
హనుమాన్ జంక్షన్ రూరల్: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్తూ ఆయన మంగళవారం మార్గమధ్యంలో బాపులపాడు మండలం బొమ్ములూరులోని ఓ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు ఆగారు.
ఈ సందర్భంగా పలువురు స్థానిక కాపు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రాజకీయాలకు, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment