తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో ...
విజయవాడ: తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో కాపు ఐక్య గర్జన నిర్వాహకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై తుని గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ దుర్ఘటనలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 24 బోగీలు దహనమైన విషయం విదితమే. రైల్వే ట్రాక్‌పైకి రావడంతోపాటు రైలును అడ్డగించడం, రైలును దహనం చే సినందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్‌తో పాటు రైల్వే యాక్ట్ సెక్షన్లు 161, 162, 163, 164 కింద కేసు కేసు నమోదు చేశారు. రైలు దహనం ఘటనలో ముద్రగడతోపాటు మరికొంతమంది (ముద్రగడ పద్మనాభం అండ్ అదర్స్)పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారులు చెప్పారు.
కాపు నేతల్లో ఆగ్రహం
కాపు ఐక్య గర్జనకు తాను బాధ్యుడినని, రైలు దహనంతోపాటు జరిగిన దుర్ఘటనలకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని ముద్రగడ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనపైనే కేసు నమోదు చేయడం కాపు సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.