళ్లు మాపై దాడులు చేయి స్తున్నారు. – కారసాల రమేష్, గారపాడు
మహిళలను, వృద్ధులను కూడా పోలీసులు కొట్టారు
టీడీపీ వాళ్లు కావాలని ప్రతి చిన్నవిషయానికి గొడవలు పెడుతూ దాడులు చేస్తున్నారు. మేము వారి గ్రామంలోనుంచి పొలాలకు వెళుతుండగా కొట్టారు. మళ్లీ పోలీసులకు చెప్పి వారితో కూడా కొట్టించారు. ఇంట్లో పడుకున్న వృద్ధులను, మహిళలను కూడా కొట్టారు. న్యాయం చేయండి. – బేతపూడి వినయ్‌కుమార్, గారపాడు
Comments
Please login to add a commentAdd a comment