tuni agitation
-
తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు
సాక్షి, విజయవాడ: తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం మధ్యాహ్నం ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ల పాటు ఎందుకు సాగతీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఈ కేసులో ఏ1 ముద్రగడ పద్మనాభం, ఏ2 ఆకుల రామకృష్ణ, ఏ3 మంత్రి దాడిశెట్టి రాజా సహా 41మంది నిందితులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మొత్తం 24 మంది సాక్ష్యులలో 20 మంది విచారణకు హాజరయ్యారు. 20 మందిలో ఐదుగురు తమకు ఏమీ తెలియదని సాక్ష్యం చెప్పారు. విచారణ పూర్తి కావడంతో తుదితీర్పు వెల్లడించింది. అయితే తుని ఘటన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2016 జనవరిలో తుని కార్యక్రమంలో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీనిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం మొత్తం 69 కేసులను నమోదు చేసింది. కానీ సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఈ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. చదవండి: బీటెక్ రవి దౌర్జన్యకాండ: బెదిరింపులు.. పచ్చబ్యాచ్‌తో కలిసి మారణాయుధాలతో.. -
ఎప్పటిలాగే.. ఎదురుదాడి
తుని ఘటనల నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం కాపులకు రిజర్వేషన్లపై ఎలాంటి ప్రకటనా చేయని వైనం అసలు విషయాన్ని పక్కనబెట్టి విమర్శల పర్వం తన వైఫల్యాలను ఇతర పార్టీలపైకి నెట్టే యత్నం ఎన్నికల్లో హామీ ఇచ్చింది బాబే.. ఇప్పుడు మాట తప్పిందీ ఆయనే హైదరాబాద్ తుని సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో స్పందించిన తీరు ఎప్పటిలాగే ఆయన చేసిన ఎదురుదాడికి నిదర్శనం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఆయన వ్యవహార శైలి ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసలు విషయాలను పక్క దారి పట్టించడంలో తాను సిద్ధహస్తుడనని చంద్రబాబు అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాజాగా కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. తానే స్వయంగా హామీ ఇచ్చి, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపరిచినకాపులకు రిజర్వేషన్ల అంశంపై లక్షలాది మంది కాపులు తునిలో చేరి గళమెత్తితే.. ఆ తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించినప్పుడు ఏదైనా ఆశాజనకమైన ప్రకటన వెలువడుతుందని అంతా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు మాత్రం వారి డిమాండ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అనవసరమైన అనేక విషయాలను మాట్లాడారనే భావన మేధావులు, విజ్ఞుల్లో సైతం వ్యక్తం అవుతోంది. అధికారంలోకి రాగానే కాపులను బీసీలో చేర్చుతానని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న టీడీపీ అధినేత అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఆ విషయం పూర్తిగా విస్మరించారు. కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏడాదికి రూ.1,000 కోట్లు ఇస్తామనిపకటించి, ఇప్పటివరకు రూ.100 కోట్లకు మించనివ్వలేదు. తాజాగా రిజర్వేషన్ల హామీలను నెరవేర్చడంలో తన వైఫల్యాన్ని ఇతరులపై నెట్టేందుకు, బురద జల్లేందుకు బాబు విఫలయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో సైతం ఏ విధంగా అయితే ప్రతిపక్షంపై ఎదురుదాడికి పూనుకుని సమస్యలు చర్చకు రాకుండా చంద్రబాబు పక్కదోవ పట్టించారో, ఇప్పుడు కాపుల అంశంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది. అప్పటికప్పుడు చోటు చేసుకున్న సంఘటనలను అసలు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేని వారికి ఆపాదించడంతో పాటు, రాజకీయం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏది జరిగినా ప్రతిపక్షంపై నిందలేనా..?! రాష్ట్రంలో ఏది జరిగినా ప్రతిపక్షాలపై ఆ నిందలు వేయడం విచక్షణ ఉన్న పాలకుడు చేసే పని ఎంత మాత్రం కాదని మేధావులు అంటున్నారు. అసలు సమస్యకు మూలమేంటో గ్రహించినా పట్టించుకోని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలోపుగా రిజర్వేషన్లు ఇస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు ప్రకటించారు. ఏటా రూ.1,000 కోట్లు కాపుల సంక్షేమానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నిధులు విడుదల చేయాలని కోరుతూ ముద్రగడ ఇప్పటికే రెండుసార్లు లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. తుని సభలో కాపులు అడిగింది కూడా అదే. కానీ చంద్రబాబు తుని సంఘటనలపై స్పందించడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ రెండు ప్రధాన డిమాండ్లపై కాపులకు సంతృప్తి కలిగించే విధంగా ప్రకటన చేయకపోగా పూర్తి రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ పోయారు. కాపుల సమస్యలతో సంబంధంలేని కాల్‌మనీ వ్యవహారాన్ని ముడిపెడుతూ మాట్లాడారు. అంతే కాదు, రాజధానికి అడ్డుపడుతున్నారని, శాంతియుతంగా ఉన్న రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ హూంకరించారు. చివరకు విలేకరులు అడిగిన ఏ ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా దబాయించే యత్నం చేయడం స్పష్టంగా కన్పించింది. చిత్తశుద్ధి లేదని తేలిపోయింది.. అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయిన తరుణంలో కూడా రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నానని, అధ్యయనం కోసం కమిషన్ వేశామని చెప్పడం.. చంద్రబాబుకు దీనిపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కమిషన్ పేరిట కాలయాపనకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం. వాస్తవానికి ఇప్పటికే కులగణన ఆధారంగా కాపులు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక జీవన స్థితిగతులపై వివరాలుండగా ఇంకా జాప్యం చేయడం ఏమిటని రాజకీయవేత్తల్లో ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు ఇన్ని కారణాలు చెబుతున్న చంద్రబాబుకు.. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేటపుడు అవి గుర్తుకురాలేదా? ఎలాంటి ఆలోచనలు చేయకుండానే హామీ ఇచ్చారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తానే అడ్డుకుంటూ.. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పడం అసలు సమస్యను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికేనని కూడా అంటున్నారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పటికే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ దృష్ట్యా తన పార్టీలోనే ఉన్న బీసీ నేత కృష్ణయ్యకు చంద్రబాబు నచ్చ జెప్పేందుకు ప్రయత్నించకుండా ఇంకా ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని మాట్లాడ్డం కూడా అర్థరహితంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణయ్యను చంద్రబాబు ఎందుకు కట్టడి చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరో అడ్డుకుంటున్నారని, ఎక్కడినుంచో అడ్డంకులు ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు.. రాజకీయాలకు అతీతంగా తమ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం గర్జన చేస్తున్నామని కాపు నేతలు చెప్పినా.. తెలుగుదేశం పార్టీకి చెందినవారెవరూ అటువైపు వెళ్లవద్దని ఎందుకు అడ్డుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని అనేకమంది పారిశ్రామికవేత్తలు, మేధావులు, సినీ ప్రముఖులు గర్జనకు మద్దతు పలికినా.. దాన్ని విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. గర్జనకు వాహనాలు ఇవ్వద్దంటూ ఆంక్షలు విధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తప్పులన్నీ తానే చేసి.. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది చంద్రబాబు. ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదీ చంద్రబాబే. ఇలా తప్పులన్నీ తానే చేసిన చంద్రబాబు ఇప్పుడు నెపం ఇతరులపై నెట్టడాన్ని అన్ని వర్గాలూ ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా వైఎస్సార్సీపీ వల్లనే భవిష్యత్తులో బాబుకు ఇబ్బంది. అందుకనే ఏ విషయమైనా సరే.. సంబంధం ఉన్నా లేకున్నా అభాండాలు వేయడం బాబుకు పరిపాటిగా మారింది. బీజేపీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ కూడా తన అనుచరులతో కలిసి గర్జనకు హాజరయ్యారు. మరి ఆ పార్టీ గురించి బాబెందుకు మాట్లాడరు? బీజేపీతో స్నేహం ఉన్నందుకేనా? అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
నిఘా విభాగం నిద్దర!
సాక్షి, హైదరాబాద్: భారీ స్థాయిలో రాజకీయ సభలు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేందుకు అవకాశం ఉన్న ‘గర్జన’ల వంటి కార్యక్రమాలు, నిరసన ప్రదర్శన వంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు, నిఘా వర్గాల ప్రాథమిక దృష్టి ప్రధానంగా మాబ్ కౌంటింగ్ (హాజరయ్యేవారి లెక్కింపు), మాబ్ నిర్వహణలపై ఉండాలి. లక్షలాదిమందికి సంబంధించిన, సెంటిమెంట్‌తో కూడిన, సున్నితమైన అంశాల్లో వీటిపై మరింతగా శ్రద్ధ పెట్టాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. అప్పుడే ఎలాంటి అపశ్రుతులనైనా, అవాంఛనీయ సంఘటనలనైనా నివారించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కాపు ఐక్య గర్జన విషయంలో ఇవేవీ జరగలేదు. నిఘా వర్గాల వైఫల్యం చాలా స్పష్టంగా కన్పిస్తోంది. మాబ్ కౌంటింగ్, మాబ్ నిర్వహణ వంటి అంశాలను పోలీసులు పూర్తిగా విస్మరించిన నేపథ్యంలోనే రైలుకు నిప్పు నుంచి పోలీసుస్టేషన్ల దగ్ధం వరకు ఒకదాని తర్వాత మరొకటిగా ఘటనలు చోటు చేసుకున్నాయన్నది నిర్వివాదాంశం. సరైన అంచనాలతో సమర్థ నిర్వహణ సభా వేదిక అయిన తుని సమీపంలోని వి.కొత్తూరుకు ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, సమీపంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం ద్వారా మాబ్ కౌంటింగ్ చేయాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఆ ప్రాంత చుట్టుపక్కల ఉన్న టోల్గేట్ సిబ్బందితోనూ సంప్రదింపులు జరుపుతూ ఎన్ని వాహనాలు తుని వైపు వచ్చాయి? తదితర అంశాలను ఎప్పటిప్పుడు సమీక్షించాలి. అలాగే రైళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది వచ్చారనే దానిపై కూడా ఓ అవగాహన ఉండాలి. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చేవారి మూడ్ ఏరకంగా ఉంది? వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అనేవి అంచనా వేయడానికి స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీలను వినియోగిస్తుంటారు. సభకు హాజరయ్యే వారు ఎక్కడైఆన ఒకచోట గుమిగూడకుండా చూడటం, వచ్చిన వారిని వచ్చినట్లు సభాస్థలి వైపు నడిపించడం తదితర చర్యలన్నీ వ్యూహంలో భాగంగా తీసుకుంటారు. సభాస్థలికి పరిమితికి మించిన జనం వచ్చినప్పుడు మాత్రమే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీప ప్రాంతాలతో పాటు అధికారిక పార్కింగ్ లాట్స్‌లో అవసరమైన ఏర్పాట్లు చేసి రద్దీని ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలువరిస్తారు. అయితే ఆదివారం భారీ సంఖ్యలో సభకు వచ్చినవారు తుని రైల్వేస్టేషన్లోనే ఆగుతున్నా పోలీసు విభాగం పట్టించుకోలేదు. వారి మూడ్, భావోద్వేగాలను అంచనా వేయడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది. ఓ ఘటన జరిగిన తర్వాత కూడా... తుని రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకు నిప్పు ఘటన తర్వాత కూడా పోలీసు విభాగం సరైన రీతిలో స్పందించలేదు. కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు సంయమనం కోల్పోయి తీసుకున్న చర్యలు.. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం కల్పించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా?
సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కాపు గర్జన ఉద్యమం ఉధృత రూపం దాల్చడంతో అవాక్కయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కోపాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలపై చూపించారు. కాపుల్లో ఇంత అసంతృప్తి ఉందా అని పార్టీ నేతలను ప్రశ్నించి.. దాన్ని పసిగట్టలేకపోయారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం నుంచి గర్జన పరిణామాలను ఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటూ వచ్చారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడ ఏంజరుగుతుందో తెలుసుకోలేకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహించినట్లు సమాచారం. సమావేశం జరుగుతుందని మాత్రమే అంచనా వేశామని, అప్పటికప్పుడు ముద్రగడ ఆందోళనకు పిలుపునిస్తారని ఊహించలేదని అధికారులు వివరణ ఇచ్చినా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోవడం, కనీసం అక్కడ ఏంజరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాపు గర్జనకు అనూహ్య స్పందన రావడానికి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరే కారణమని ఆ పార్టీలోని కాపు నేతలు అంటున్నారు. సీఎం అయిన తరువాత కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీని పట్టించుకోకపోవడం, కాపు నాయకుల్ని ఎదగనీయకుండా తొక్కిపెట్టడం వంటివాటి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కట్టడి చేయడం వల్లే.. ‘కాపు నాయకులు ఎవరూ సభకు వెళ్లవద్దని టెలి కాన్ఫరెన్సుల్లో మా అధినేత ఆదేశించడం వల్లే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. పార్టీలోని కాపు ఎమ్మెల్యేలను వెళ్లనిచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి.. నెరవేర్చకపోవడం వల్ల యువతలో అసహనం పెరిగింది. బాబుపై నమ్మకం లేకపోవడం వల్లే ఉద్యమించి సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కాపు కార్పొరేషన్ జీవో జారీచేసి ఎంగిలి మెతుకులు విదిల్చినట్లు రూ.వంద కోట్లే ఇవ్వడంతో యువతలో కోపం పెరిగింది. ఇవన్నీ కాపు ఉద్యమం వైపు జనాన్ని నడిపించాయి. ఇందుకు పార్టీ అధినేత చంద్రబాబే బాధ్యుడు. కాపు గర్జనలో బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నా.. వైఎస్సార్ సీపీని టార్గెట్ చేయడం కూడా తప్పే. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. ఇది పార్టీకే నష్టం..’ అని టీడీపీలోని కాపు నాయకులు పేర్కొన్నారు. -
జీఓ 30 అమలు అసాధ్యం
* కాపు నాయకులే దాన్ని ఇవ్వొద్దన్నారు * కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారు * కమిషన్ సిఫారసు చేయకపోతే మేమేం చేయలేం * ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ * ఖద్దరు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజం సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 30ను అమలు చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పులున్నాయని చెప్పారు. తునిలో జరిగిన ఘటనలు కాపులకే నష్టదాయకమని వ్యాఖ్యానించారు. కాపు ఐక్య గర్జన పరిణామాలపై ఆయన ఆదివారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఇదంతా చేశాయని ఆరోపించారు. తునిలో జరిగిన ఆందోళనలో 25 వాహనాలు, ఒక రైలు కాలిపోయాయని, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారని చెప్పారు. వారిలో ఒక సీఐ, కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయన్నారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో 40 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతిని ఇలాగే అడ్డుకున్నారని, రాయలసీమలోనూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు. జీఓ ఇచ్చినా చెల్లదు కాపులను బీసీల్లో కలపాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారని ఉద్ఘాటించారు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎలా చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. కాపుల రిజర్వేషన్లపై సిఫారసుల కోసం కమిషన్‌ను నియమించామని తెలిపారు. జీఓ నంబర్ 30ని అమలు చేయడం ఎలా సాధ్యమని కాపు నేతలను ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఒక కమిషన్ వేసి, దాని సిఫారసుల ఆధారంగా చేయమని ఈ జీఓలో పేర్కొన్నారని, దానిపైకొందరు కోర్టుకెళ్లారని పేర్కొన్నారు. బలవంతంగానో, శాంతిభద్రతల సమస్య కారణంగానో దీనిపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఒక కమిషన్ వేసి వాళ్ల నివేదిక ప్రకారం చేయాలని సూచించిందని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసు చేయకపోతే తాము చేయడానికి ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం చేయకపోతే ఈ రిజర్వేషన్లపై జీఓ ఇచ్చినా చెల్లదన్నారు. దానిపై తాను తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలతో మాట్లాడానని, జీఓ ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారమే చేయాలని వారు కోరారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లపై ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. గర్జనలో కాపులు 10 శాతం మందే వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ వాళ్లే ఇదంతా చేయించారని, వాళ్లకు సంబంధించిన ఆరు, ఏడు వాహనాలను ముందే పంపించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఒక కుట్ర ప్రకారం ఇదంతా జరిగిందన్నారు. రైళ్లు తగులబెట్టడం, పోలీసులను కొట్టడం దారుణమన్నారు. ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులు ఫోజులు కొడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రభుత్వం అంటే అంత చులకనైపోయిందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే తాను రేపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, జీఓ ఇస్తానని అది నిలవకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కాపుల ఐక్య గర్జనకు ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వెళ్లారని, కాపులు ఐదు, పది శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై సమావేశాలు జరిగితే ఆధార్ కార్డులు చూపిస్తే కానీ లోనికి పంపని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. -
కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో తునిలో ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుని ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఈ రోజు ఘటనల వల్ల కాపులకే నష్టమన్నారు. కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతామని స్పష్టం చేశారు. అకారణంగా రాజకీయ దురద్దేశాలతో ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇబ్బందులు కలిగించాలని కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే తుని ఘటనలు జరిగినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. వారి స్వార్థం కోసం విధ్వంసానికి దిగుతున్నాయని విమర్శించారు. మీటింగ్ కు అడ్డంకులు కలిగించారంటూ తనపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. తుని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఆందోళనలో దాదాపు 25 వాహనాలు దగ్ధమైనట్టు చెప్పారు. ఒక రైలు పూర్తిగా మంటల్లో దగ్ధమైనట్టు తెలిపారు. మీటింగ్‌లో ఎలాంటి శక్తులున్నాయో తెలియదన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, 8 మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. రెండు పోలీస్ స్టేషన్లు కూడా ఆహుతయ్యాయని చంద్రబాబు అన్నారు. ఈ ఘటన విషయంలో చాలా ఓపిక పట్టామని.. అందరికీ ఓపిగ్గా ఉండమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనల వల్ల వేరే కులాల్లో రియాక్షన్ వస్తే.. అసలే ముప్పు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయాలి' అంటూ మీడియా ప్రతినిధులను చంద్రబాబు ప్రశ్నించారు. జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవి నిదులు రావడం లేదని చెప్పారు. డబ్బులు లేక కాపులకు 100 కోట్ల రూపాయలు మాత్రమ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు.