కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు | Kapu communitees can be merged in BCs, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు

Published Sun, Jan 31 2016 9:34 PM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు - Sakshi

కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతాం: చంద్రబాబు

విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో తునిలో ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆదివారం రాత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుని ఘటన చాలా బాధాకరమని చెప్పారు. ఈ రోజు ఘటనల వల్ల కాపులకే నష్టమన్నారు. కాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీల్లో కలుపుతామని స్పష్టం చేశారు. అకారణంగా రాజకీయ దురద్దేశాలతో ఈ పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ఇబ్బందులు కలిగించాలని కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని అన్నారు. అందులో భాగంగానే తుని ఘటనలు జరిగినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చునని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు. వారి స్వార్థం కోసం విధ్వంసానికి దిగుతున్నాయని విమర్శించారు. మీటింగ్ కు అడ్డంకులు కలిగించారంటూ తనపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు.

తుని ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో జరిగిన ఆందోళనలో దాదాపు 25 వాహనాలు దగ్ధమైనట్టు చెప్పారు.  ఒక రైలు పూర్తిగా మంటల్లో దగ్ధమైనట్టు తెలిపారు. మీటింగ్లో ఎలాంటి శక్తులున్నాయో తెలియదన్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, 8 మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. రెండు పోలీస్ స్టేషన్లు కూడా ఆహుతయ్యాయని చంద్రబాబు అన్నారు. ఈ ఘటన విషయంలో చాలా ఓపిక పట్టామని.. అందరికీ ఓపిగ్గా ఉండమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనల వల్ల  వేరే కులాల్లో రియాక్షన్ వస్తే.. అసలే ముప్పు వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయాలి' అంటూ మీడియా ప్రతినిధులను చంద్రబాబు ప్రశ్నించారు. జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి రావాల్సినవి నిదులు రావడం లేదని చెప్పారు. డబ్బులు లేక కాపులకు 100 కోట్ల రూపాయలు మాత్రమ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement