kirlampudi
-
ముద్రగడ నివాసంపై దాడి ఘటన.. పోలీసుల తీరు వివాదాస్పదం
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసంపై దాడి ఘటనపై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆయన నివాసంపై దాడి జనసేనకు సంబంధం లేదని ఆ పార్టీ నేతల ప్రకటించారు. అదే ప్రకటనను మీడియా గ్రూపులకు పోలీసు అధికారులు షేర్ చేశారు. దాడి అనంతరం ముద్రగడ నివాసం వద్ద జనసేన కార్యకర్త గంగాధర్ హల్ చల్ చేశాడు.తాను జనసేన పార్టీ అని.. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు. ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటిని దున్నేశానని గంగాధర్ చెప్పాడు. పోలీసుల తీరును జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కురసాల కన్నబాబు తప్పుబట్టారు. జనసేన పార్టీ తరుపున పోలీసులే ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారితే భాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటూ కన్నబాబు ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై దాడి సంచలనం కలిగించింది. జనసేన కార్యకర్త ట్రాక్టర్‌తో వచ్చి ఆయన ఇంటి వద్ద హల్చల్ చేశాడు. బీభత్సం సృష్టించి ఆయన కారును ధ్వంసం చేశాడు. సదరు యువకుడు ఆదివారం ఉదయం ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ తీసుకుని వచ్చాడు. ఇంటి ముందు ర్యాంప్‌పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు ధ్వంసమైంది. తర్వాత, జై జనసేన అంటూ నినాదాలు చేసుకుంటూ ఓవరాక్షన్ చేశాడు.కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు.. దాడి ఘటనపై ఆరా తీశారు. ముద్రగడను మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరామర్శించారు. ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ, కాపు నాయకులు ఖండించారు.ఇదీ చదవండి: నిందితుడిది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటా.. పవన్ నోరు మెదపరేం? -
రాజకీయాల్లో ముద్రగడ లాంటి వాళ్లు అరుదు: అంబటి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం వంటి నాయకులు అరుదుగా ఉంటారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాపుల కోసం.. కాపు రిజర్వేసన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వ్యక్తి ముద్రగడ అని కొనియాడారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కలిశారు.అనంతరం అంబటి మాట్లాడుతూ.. రాజకీయాల్లో నష్టపోయిన ముద్రగడ.. తన కులాన్ని ఏనాడు ఉపయోగించుకోలేదని అన్నారు. కాపునాడు సమావేశం సమయంలో టీడీపీకి రాజీనామా చేసి ఆ సమావేశానికి ముద్రగడ వచ్చారని తెలిపారు. ఆ సమయంలో వంగవీటి జైలులో ఉన్నారని, కేవలం ఒక సవాల్‌ను స్వీకరించి ముద్రగడ తన పేరును మార్చుకున్నారని పేర్కొన్నారు. పేరు మారినా.. ముద్రగడ.. ముద్రగడేనని, అందుకే ఆయన్ను అభినందించాలని కిర్లంపూడి వచ్చినట్లు చెప్పారు. -
సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ
సాక్షి, కాకినాడ(కిర్లంపూడి): దళిత నాయకులను దళితులే ఎన్నుకొనే అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో శుక్రవారం లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా మెరుగైన పద్ధతులలో దళితుల పదవులను దళితులే ఓటు వేసుకునే అవకాశం కల్పించి వారి నాయకులను వారే ఎన్నుకొనేలా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఇతర వర్గాలు నివసించే వీధులలో ఒకటి నుంచి ఐదు దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయల గ్రాంట్లను అక్కడే ఖర్చు చేయడం వలన ఎక్కువ జనాభా ఉన్న దళితులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (ఆర్టీసీలో ఆఫర్లు!.. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్ తీసుకుంటే..) -
మొక్కజొన్న మూటల్లో గంజాయి రవాణా
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్టిన నిఘా సత్ఫలితాలనిస్తోంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు కిర్లంపూడి మండలం క్రిష్ణవరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో 1,419 కేజీల గంజాయి బయటపడింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.1.30 కోట్లు ఉంటుందని పెద్దాపురం అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు బుధవారం చెప్పారు. ముందస్తు సమాచారంతో కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి వెలుగు చూసింది. ఒక కారు, లారీలో మొక్కజొన్న బస్తాల మధ్యన 66 మూటలలో 1,419 కేజీల గంజాయిని గుర్తించారు. వెంటనే స్వాధీనం చేసుకుని విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు, మహారాష్ట్రకు చెందిన చొప్పడి ప్రతాప్‌లను అరెస్ట్ చేశారు. జయశ్వాల్, కరణం రవీంద్రబాబు, రాంబాబు అనే వ్యక్తులు పరారైనట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎడిషనల్ ఎస్పీ, ఎస్ఈబీ డీఎస్పీ అంబికాప్రసాద్, జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, కిర్లంపూడి ఎస్ఐ తిరుపతిరావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. -
1,732 కిలోల గంజాయి పట్టివేత
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడిలోని జాతీయ రహదారిపై రెండు వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.70 కోట్ల విలువ చేసే సుమారు 1,732 కేజీల గంజాయిని కిర్లంపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ఇద్దరు పరారైనట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం సాయంత్రం ఎన్‌హెచ్ 16పై బూరుగుపూడి శివారు పోలవరం కాలువ వంతెన వద్ద జగ్గంపేట సీఐ వి.సురేష్‌బాబు, కిర్లంపూడి ఎస్సై జి.అప్పలరాజులు వాహనాలు తనిఖీ చేయగా గంజాయి గుట్టు రట్టయ్యింది. అన్నవరం వైపు నుంచి కోళ్ల మేత, ట్రేల లోడుతో వస్తున్న అశోకా లేలాండ్ వ్యాన్‌లో 10 బస్తాల గంజాయి, తాళ్లరేవుకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్‌లో 30 బస్తాల్లో ఉన్న గంజాయి వెరసి 40 బస్తాల్లో ఉన్న 1731.80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తమిళనాడుకు చెందిన కాశీ మాయన్ కుమార్, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ డ్రైవర్ సున్నపు రాజు, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకకు చెందిన శ్రీకనకదుర్గా సీఫుడ్స్ వ్యాన్ క్లీనరు వాసంశెట్టి వీరబాబు, విశాఖ జిల్లా చింతపల్లి మండలం పనసలపాడు గ్రామానికి చెందిన కొర్ర ప్రసాద్, విశాఖ జిల్లా జి.కొత్త వీధి మండలం ఎబులం గ్రామానికి చెందిన గొల్లోరి హరిబాబులను అరెస్టు చేశారు. రెండు వ్యాన్లతో పాటు నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.11 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన ఒకరు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి పరారయ్యారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. -
కాపు ఉద్యమం నుంచి పూర్తిగా తప్పుకున్నా
హనుమాన్ జంక్షన్ రూరల్: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తాను పూర్తిగా తప్పుకున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి వెళ్తూ ఆయన మంగళవారం మార్గమధ్యంలో బాపులపాడు మండలం బొమ్ములూరులోని ఓ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక కాపు నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. రాజకీయాలకు, కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. -
రచ్చ చేయడం మానేయండి: ముద్రగడ
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.(చదవండి: ‘పంచాయతీ’: ఒట్టు.. ఇదీ లోగుట్టు!) అదే విధంగా అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నిమ్మగడ్డను నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానని.. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయాలే తప్ప రాజకీయ నాయకులలాగా పట్టుదలకు పోవడం మంచిగా లేదన్నారు. రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’ ) -
కాపు ఉద్యమాన్ని మీరే నడిపించండి
గోకవరం: కాపు ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కోరారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల కాపు జేఏసీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ పద్మనాభాన్ని సోమవారం కలిశారు. కాపు ఉద్యమాన్ని ఆయన సారథ్యంలోనే నడిపించాలని కోరారు. వారి అభ్యర్థనను ముద్రగడ సున్నితంగా తిరస్కరించారు. తనను ఇబ్బంది పెట్టవద్దంటూ తన నిర్ణయాన్ని లేఖ ద్వారా జేఏసీ నాయకులకు తెలిపారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ముద్రగడే తమ నాయకుడని, ఆయన సారథ్యంలోనే కాపు ఉద్యమం కొనసాగుతుందని, సమయాన్ని బట్టి ఆయన స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, కల్వకొలను తాతాజీ, తోట రాజీవ్, ఎన్.వెంకట్రాయుడు తదితరులు ఉన్నారు. -
ప్రశ్నాపత్రం లీక్.. జీరాక్స్ షాపులో లభ్యం
సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలోని ఎస్వీఎస్ డిగ్రీ కాళశాల సిబ్బంది నిర్వాకంతో ఏకంగా పరీక్షకు ముందే ఏకంగా ప్రశాపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. గీతం యూనివర్సిటీ దూరవిద్య బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రశాపత్రం లీక్ అయింది. ఈ పరీక్ష మంగళవారం జరగాల్సి ఉండగా.. సమీపంలోని ఓ జీరాక్స్ సెంటర్లో ప్రశాపత్రం జీరాక్స్‌లు లభించడం తీవ్ర కలకలం రేపింది. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో గుట్టుగా పేపర్ మార్చి ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల పరీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. -
నూతన సంవత్సర వేడుకలకు దూరం: ముద్రగడ
సాక్షి, కిర్లంపూడి: బీసీ రిజర్వేషన్ ఫలాలు అందేవరకు ఏ పండుగా చేసుకోనని కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు బీసీ రిజర్వేషన్ ఫలాలు అందాలనేదే తన ఉద్దేశమని, అందుకోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ ఫలాలు పైన పేర్కొన్న కులాలకు అందేవరకూ ఏ పండుగా చేసుకోనని గతంలోనే ప్రకటించానని, దాన్నే మరోసారి గుర్తు చేస్తూ 2018 కొత్త సంవత్సరం వేడుకలకూ దూరంగానే ఉంటానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సామాజిక వర్గాలు ఆశించిన రిజర్వేషన్లు పొందడమే అసలైన పండుగగా భావిస్తానన్నారు. కాపులందరితోపాటు తాను కూడా ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నానని అన్నారు. జనవరి 1న తనను కలిసేందుకు కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయవద్దని తన శ్రేయోభిలాషులు, అభిమానులు, స్నేహితులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానులు చూపుతున్న వాత్సల్యం ఎనలేనిదన్నారు. -
కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, కాకినాడ: కిర్లంపూడిలో మళ్లీ ఉద్రికత్త నెలకొంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద శనివారం భారీగా పోలీసులు మోహరించారు. ఆదివారం నుంచి రెండురోజుల కోనసీమ పర్యటనకు ముద్రగడ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనను కట్టడి చేసేందుకు.. కిర్లంపూడిలో బలగాలు మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆత్మీయ పలకరింపు పేరిట ఈ నెల 8,9 తేదీల్లో కోనసీమలో పర్యటించనున్నట్టు ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానులను ఆత్మీయంగా పలుకరించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, ఆయన పర్యటనను అడ్డుకునేందుకే పోలీసులు కిర్లంపూడిలో మోహరించినట్టు తెలుస్తోంది. ముద్రగడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా.. తప్పకుండా పోలీసులు అనుమతి తీసుకోవాల్సిందే అన్న తరహాలో పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనను జీవితాంతం గృహనిర్బంధం చేస్తారా? వ్యక్తిగత హోదాలో పర్యటించడానికి కూడా అవకాశం ఇస్తారా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ వ్యక్తిగతంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, ఆయన వ్యక్తిగత పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మీడియాతో పేర్కొన్నారు. అయినా, ముద్రగడ ఇంటి నుంచి కదలకుండా ఆయన నివాసం చుట్టూ తాజాగా పోలీసులు మోహరించడం ఉద్రిక్తత రేపుతోంది. కాపు రిజర్వేషన్లో 'ఛలో అమరావతి' పేరిట ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను భగ్నం చేసి.. ఆయనను చాలకాలంపాటు పోలీసులు గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. -
బ్రేకింగ్: కిర్లంపూడిలో మళ్లీ ఉద్రిక్తత
-
మళ్లీ ముద్రగడను అడ్డుకున్న పోలీసులు
-
ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు: డీజీపీ
కిర్లంపూడి: రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ‘చలో అమరావతి’ పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివ రావు అన్నారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిన చూస్తూ ఊరకోమన్నారు. ఆయతోపాటు ఎవరైనా పాదయాత్రల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిర్లంపూడిలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ముద్రగడే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ముద్రగడకు సహకరించిన వారందరిపై కేసులు పెడతామన్నారు. మరోవైపు తూర్పుగోదావరి వీరవరం వద్ద ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ అనుచరులకు పోలీసుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. ఇందులో కాపు జేఏసీ సభ్యుడు వాసిరెడ్డి ఏసుదాసు కాలికి గాయం అయ్యింది. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న పద్మనాభాన్ని బలవంతంగా తీసుకెళ్లి బస్సులో కూర్చోపెట్టారు. గత నెల 26న ముద్రగడ పాదయాత్ర చేయాల్సిఉంది. అయితే ప్రభుత్వ అనుమతి లేదనే నెపంతో పాదయాత్రను దాదాపు నెలరోజుల నుంచి ఏపీ సర్కార్ అడ్డుకుంటూ వస్తోంది. గాంధీమార్గంలో, శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముద్రగడ చెబూతూ వచ్చినా ఆయన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన్ను దాదాపు నెల రోజుల నుంచి పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహనిర్భందం చేశారు. దాదాపు నెల రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లాను సుమారు ఏడువేలమంది పోలీసులు దిగ్బంధం చేశారు. అనంతరం ఆయన పలుసార్లు పాదయాత్ర ప్రయత్నాలు చేసినా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆగస్టు 19న పాదయాత్రను మరోసారి అడ్డుకోవడంతో మండిపడిన ముద్రగడ ప్రభుత్వం తనను ఇలా హింసిస్తున్నందుకు నిరసనగా ఏదో ఓ రోజు గోడ దూకి, ఎక్కడో ఓ చోట నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఆయన ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భారీగా మద్దతుదారులు, అభిమానులు తరలిరావడంతో పోలీసులను దాటుకొని ఇంటి నుంచి ముద్రగడ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట భారీగా మద్దతుదారులు ఉండటంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేశారు. దీంతో ముద్రగడ 'ఛలో క్లిరంపూడి'కి పిలుపునిచ్చారు. తన మద్దతుదారులంతా కిర్లంపూడి రావాలని, అక్కడి నుంచి 'ఛలో అమరావతి' పాదయాత్ర చేపడుదామని ముద్రగడ తన అనుచరులకు సూచించారు. ఇంకా చదవండి: కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠ -
కిర్లంపూడి జనసంద్రం
కిర్లంపూడి : మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నిర్వహించతలపెట్టిన పాదయాత్రను అడ్డుకుని ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. దీంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచే కాకుండా పలు జిల్లాల కాపు నాయకులు, అభిమానులు కిర్లంపూడికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ముద్రగడ ఉద్యమానికి రోజురోజుకూ మద్దతు పెరగుతోంది. భారీగా మహిళలు, కాపు నాయకులు, అభిమానులు కిర్లంపూడి తరలివస్తున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి జేఏసీ నాయకుడు మలకల చంటిబాబు ఆధ్వర్యంలో మోటారు సైకిళ్లపై భారీ ర్యాలీగా తరలివచ్చి కిర్లంపూడి మండలం రాజుపాలెం సెంటర్లో ధర్నా, రాస్తారోకో చేసి ముఖ్యమంత్రి చంద్రబాబకు వ్యతిరేకంగా, ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేసి పాదయాత్రకు వెంటనే అనుమతి ఇవ్వాలంటూ నల్లజెండాలతో నిరసన తెలియజేశారు. రాజుపాలెం గ్రామానికి చెందిన కాపు నాయకుడు గణేశుల రాంబాబు, లక్ష్మణరావుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కాపులు అధిక సంఖ్యలో మహిళలు రాజుపాలెం నుంచి కిర్లంపూడి ముద్రగడ ఇంటి వరకు పాదయాత్రగా తరలివచ్చారు. అలాగే ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం నుంచి తానా నూకరాజునాయుడు, జువ్వల చినబాబు, కొల్లి కొండబాబు, చక్కపల్లి సత్తిబాబుల ఆధ్వర్యంలో కిర్లంపూడి వచ్చి స్థానిక ఎస్సీపేట వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి 50 కార్లపై కాపు నాయకులు ర్యాలీగా తరలివచ్చి ముద్రగడ పాదయాత్రకు తమ సంఘీభావం తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దాపురం నియోజకవర్గం కాపు సంఘం గౌరవాధ్యక్షుడు దవులూరి సుబ్బారావు, సామర్లకోట కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల పెదబాబు, కాపు నాయకులు వర్రే రవి, సురేష్, పెద్దాపురం టౌన్ జేఏసీ కన్వీనర్ జిగిని రాజబాబు తదితరులతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గం నాయకులు బొల్లి చిట్టిబాబు, చల్లా సత్తిబాబు, సిద్ధా అప్పలరాజు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే నిడదవోలు, తాడేపల్లిగూడెం, పిఠాపురం, జిల్లాలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో కాపు నాయకులు, మహిళలు తరలివచ్చారు. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్..
-
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు ఆదివారం మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 6వ రోజైన ఆదివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీం కోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని పోలీసలు మద్రగడను అడ్డుకున్నారు. ముద్రగడ, కాపు జేఏసీ కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. దీంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం కూడా ఆయన పాదయాత్రను అడ్డుకున్నారు. ఎన్నిరోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి అని ముద్రగడ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని ఆయన స్వగృహం నుంచి 5వ రోజైన శనివారం కూడా బయటకు రానీయకుండా చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పాదయాత్రకు అనుమతులు లేవని ఓఎస్డీ రవిశంకరరెడ్డి ముద్రగడకు తెలిపారు. దీనిపై ముద్రగడ స్పందిస్తూ.. ‘‘ఎన్ని రోజులు పాదయాత్రను ఆపుతారు. 24 గంటల్లో పాదయాత్రకైనా అనుమతి ఇవ్వండి లేదా మమ్మల్ని జైల్లోనైనా పెట్టండి’’ అని డిమాండ్ చేశారు. అనంతరం చెవిలో పువ్వులు పెట్టుకుని ప్రభుత్వం వైఖరికి నిరసన తెలిపారు. ఆయన ఇంటి గేటు వద్ద కాపు జేఏసీ నాయకులు కూడా చెవిలో పువ్వులు పెట్టుకుని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సతీమణి పద్మావతి, కుమారుడు గిరి, కోడలు సిరి, మనువరాలు భాగ్యలక్ష్మితో పాటు కాపు జేఏసీ నాయకులతో కలసి ముద్రగడ తన ఇంటి వద్ద కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు. -
చెవిలో పూలతో ముద్రగడ నిరసన
-
చెవిలో పూలతో ముద్రగడ నిరసన
- పాదయాత్ర ప్రారంభం కాకుండా మూడోరోజూ అడ్డుకున్న పోలీసులు కిర్లంపూడి: ‘చలో అమరావతి’ పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు శనివారం కూడా అడ్డుకున్నారు. దీంతో మండిపడ్డ ఉద్యమనేత.. 24 గంటల్లోగా ఉన్నతాధికారులతో మాట్లాడి పాదయాత్రకు అనుమతించాలని లేదంటే అరెస్టు చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సర్కారు తీరును నిరసిస్తూ ముద్రగడ సహా కాపు నేతలంతా చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గడిచిన మూడు రోజులుగా ముద్రగడ పాదయాత్రకు బయలుదేరడం, అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను ఇంటి గేటు వద్దే అడ్డుకోవడం జరుగుతోంది. ఐపీసీ సెక్షన్, 30, సెక్షన్ 144 అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతించబోమని పోలీసులు చెబుతుండగా, అంతే ఘాటుగా స్పందించిన ముద్రగడ.. పోలీసుల నోటీసులపై తాను కోర్టుకు వెళ్లనని, స్టేలు, బెయిల్ తెచ్చుకోబోనని తేల్చిచెప్పారు. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
-
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్
ప్రత్తిపాడు: చట్టం చంద్రబాబుకు చుట్టంలా మారిందని, తమకు మాత్రం సెక్షన్ 30, 144 కేసులా? అంటూ ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తాను రోజూ పాదయాత్రకు బయలుదేరతానని చెప్పిన మేరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభిస్తే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రను అడ్డుకోవడంతో ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు పెట్టినపుడు బెంజి సర్కిల్లో రోజుల తరబడి ట్రాఫిక్ మళ్లించేస్తారని, తన పాదయాత్రకు మాత్రం అనుమతినివ్వడంలేదని విమర్శించారు. పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ముద్రగడ కాసేపటికి అనుచరులతో కలిసి గేటు వద్దకు వచ్చి కంచాలపై దరువు వేస్తూ నిరసన తెలిపారు. మళ్లీ శనివారం పాదయాత్రకు బయలుదేరతానని ముద్రగడ చెప్పారు. -
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్!
-
ముద్రగడ పాదయాత్రకు మళ్లీ బ్రేక్!
కాకినాడ: చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడటంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా నేటితో గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే ముద్రగడను ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 2009 సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చూపించి పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు తెలపగా, చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి 2014 గైడ్‌లైన్స్ చూపాలని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసులకు కోరారు. చంద్రబాబు పాదయాత్రకు అనుమతిచ్చినవారు తనకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ముద్రగడ ప్రశ్నించారు. అయినప్పటికీ యాత్రకు పోలీసులు అడ్డుకోవడంతో ముద్రగడ తిరిగి తన నివాసంలోకి వెళ్లిపోయారు. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ... ‘చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు. యాత్రపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపాలన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మంజునాథ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి పాదయాత్రపై రూట్‌మ్యాప్ అందచేశా. ఇది నిరవధిక పాదయాత్ర... వాయిదా వేసేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పాదయాత్ర చేసి తీరుతా.’ అని స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. -
కిర్లంపూడిలో పోలీస్ రాజ్యం: రోజా
తిరుపతి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో పోలీస్ రాజ్యం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రోజా బుధవారమిక్కడ మాట్లాడుతూ.. ‘పరిస్థితి చూస్తుంటే మనం పాకిస్తాన్లో ఉన్నామా?...భారత్‌లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారని, అప్పుడు ఇలానే వ్యవహరించి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేది.’ అని ప్రశ్నించారు. అలాగే డ్రగ్స్ కేసుపై ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ ‘సినీ నటులం అద్దాల మేడలో ఉన్నాం. అద్దాల మేడపై రాయి వేస్తే తిరిగి నిర్మించుకోవడం కష్టం. డ్రగ్స్ వ్యవహారంలో నిజమైన దోషులను శిక్షించండి. విచారణ పేరుతో అందరినీ వేధించడం సరికాదు.’ అని అన్నారు. -
పంతం నెగ్గించుకున్న ఏపీ ప్రభుత్వం
-
24 గంటలపాటు ముద్రగడ హౌస్ అరెస్ట్
కిర్లంపూడి: చలో అమరావతి పాదయాత్రకు బయల్దేరిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, 24 గంటల పాటు ఆయనను గృహ నిర్బంధం చేసినట్లు ఓఎస్డీ రవిశంకర్ వెల్లడించారు. కాగా అంతకు ముందు పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను ఇంటి గేటు వద్దే అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులతో వాగ్వివాదం జరిగింది. గాంధీమార్గంలో పాదయాత్ర చేస్తానని ముద్రగడ ఈ సందర్భంగా పోలీసుల్ని చేతులు జోడించి వేడుకున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముందే చెప్పామని, పోలీసులు ఎప్పుడు అనుమతి ఇస్తే అప్పుడే మొదలుపెడతానని ముద్రగడ తెలిపారు. మరోవైపు ముద్రగడ ఇంటి చుట్టూ కేంద్ర బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలోకి బయట వ్యక్తులు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అలాగే పలువురు కాపు నేతలను ముందస్తుగా గృహనిర్భందం చేశారు. తూర్పు గోదావరి జిల్లాను సుమారు ఏడువేలమంది పోలీసులు దిగ్బంధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 95 చెక్‌పోస్టులు, 116 పికెట్లను ఏర్పాటు చేసి ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల షాడో పోలీసులతో నిఘా ఏర్పాటు చేశారు. ఐడీకార్డు చూపిస్తేనే కిర్లంపూడిలోకి అనుమతి ఇస్తున్నారు. ఇక ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా సింహాద్రిపురంలో భారీ ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా ఎత్త ఎత్తున నినాదాలు చేశారు. -
24 గంటలపాటు ముద్రగడ హౌస్ అరెస్ట్
-
కాపులతో కిటకిటలాడుతున్న ముద్రగడ స్వగృహం
- తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉండండి - ముద్రగడ పిలుపు కిర్లంపూడి (జగ్గంపేట): మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీ నుంచి చావోరేవో చలో అమరావతి పేరుతో నిర్వహించనున్న నిరవధిక పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో కాపు నేతలు ఆయన స్వగృహానికి తరలివస్తున్నారు. దీంతో ముద్రగడ స్వగృహం కాపు నాయకులతోపాటు వివిధ సంఘాల మద్ధతుదారులతో కిటకిటలాడుతుంది. గురువారం కోరుకొండ మండలంలోని గాదరాడ, ప్రత్తిపాడు మండలం ధర్మవరం, పెద్దాపురం మండలం దివిలి గ్రామాల నుంచి భారీ సంఖ్యలో కాపు యువకులు, నాయకులు మోటారు సైకిళ్లపై భారీగా తరలివచ్చారు. రాజోలు నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం నుంచి కార్లపై భారీగా కాపు నాయకులు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముద్రగడను ఉద్ధేశించి వారు మాట్లాడుతూ ఈ నెల 26న చేపట్టనున్న పాదయాత్రలో తామూ పాలుపంచుకుంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ చేపట్టనున్న నిరవధిక పాదయాత్రకు చావోరేవో తేల్చుకోవడానికి కాపులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జాతి భావి తరాలు బాగుండాలంటే రిజర్వేషన్లను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాపు యువత క్రమ శిక్షణతో ఈ పాదయాత్రకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, గౌతు స్వామి, చల్లా సత్యన్నారాయణ, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, చక్కపల్లి సత్తిబాబు, సూరత్ వీరవెంకట సత్యన్నారాయణమూర్తి, తూము చినబాబు, చక్కపల్లి సత్తిబాబు, ఆడారి బాబ్జిలు పాల్గొనగా రాజోలు నియోజకవర్గం నుంచి బీజేపీ నాయకులు అడబాల నరసింహరావు, వైఎస్సార్ సీపీ నాయకులు యనుముల నారాయణస్వామి, వివిధ పార్టీల నాయకులు తరలివచ్చారు. . -
కిర్లంపూడిలో పోలీసుల నిషేధాజ్ఞలు
కిర్లంపూడి: తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 144వ సెక్షన్ అమలులో ఉంది. జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ఈ నెల 26న కాపుల చలో అమరావతి పాదయాత్రకు కాపు నేత ముద్రగడ పద్మనాభం పిలుపున్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. దివిలిలోనూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
గంజాయి స్మగ్లింగ్ : ఇద్దరి అరెస్ట్
కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కిష్టవరం టోల్గేట్ వద్ద బుధవారం ఉదయం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఆనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని అన్నారు. -
సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలి
కాపు కులస్తులకు ముద్రగడ బహిరంగ లేఖ కిర్లంపూడి: ఈనెల 26న చేపట్టనున్న కాపు సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కాపు సత్యాగ్రహ దీక్ష చేయాలని సూచించారు. కాపు కులస్తులందరూ దీక్షలో పాల్గొనాలన్నారు. ఇతర కుల సోదరుల మద్దతు కూడా కోరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే దీక్షలో తాను పాల్గొంటానని ముద్రగడ ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఎవ్వరిపైనా లేని విధంగా కాపు జాతిపై ఆంక్షలా
-
ముద్రగడ హౌస్ అరెస్ట్
కాపు ఉద్యమనేత పాదయాత్రపై ఉక్కుపాదం ఇంటి వద్దే అడ్డగింత.. కిర్లంపూడిలో భారీగా బలగాలు ఉదయమే జిల్లావ్యాప్తంగా కాపు నేతల హౌస్ అరెస్టులు నేడు రావులపాలెం బంద్‌కు కాపునేతల పిలుపు ఎవ్వరిపైనా లేనివిధంగా కాపు జాతిపై ఆంక్షలా: ముద్రగడ సాక్షి, రాజమహేంద్రవరం: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాదయాత్రపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యాత్ర చేయడానికి అవకాశం లేకుండా పోలీ సులు ఆయన్ను ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్ర బాబు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వే షన్లు కల్పించాలని కోరుతూ మలి విడత ఉద్య మంలో భాగంగా ముద్రగడ కాపు సత్యాగ్రహ పేరిట బుధవారం నుంచి పాదయాత్ర తల పెట్టడం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అమలాపురం వరకు ఐదు రోజులపాటు పాదయాత్రకు ఆయన సంకల్పించారు. పాదయాత్రలో పాల్గొనేం దుకు మంగళవారం సాయంత్రం ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసం నుంచి రావుల పాలెం బయలుదేరగా ఇంటిగేటు వద్దనే పోలీ సులు అడ్డుకున్నారు. జిల్లాలో 144వ సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని, పాదయాత్రకు అనుమతి లేదని చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 151సీ ప్రకారం హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పడంతో ముద్రగడ వెనుదిరిగారు. హిట్లర్‌ను తలపిస్తున్నారు.. హౌస్ అరెస్ట్ అనంతరం ముద్రగడ తన నివా సంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన ఛాయలు కనిపిస్తున్నాయని విమర్శించారు. పోలీసులు తమకు స్వేచ్ఛ కల్పించినప్పుడే పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన యాత్ర ఆగినట్లు కాదన్నారు. మళ్లీ ఎప్పుడు యాత్ర ప్రారంభించాలో కాపు జేఏసీతో చర్చించాక వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో ఎవరిపైనా లేనివిధంగా కాపు జాతిపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే బాబు మౌనంగా ఉంటున్నారని, ఎన్నికల వేళ కాపు జాతికిచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేస్తుంటే సీఎంకు ఎక్కడలేని కోపం, పౌరుషం వస్తున్నాయని ధ్వజమెత్తారు. గతేడాది తన ఇంటికొచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల బృందం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిం చారు. తెలంగాణలో ఒక్కరోజులోనే సర్వే పూర్తి చేశారని, రాష్ట్రంలో పల్స్ సర్వే నెలల తరబడి కొనసాగుతోందని విమర్శించారు. మంజునాథ కమిషన్ గడువు గత ఆగస్టుతోనే పూర్తయినా ఇప్పటివరకు నివేదిక ఎందుకివ్వ లేదన్నారు. నివేదిక రాకుండానే తొందరెందు కని సీఎం అంటున్నారని, 9 నెలల సమయం సరిపోదని కమిషన్ వేసేటప్పుడు తెలియదా? అని నిలదీశారు. ఇప్పటికే మూడేళ్లు గడిచి పోయాయని, రిజర్వేషన్లు అమలు చేయడా నికి తమ నుంచి సీఎం ఏం ఆశిస్తున్నారో చెప్పాలన్నారు. కేసుల పేరుతో బెదిరించడం మాని దమ్ముంటే తమను అరెస్టులు చేయాల న్నారు. పోలీసులతో తమ జాతి ప్రజలను బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు అనుమతి లేదు ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేకపోవ డంతో ఆయన్ను సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకా రం హౌస్ అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ చెప్పారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. జిల్లాలో 144వ సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని, ఐదుగురు వ్యక్తులు గూమిగూడి ఉంటే అరెస్ట్ చేస్తామన్నారు. ఇతర జిల్లాలవారు ఇక్కడికి రావొద్దన్నారు. వ్యూహాత్మకంగా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జిల్లా లోని కాపు నేతలు కిర్లంపూడి రాకుండా ఉదయం పదిగంటలకే ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా పవన్, కల్వకొలను తాతా జీ, కాపు నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, ఆకుల వీర్రాజులను గృహ నిర్బం ధంలో ఉంచారు. జిల్లావ్యాప్తంగా ఆరువేల మంది పోలీసులను మోహరించారు. రెండు వేల మంది పోలీసులతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఐదుగురు ఐపీఎస్ అధికారులు, పదిమంది డీఎస్పీలు కిర్లంపూడిలో పరిస్థితిని సమీక్షించారు. ఇదిలా ఉండగా ముద్రగడ హౌస్ అరెస్ట్‌ను నిరసిస్తూ జిల్లా కాపు నేతలు బుధవారం రావులపాలెం బంద్‌కు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల సమస్య వల్లే గృహనిర్బంధం: డీజీపీ సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం కాపు సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతిలేదని, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉన్నందునే ముద్రగడతో పాటు కాపు జేఏసీ నేతలను హౌస్ అరెస్టు చేశామని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూనేరు వద్ద హీరాఖండ్ రైలు దుర్ఘటనలో కుట్రకోణానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని, సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ చెప్పారు. పోలీస్ శాఖలోని పలువురిపై ఆరోపణలు చేసిన ఎర్రచందనం టాస్క్ఫోర్సు చీఫ్ కాంతరావును వివరణ కోరతామని చెప్పారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణను ఉల్లంఘించి రచ్చకెక్కడం సరికాదని, కాంతారావు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ శాఖపరమైన విచారణ నిర్వహిస్తామని డీజీపీ వెల్లడించారు. -
కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు బంద్!
-
కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు బంద్!
కిర్లంపూడి: ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తలపెట్టిన కాపు సత్యాగ్రహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. సత్యాగ్రహ అనుమతి నిరాకరించిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. కోనసీమ, కిర్లంపూడిలో భారీగా పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దించారు. మీడియాపైనా పోలీసులు ఆంక్షలు విధించారు. సత్యాగ్రహ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఆదేశించారు. కోనసీమ, కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని సర్వీసు ప్రొవైడర్లకు సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని కాపు జేఏసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కోనసీమలోని కాపులను ఆ రోజు రావులపాలెం చేరుకోకుండా చూడడమే కాకుండా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి యాత్రకు వచ్చే కాపు నాయకులు, కార్యకర్తలు కూడా అడుగు పెట్టేందుకు వీలు లేకుండా పలుచోట్ల పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు హైవేపై బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను కలిసేందుకు కిర్లంపూడి వెళుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, రౌతు సూర్యప్రకాశ్, జక్కంపూడి రాజా, తోట సుబ్బారావు నాయుడు, సుంకర చిన్నిలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రాజమండ్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ తమను అరెస్ట్ చేయడం దారుణమైన చర్య అని, కాపు ఉద్యమాన్ని అణచివేయలేరని అన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
కిర్లంపూడి చేరుకున్న పోలీసు బలగాలు
కిర్లంపూడి : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 16న రావులపాలెం నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహించ తలపెట్టిన నేపథ్యంలో పోలీసు బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రకు ప్రభు త్వ అనుమతి లేదంటూ డీఐజీ ప్రకటించారు. పాదయాత్రను దృష్టిలో పెట్టుకుని ముందస్తు బందోబస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను దించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విజయనగరం ఏపీఎస్పీ బెటాలియ¯ŒS నుంచి 150 మంది పోలీసులు శనివారం కిర్లంపూడి చేరుకున్నారు. ఇంకా మరిన్ని బలగాలను ఇక్కడకు దించే అవకాశం ఉందని తెలిసింది. జగ్గంపేటలో.. జగ్గంపేట : కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న కాపు సత్యాగ్రహయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తుని విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు తుని మాదిరిగా అధిక సంఖ్యలో కాపు కులస్తులు హాజరైతే ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీసులను ఇప్పటి నుంచే తరలిస్తున్నారు. జగ్గంపేట సర్కిల్ స్టేష¯ŒSకు శనివారం భారీగా పోలీసులు తరలివచ్చారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులతో పాటు హెచ్‌సీలు, పీసీలు, హోమ్‌గార్డులు ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి సుమారు 150 మంది సిబ్బంది వచ్చారని, వీరిని స్థానికంగా ఉంచుతున్నట్టు ఎస్సై అలీఖా¯ŒS తెలిపారు. వీరికి సీఐ కాశీ విశ్వనాథం పలు సూచనలు ఇచ్చారు. -
పోలీసు స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
ప్రేమవంచకుని అరెస్టు చేయాలని డిమాండ్ సీఐ హామీతో విరమణ కిర్లంపూడి: ప్రేమ వివాహం చేసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని కోరుతూ గ్రామానికిS చెందిన దళిత మహిళ గుడిమెట్ల పుష్ప శుక్రవారం పోలీసు స్టేషన్ ఎదుట కిరోసిన్ డబ్బాతో బైఠాయించి ఆందోళన చేపట్టింది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం పుష్ప కువైట్‌లో పని చేస్తుండగా అక్కడే తన పక్కింట్లో డ్రైవర్‌గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన గుడిమెట్ల రామకృష్ణాధనారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అన్నవరం సత్యన్నారాయణస్వామి దేవస్థానంలో తాము వివాహం చేసుకున్నామని, ఆతర్వాత కొంత కాలం కాపురం చేసిన రామకృష్ణధనారెడ్డి అతని ఇంటికి తీసుకువెళ్లాడని తెలిపింది. అక్కడ అత్తమామల నుంచి పుష్పకు వేధింపులు ఎదురయ్యాయి. అంతే కాకుండా ఆమె సంపాదించిన ఆస్తిమొత్తం కాజేసి భర్త కూడా కాపురం చేయనని చెప్పి ఇంట్లోంచి గెంటివేశారు. దాంతో గతేడాది జూన్‌లో పుష్ప కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై ఆమె భర్త, అత్తమామలు, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాది అయినప్పటికీ పోలీసులు వారిపై చర్యలు తీసుకోలేదని ఆమె ఈ ఆందోళనకు దిగింది. న్యాయం చేసే వరకు దీక్ష విరమించబోనని ఆమె భీష్మించింది. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ పి.కాశీవిశ్వనాథం బాధితురాలితో మాట్లాడి వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించింది. ఈ ఆందోళనలో స్థానిక దళిత నాయకులు బాతు అప్పారావు, మారెళ్లి కృపానందం, గుద్ధాటి అప్పారావు, కట్టు నాగేశ్వరరావు, మూరా రాజ్‌కుమార్, గుద్ధాటి శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
'ముద్రగడకు కేంద్రం రక్షణ కల్పించాలి'
- రాజ్యసభ మాజీ సభ్యుడు వీహెచ్ విజ్ఞప్తి - కేంద్ర హోంమంత్రికి లేఖ రాసినట్లు వెల్లడి - బాబుతో పాటు కేంద్రానిదీ బాధ్యతేనన్న వీహెచ్ కిర్లంపూడి (తూర్పుగోదావరి జిల్లా) : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు ఏమైనా జరిగితే చంద్రబాబుతో పాటు కేంద్రమూ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. ఆయనకు ఎలాంటి హాని జరగముందే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడను, కుటుంబ సభ్యులను గురువారం వీహెచ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్‌రంగాను కొన్ని దుష్ట శక్తులు హత్య చేశాయన్నారు. ముద్రగడకు కూడా జరగరానిది జరిగితే కాపు జాతి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఉద్యమనేతగా ముద్రగడకు హాని జరిగే అవకాశమున్నందున భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ముద్రగడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించారన్నారు. తునిలో కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన ఘటనల్లో అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని స్వగృహంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు పాశవికమన్నారు. కాపు ఓట్లతోనే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పదవి చేపట్టాక కాపులను అణగదొక్కేందుకు చూస్తున్నారని, దీనిలో భాగంగానే ముద్రగడను అణచివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్ జాతి కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ పట్ల ప్రభుత్వం దౌర్జన్యం చేసినా కనీసం నోరు మెదపకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో కాపుల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి ఇచ్చిన జీఓ 30ని అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి రావడం కోసం కాపులను బీసీల్లో చేర్చుతానని చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలనే ముద్రగడ ఉద్యమం చేపట్టారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో ముద్రగడకు హాని తలపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముద్రగడకు రక్షణ కల్పించాలన్నారు. వీహెచ్ వెంట జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు, వైఎస్సార్ సీపీ నాయకుడు జి.వి.రమణ, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జి.వి.శ్రీరాజ్, వరిగేటి చరణ్ ఉన్నారు. -
ముద్రగడ మంచికే జరిగింది: ఉండవల్లి
కాకినాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరాన్ని పాకిస్థాన్ బోర్డర్‌లా చేశారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. దీనివల్ల కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మంచే జరిగిందని అన్నారు. దీక్ష సమయంలో ముద్రగడకు టీవీ, ఫోన్, పేపర్ లేకుండా చేశారని చెప్పారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రడగ పద్మనాభం నివాసానికి చేరుకున్న ఉండవల్లి ముద్రగడను పరామర్శించారు. అనంతరం ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. అలాగే ముద్రగడ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఉండవల్లి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబును హిట్లర్, ముసోలినితో ఉండవల్లి పోల్చారు. హిట్లర్, ముసోలిని ఉద్యమకారులను అణిచి నిర్వీర్యం చేశారని అన్నారు. చంద్రబాబు కూడా ముద్రగడను మానసికంగా బలహీనపర్చేందుకే 13 రోజుల పాటు ఆస్పత్రిలో నిర్భందించారని ఉండవల్లి తెలిపారు. -
నేడు ముద్రగడతో కాపు జేఏసీ నేతల భేటీ
కిర్లంపూడి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు గురువారం సమావేశం కానున్నారు. ముద్రగడ నివాసంలో జరిగే ఈ సమావేశంలో నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. తుని ఘటనలో కేసులు, కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేసినా ఉద్యమం నుంచి వెనకడుగు వేయబోనని, ప్రాణం ఉన్నంత వరకూ ఉద్యమిస్తానని 14 రోజుల దీక్ష విరమించిన అనంతరం బుధవారం ముద్రగడ స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబంపై ప్రభుత్వం కక్షకట్టి వేధింపులకు గురిచేసిందని, తనను ప్రపంచ ఉగ్రవాదిలా చిత్రీకరించిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
కిర్లంపూడి బయల్దేరిన ముద్రగడ పద్మనాభం
గత 14 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి బయల్దేరి వెళ్లారు. పోలీసులు తరలించే పరిస్థితి లేకపోవడంతో ముద్రగడ అనుచరులే ఆయనను ఆయన సొంత వాహనంలో తీసుకెళ్లారు. అయితే, అక్కడ కూడా ఆయన దీక్ష విరమిస్తారా లేదా అన్న విషయం ఇంతవరకు తెలియలేదు. దారిలో ఎక్కడా ఊరేగింపులు, ఇతర ప్రదర్శనలు జరగకుండా ముందుగానే మార్గం మొత్తాన్ని పోలీసులు దిగ్బంధించారు. రాజమండ్రి నుంచి కిర్లంపూడికి వెళ్లడానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. నిలకడగా ఉందని మాత్రమే చెబుతున్నారు. మంగళవారం నాడు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రోడ్డు మొత్తం ముందుగానే క్లియర్ చేసి, ర్యాలీలు జరగకుండా నేరుగా రాజమండ్రి నుంచి కిర్లంపూడి వెళ్లేలా చూస్తున్నారు. ముద్రగడ అభిమానులు కొంతమంది ఇప్పటికే కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. కిర్లంపూడిలో సైతం ఎవరినైనా ముద్రగడను కలవనిస్తారో లేదో స్పష్టంగా తెలియలేదు. -
ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ
రాజమండ్రి: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిన్న కాపు ఉద్యమ నేతను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ముద్రడగ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో శుక్రవారం తన దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యులు ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. బీపీ 150/100, షుగర్ లెవల్స్ 242 ఉన్నాయి. ప్రస్తుతానికి ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దీక్షపై దాడి
* నిరసనపై చెలరేగిన నిరంకుశత్వం * కాపు ఉద్యమ నేత ముద్రగడ బలవంతంగా అరెస్టు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి, హక్కుల పీకనొక్కి నిరంకుశంగా వ్యవహరించింది. శాంతియుతంగా దీక్ష చేపట్టిన ముద్రగడ అసలు ఎక్కడున్నారో, పోలీసులు ఏం చేస్తున్నారనే విషయం కొన్ని గంటలపాటు ప్రజలకు తెలియకుండా చేసింది. ముద్రగడ ఆమరణ దీక్ష, అనంతర పరిణామాలు ప్రజలకు తెలియకుండా సాక్షి టీవీలో ప్రసారాలను నిలిపివేయించింది. సెల్ఫోన్ల నుంచి సందేశాలు వెళ్లకుండా అడ్డుకుంది. దీక్ష కవరేజ్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది. గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ఒకరకంగా యుద్ధ వాతావారణాన్ని సృష్టించింది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ముద్రగడ పద్మనాభంను అరెస్టు చేయించింది. సర్కారు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ముద్రగడ పురుగుల మందు తాగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాజమహేంద్రవరం ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. కుటుంబ సమేతంగా దీక్ష కాపులకు రిజర్వేషన్, తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సందర్భంగా జరిగిన పరిణామాలపై నమోదైన కేసుల ఉపసంహ రణ డిమాండ్లతో ముద్రగడ గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన స్వగృహంలో కుటుంబ సమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. అప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు ముద్రగడ ఇంటి చుట్టూ మోహరించాయి. దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపేందుకు పోలీసులు ప్రయత్నించగా, కాపు నాయకులు అడ్డుకున్నారు. తుని ఘటనలో అరెస్టయిన వారిలో వెఎస్సార్సీపీ నేతలు ఉన్నారని చెబుతున్నారని, అమలాపురంలో అరెస్టయిన వారిలో టీడీపీ క్రియాశీలక కార్యకర్త దూడల మణి ఉన్నారంటూ అందుకు సంబంధించిన టీడీపీ సభ్యత్వ కరపత్రాన్ని ప్రదర్శించారు. ఈలోగా పోలీసు అధికారులు ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి వె ళ్లేందుకు మరోసారి ప్రయత్నించారు. ‘మీరు ఏదైనా మాట్లాడదలచుకుంటే ముద్రగడ కిటికీ వద్దకు వస్తారు. అక్కడే మాట్లాడండి’ అని కాపు నేతలు తేల్చిచెప్పారు. ఆత్మహత్య చేసుకుంటా.. ఇదే సమయంలో పోలీసులు, యాంటీ నక్సల్స్ స్క్వాడ్ ఒకేసారి ముద్రగడ ఇంటి వరండాలోకి రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. గదిలో తాను కూర్చున్న సోఫాలోంచి లేచి పురుగుల మందు డబ్బా పట్టుకొని కిటికీ వద్దకు వచ్చారు. ‘అడిషనల్ ఎస్పీగారూ! ఏమనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల పోలీసులు ఎవరైనా కనిపిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ‘మీకు సంబంధం లేదన్నారు కదా.. వెళ్లిపోండి. సీబీసీఐడీని రప్పించండి’ అని చెప్పి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చున్నారు. 69 కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు చూపాలి అనంతరం రాజమహేంద్రవరం నుంచి సీఐడీ డీఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో ఓ బృందం ముద్రగడ ఇంటికి చేరుకుంది. ముద్రగడను ఏ కారణంతో అరెస్టు చేయడానికి వచ్చారో చెప్పాలని కాపు నాయకులు పోలీసులను నిలదీశారు. ముద్రగడపై 69 కేసులు ఉన్నాయని హోంమంత్రి చినరాజప్ప చెబుతున్నారని, వాటి ఎఫ్ఐఆర్ కాపీలను తమకు అందజేస్తే అప్పుడు ముద్రగడ అరెస్టవుతార ని తెలిపారు. తుని ఘటనలో నమోదైన కేసుల్లో రెండింటిలో దర్యాప్తు పూర్తయిందని, దానిపైనే అరెస్ట్ చేస్తామని సీఐడీ డీఎస్పీ హరికృష్ణ చెప్పారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇస్తే అరెస్ట్‌కు ముద్రగడ సిద్ధమని కాపు నేతలు స్పష్టం చేశారు. సాంకేతికంగా కాపీలు ఇవ్వలేమని, లొంగిపోతే విచారణ సందర్భంగా అన్ని వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ చెప్పడంతో కాపు నాయకులు నిరాకరించారు. చర్చలు లేవని, వెళ్లిపోవాలని పోలీసులకు చెప్పారు. మరోవైపు శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసులను ప్రతిఘటించిన నేతలు, అనుచరులు దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఓ వైద్యబృందం గదిలోకి వెళ్లేం దుకు విఫలయత్నం చేసి, వెనుదిరిగింది. సాయంత్రం 4.20కి వందలాదిగా పోలీసులు మూకుమ్మడిగా ముద్రగడ దీక్ష చేస్తున్న గదిలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాపు నాయకులు, ముద్రగడ అనుచరులు పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీ సులు లాఠీలకు పనిచెప్పారు. దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. దాదాపు 60 మందిని అరెస్ట్ చేసి కాకినాడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్ష చేస్తున్న గది నుంచి మరో గదిలోకి వెళ్లి అప్పటికే తన వద్ద ఉంచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు తలుపులను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశిం చారు. ముద్రగడను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకొస్తుండగా ఆయన రెండో కుమారుడు గిరి అడ్డుకున్నారు. పోలీసులు ముద్రగడను బలవంతంగా అరెస్టు చేసి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ భార్య పద్మావతి, కోడలు సిరి, కుమారుడు గిరిలను మరో వాహనంలో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముద్రగడ రాజమండ్రి ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన రక్త నమునాలను వైద్యుల బృందం సేకరించి పరీక్షలు నిర్వహించింది. మెటాబాలిక్ డెఫిషియన్సీ 160 ఉన్నట్టు, ఆయన పురుగుల మందు తాగి నట్టు ఈ పరీక్షలో నిర్ధారణైంది. ముద్రగడ రక్తంలో చక్కెర స్థారుు 240 ఉందని, బీపీ 160/100 ఉందని.. వెంటనే ఆయనకు చికిత్స చేయకపోతే ఆరోగ్యం విషమించ వచ్చని వైద్యులు తెలపగా.. అందుకు ముద్రగడ ససేమిరా అంటున్నారు. -
ముద్రగడ కొడుకును తరిమికొట్టిన పోలీసులు!
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నిరాహార దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా ఆయన కొడుకును పోలీసులు తరిమికొట్టారు. ఆయన తనయుడిపై పోలీసులు లాఠీ ఝళిపిస్తున్న తాజా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనను అరెస్టు చేసేందుకు సీఐడీ పోలీసులు వెళ్లగా.. ఆయన తలుపులు వేసుకుని, లోపల పురుగుల మందు డబ్బా పట్టుకుని, అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తర్వాత పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయనను అరెస్టుచేశారు. -
తలుపులు బద్దలు కొట్టి ముద్రగడ అరెస్ట్
కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మానాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్రగడ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ అరెస్ట్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కాపు నేతలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అంబులెన్స్ లో ఆయనను తరలించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలని, తుని ఘటన నేపథ్యంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దీక్ష చేపట్టారు. రిజర్వేషన్లకు ఇచ్చిన గడువు ఆగస్టు సమీపిస్తుండటంతో వేగం పెంచాలని, కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని బుధవారం వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించారు. చంద్రబాబు సర్కారు స్పందిచకపోవడంతో ఆయన దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. సుమారు ఐదువేల మంది పోలీసులను రంగంలోకి దింపింది. ముద్రగడ నివాసంలోకి మీడియాను కూడా అనుమతించలేదు. -
ముద్రగడ ఇంటి వద్ద జర్నలిస్టుల ధర్నా
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి లోని కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో జర్నలిస్టులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసులు చర్యకు నిరసనగా గురువారం ఉదయం ముద్రగడ నివాసం వద్ద జర్నలిస్టులు ధర్నాకు దిగారు. తుని సంఘటనకు సంబంధించి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ తన ఇంటిలోనే దీక్షను ప్రారంభించారు.ఈ నేపధ్యంలో మీడియా ప్రతినిధులను ముద్రగడ ఇంటిలోకి పోలీసులు అనుమతించలేదు. కిర్లంపూడి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎర్రవరం-కిర్లంపూడి, పత్తిపాడు-కిర్లంపూడు రహదారులను మూసివేశారు. పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేశారు. -
ముద్రగడ ఇంటికి తాళం
కిర్లంపూడి: తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం నుంచి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడికి పోలీసులు తరలించారు. అయితే పోలీసు వ్యాన్ దిగేందుకు ఆయన నిరాకరించారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చేసే వరకు పోలీస్ వ్యాన్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. బలవంతంగా దించాలని చూస్తే ఇక్కడే దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ముద్రగడ అనుచరులు ఆయన ఇంటి గేట్లు మూసివేసి తాళాలు వేశారు. ఆయనకు మద్దతుగా కాపులు భారీగా కిర్లంపూడికి చేరుకుంటున్నారు. కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో భారీగా పోలీసులను మొహరించారు. అన్ని దుకాణాలు మూసేశారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలంటూ ముద్రగడ పద్మనాభం ఈ రోజు ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. -
ముద్రగడతో ముగిసిన ప్రభుత్వ చర్చలు
కిర్లంపూడి: కాపు రిజర్వేషన్ల సాధన కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు ఈ మధ్యాహ్నం ముగిశాయి. దాదాపు గంటన్నర సేపు చర్చలు కొనసాగాయి. మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు ఈ చర్చలు జరిపారు. చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. చర్చల అనంతరం వైద్యులను తన ఇంట్లోకి ముద్రగడ అనుమతించడంతో చర్చలు సఫలమైనట్టు భావిస్తున్నారు. ముద్రగడ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించినట్టు సమాచారం. తొలుత అసలు మంత్రులెవరినీ చర్చలకు పంపేది లేదని బెట్టుచేసిన సీఎం చంద్రబాబు.. పరిస్థితి చేయి దాటిపోతోందన్న విషయం గమనించి సోమవారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ప్రతినిధులను అక్కడకు పంపారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరడంతో ఉదయం నుంచి కిర్లంపూడి పరిసరాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఉదయం మరోసారి చర్చలకు వచ్చారు. కాగా ప్రభుత్వ ప్రతినిధుల ముందు ముద్రగడ మూడు ప్రతిపాదనలు పెట్టినట్టు ఆయన మద్దతుదారులు తెలిపారు. మంజునాథ కమిషన్ కు నిర్ధిష్ట కాలపరిమితి, కాపు కార్పొరేషన్ లో తాను సూచించిన వ్యక్తికి స్థానం కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. -
ముద్రగడ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభంతో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధులను పంపింది. సోమవారం టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. ముద్రగడ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇస్తే ముద్రగడ దీక్ష విరమించే అవకాశముంది. అలాగే తుని కాపుగర్జన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరనున్నారు. నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ఈ రోజు దీక్ష విరమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. -
కిర్లంపూడి బయలుదేరిన దాసరి
హైదరాబాద్ : కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి బయలుదేరారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన దాసరి నారాయణరావు సోమవారం ఉదయం కిర్లంపూడి చేరుకుంటారు. అయితే దాసరి నారాయణరావు బయలుదేరిన విషయాన్ని గమనించిన పోలీసులు ఆయన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆ క్రమంలో కృష్ణాజిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో భారీగా పోలీసులు మోహరించారు. ఆ విషయంపై దాసరికి సమాచారం అందడంతో ఆయన వాహనాన్ని మరో మార్గం ద్వారా కిర్లంపూడికి చేరనున్నారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో శాంతి భద్రతల సమస్య నెలకొందని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు ఎవరు రావద్దని పోలీసులు నాయకులతోపాటు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందులోభాగంగా పోలీసులు దాసరిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
'కుక్కల్లా ఉంటామని.. నక్కల్లా మారారు'
కిర్లంపూడి: ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఆమరణ దీక్ష విరమించేదిలేదంటున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు ఇప్పటికీ వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. పోలీసులు, వైద్యుల తీరును గర్హిస్తూ శనివారం అర్ధరాత్రి తరువాత ఇంటి తలుపులు మూసేసిన ముద్రగడ.. ఆదివారం లోపలే ఉండి తన దీక్షను కనసాగిస్తున్నారు. ముద్రగడ దంపతులకు మద్దతుగా కిర్లంపూడికి చేరుకుంటున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంటి బయటే బైఠాయించిన మహిళలు.. కాపు రిజర్వేషన్ల అంశంలో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరును నిరసించారు. ముఖ్యమంత్రి, టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'మా నాయకుడు, ఆయన భార్య మూడు రోజులుగా పచ్చిమంచినీళ్లు ముట్టుకోలేదు. వాళ్లకు మద్దతుగా మేం కూడా ఇల్లు, వాకిలి వదిలేసి ఇక్కడికొచ్చాం. ఇంకా ఎన్నిరోజులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడతాడు? మేమేం అడిగాం? ఆయన ఇచ్చిన హామీనే నెరవేర్చమంటున్నాం. ఎన్నికలప్పుడు ఎన్నెన్ని మాటలు చెప్పారు. కుక్కల్లా ప్రజలపట్ల విశ్వాసంగా ఉంటామన్నారు. ఇప్పుడేమో గుంటనక్కల్లా మారి జనాన్ని మోసం చేస్తున్నారు' అంటూ అధికార పక్షంపై ఆగ్రహాన్ని ప్రదర్శించిందోమహిళ. పోలీసులు, వైద్యుల వ్యవహారశైలి వల్లే తమ నాయకుడు ఇంటి తలుపులు మూసేయాల్సి వచ్చిందని, దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకోవడం సమంజసంకాదని ముద్రగడ అనుచరుడొకరు మీడియాతో అన్నారు. -
ముద్రగడ దీక్షకు పెరుగుతున్న మద్దతు
కిర్లంపూడి: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ముద్రగడ దీక్షకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావంగా 1500 మంది టీడీపీకి రాజీనామా చేశారు. ముద్రగడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరతామంటూ టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కాపు నేతలు, అనుచరులు ఆందోళనను ఉధృతం చేశారు. ఆమరణ దీక్షకు మద్ధతుగా జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు ఆమరణ దీక్షలకు దిగడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపునేతలు ముద్రగడ దీక్షకు మద్ధతుగా ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసనలు తెలుపుతున్నారు. ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలకు నిరాకరించడంతో వైద్యులు వారికి ఆదివారం నాడు హెల్త్ చెక్ అప్ నిర్వహించలేదు. జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాశ్ ముద్రగడ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు. వైద్యపరీక్షల కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ కాపునేత ముద్రగడ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రకాశం జిల్లా పర్చూరులో కాపు నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీని చేపట్టారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి కాపు నేతలు ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రెండో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నేతలు కావటి మనోహర్ నాయుడు, కిలారు రోశయ్య, పార్థసారధి, తదితర నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. -
ముద్రగడ దీక్షకు ఎన్ఆర్ఐల మద్దతు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఎన్ఆర్ఐలు మద్దతు తెలియజేశారు. అమెరికాలోని నార్త్ వర్జీనియాలోని కాపు ఎన్ఆర్ఐలు ముద్రగడ దీక్షకు మద్దతుగా శౌరి ప్రసాద్, వేణు పులిగుజ్జు నాయకత్వం లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయ్ గుడిసేవ, వెంకట్ చలమలశెట్టి , రవి ముళ్ళపూడి, నృపేంద్ర, పూర్ణ, జనార్దన్, రాజేష్ అంకం, రమేష్ వెజ్జు, విజయ్ కోచెర్ల తో పాటు 100 మందికి పైగా కాపులు హాజరయ్యారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశం, టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమావేశంలో చర్చించారు. కాపులకు మొదటి నుంచి వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం పైన ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో తరువాత తరాలకు రిజర్వేషన్లు అవసరమని శ్రీనివాస్ దాసరి చెప్పారు. శౌరి ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రావడానికి ముందే కాపులకు రిజర్వేషన్లు అవసరమని పూలే అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని, కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి 1000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు. విజయ్ కోచెర్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే బీసీలకు సమస్య లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మంజునాథ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో కమిషన్ నిర్ణయాన్ని కాదన్న ప్రభుత్వానికి, కాపుల రిజర్వేషన్ల విషయంలో కమిషన్ గుర్తుకు వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు, కాపులకు మధ్య వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దుష్ప్రచారాలను బీసీలు నమ్మరాదని.. బీసీలు, కాపులు సోదరుల్లా కలసి ఉంటున్నారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ డప్పు కొడుతూ సభ్యులను ఆహ్వానించగా, జోహార్ రంగ, కాపుల ఐక్యత వర్దిల్లాలి, జై ముద్రగడ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. -
వైద్య పరీక్షలకు నిరాకరించిన ముద్రగడ
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మరోసారి నిరాకరించారు. దీంతో చేసేదేం లేక వైద్యులు ముద్రగడ నివాసం నుంచి వెనుదిరిగారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మొదటగా కాపునేత ముద్రగడ ఇంటికి వెళ్లారు. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా ముద్రగడ దంపతులను ఏఎస్పీ కోరగా అందుకు వారు నిరాకరించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు తన ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారంపై కాపునేత ముద్రగడ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో భార్య పద్మావతితో కలిసి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నేడు మూడో రోజు కొనసాగుతోంది. -
'రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు?'
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ అడ్డుకున్నా దీక్ష కొనసాగిస్తామని, రిజర్వేషన్ ఫలాలు తమ జాతికి అందాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయం చెబితే తమ జాతి కూడా అలాగే ఎదుగుతుందని అన్నారు. తాను, తన భార్య ఆరోగ్యంగా ఉన్నామని, అయితే తాము అనారోగ్యంగా ఉన్నట్టు చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ మనిషి తిండిలేకుండా ఎన్ని రోజులు బతకగలడో తమను చూసి చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాసుకోవాలని ముద్రగడ పేర్కొన్నారు. -
ముద్రగడ నివాసం వద్ద ఉత్కంఠ
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్ష ఆదివారంతో మూడో రోజుకు చేరింది. తమ ఆరోగ్యపరిస్థితిపై వైద్యులు చేస్తున్న ప్రకటనలు అసత్యాలని, తాము ఆరోగ్యంగానే ఉన్నామని పేర్కొంటున్న ముద్రగడ.. వైద్యపరీక్షలకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు లోపలికి రాకుండా శనివారం రాత్రి ఇంటి తలుపులు మూసేసిన ఆయన.. ఇప్పటివరకూ లోపలే ఉండిపోయారు. దీంతో అక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ముద్రగడ దంపతులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఆదివారం ఉదయమే వైద్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లే అవకాశంలేక బయటే నిరీక్షిస్తున్నారు. దీక్ష చేపట్టి మూడు రోజులు కావడంతో దంపతుల ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. వారితోపోటు కుటుంబసభ్యులు కూడా దీక్షలో కూర్చున్న సంగతి తెలిసిందే. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం కూడా అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడికి చేరుకుంటున్నారు. -
సడలని దీక్ష...
రాత్రివేళ కిర్లంపూడిలో ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు విరమించేదిలేదు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ వైద్యపరీక్షలు జరిపించేందుకని వివరణ బాగానే ఉన్నా... పరీక్షలొద్దన్న ముద్రగడ కిర్లంపూడిలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు వెల్లువలా సంఘీభావం, జోరుగా పరామర్శలు భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు గ్రామగ్రామాన మార్మోగుతున్న ఖాళీ ప్లేట్ల చప్పుళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమవుతున్న ఉద్యమం కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అడుగుడుగునా పోలీసుల పహారా... గ్రామ జనాభాను మించిన సంఖ్యలో రక్షక భటులు... వారి బూట్ల చప్పుళ్లతో పాటు అదరగొట్టే అదిలింపులు బెదిరింపులు... పోలీసులు నిలువరిస్తున్నా ప్రాధేయపడుతూ.. బైఠాయిస్తూ.. తగవుపడుతూ ముందుకే సాగుతున్న జనం... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారంనాటి దృశ్యాలివి.... కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండోరోజుకు చేరుకుంది. ముద్రగడ దంపతులను చూడడానికి, పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘మా ప్రాణాలు పోయినా పర్లేదు. ప్రభుత్వం మా డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించేవరకు దీక్ష విరమించేది లేదు’ అని ముద్రగడ స్పష్టం చేశారు. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి ఆయన అంగీకరించలేదు. శనివారం రాత్రి ముద్రగడ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో కొద్దిసేపు కలకలం చెలరేగింది. బలవంతంగా వైద్యపరీక్షలు జరిపించేందుకు ప్రయత్నించారని, తలుపులు తెరవకపోవడంతో వెనుతిరిగారని తేలింది. మరోవైపు రాష్ర్ట వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉధృతమవుతోంది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, గుంటూరు, కర్నూలు తదితర జిల్లాలలో పలు రూపాలలో నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలలో ఖాళీ ప్లేట్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు ముద్రగడ ఇంటిని చుట్టుముట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్నారన్న ప్రచారంతో కార్యకర్తలు, కాపు ఉద్యమ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి తరలి వచ్చారు. పోలీసుల కంటే ముందుగా దీక్ష చేస్తోన్న గది దగ్గరకు వెళ్లిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ముద్రగడతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తలుపులు తీయకపోవడంతో బయట నుంచే మాట్లాడారు. దయచేసి వైద్య పరీక్షలకు సహకరించాలని జేసీ కోరారు. అందుకు ముద్రగడ నిరాకరించారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ఎలాంటి వైద్య పరీక్షలు వద్దని బదులిచ్చారు. దీంతో జేసీ వెనుదిరిగి వెళ్లారు. అనంతరం కొద్దిసేపుటికి సుమారు వందమందికి పైగా పోలీసులు ఒక్కసారిగా వరండాను చుట్టుముట్టారు. దీన్ని గుర్తించిన ముద్రగడ తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేశారు. అరగంట పాటు అక్కడే గడిపిన పోలీసులు చేసేది లేక వెనుదిరిగారు. శనివారం మద్యాహ్నం నుంచి వైద్యపరీక్షలను ముద్రగడ నిరాకరిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్య బృందంతో ఆయన మాట్లాడారు. ‘పొట్టి శ్రీరాములు చాలా రోజులు దీక్ష చేపట్టారు. నాకు ఒక్క రోజులోనే ఏమీ కాదు’ అని వైద్యులతో అన్నారు. ఆయనకు నచ్చజెప్పేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. చివరకు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరిగారు. వైద్యబృందంతో కలిసి పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు సాయంత్రం 3.30 గంటలకు ముద్రగడ వద్దకు మరోమారు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే ముద్రగడ అంగీకరించలేదు. కాగా ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోందని, 36 గంటలుగా ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, సుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులంటున్నారు. అరెస్ట్ చేయాలని కాదు.. వైద్య పరీక్షల కోసం.. ముద్రగడను అరెస్ట్ చేసేందుకు లోనికి వెళ్లలేదనీ, వైద్య పరీక్షలు జరిపించేందుకు మాత్రమే పోలీసులు లోనికి ప్రవేశించారని ఎస్పీ రవిప్రకాశ్ శనివారం రాత్రి మీడియాకు వివరణ ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారన్న విషయంలో వాస్తవం లేదన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యుల ద్వారా తెల్సుకున్న తాము వైద్య పరీక్షలు జరిపించాలనుకున్నామని వివరించారు. ఆదివారం ఉదయం వరకూ చూశాక ఆపైన వైద్య పరీక్షలు చేయించుకోకపోతే చట్టప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం రాత్రి ఒక అంబులెన్సును, తహశీల్దార్, ఓ డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. క్షీణించిన పద్మావతి ఆరోగ్యం ముద్రగడ సతీమణి పద్మావతి (56) ఆరోగ్య పరిస్థితి శనివారం క్షీణించింది. ఆమెకు గతంలో వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ఉదయం నుంచీ ఆమె పడుకునే దీక్ష కొనసాగించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆమె బరువు 74 కిలోలు, బీపీ 180/110, సుగర్ 121 ఉన్నాయి. శుక్రవారం ఆమెకు ప్రతి మూడు గంటలకోసారి మొత్తం నాలుగుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రానికి సుగర్ తగ్గుతూ వచ్చింది. రెండో రోజు ఉదయం 9 గంటలకు వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. సుగర్ 103, బీపీ 140/90 ఉందని వైద్యులు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళల సంఘీభావం ముద్రగడ దంపతులను పరామర్శించేవారి సంఖ్య శనివారం బాగా పెరిగింది. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి తరలి వచ్చి పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపారు. పరిసర గ్రామాల నుంచి వెయ్యిమందికి పైగా మహిళలు కిర్లంపూడి చేరుకున్నారు. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతిని పలుకరించి వారు కన్నీరు పెట్టుకున్నారు. కాగా కిర్లంపూడికి చెందిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పద్మావతికి సంఘీభావం తెలిపారు. అయితే ర్యాలీగా వస్తున్న మహిళలను పోలీసులు తొలుత స్థానిక ఏనుగు వీధి సెంటర్లో అడ్డగించడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. ముద్రగడ సతీమణికి ఏదైనా జరిగితే తాము ఆత్మహత్యకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఐదుగురు చొప్పున దీక్షా శిబిరం వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో మహిళలు శాంతించారు. మంత్రుల రాకపై ప్రచారం దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కిర్లంపూడి వస్తున్నారని ఉదయం నుంచీ ప్రచారం జరిగింది. బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం దీనిని ధ్రువీకరించారు. అయితే సాయంత్రం 7 గంటల వరకూ వారు రాలేదు. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న కాపు నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. -
మేము సైతం
కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో భోజనం మానేసి ఖాళీ పళ్లాలను గరిటెలతో ధ్వనింపజేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్న కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రి, మనవరాలు భాగ్యశ్రీ. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నానుడి. ఒక మనిషి విజయం వెనుక ఒక కుటుంబం ఉంటుందనడానికి కిర్లంపూడి సాక్షి. ఇదే విషయాన్ని అక్కడంతా ఇప్పుడు ‘కంచం’కంఠంతో చెబుతున్నారు. ఒకరు చేస్తే తపస్సు... ఇద్దరు చేస్తే దీక్ష... ఒక కుటుంబం అంతా చేస్తే అదో యజ్ఞం! అలాంటి యజ్ఞంలో తమ వంతు సామాజిక బాధ్యతను పోషిస్తున్నారు సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు. కాపులకు రిజర్వేషన్లు, సంక్షేమ నిధి తదితర డిమాండ్లతో శుక్రవారం సతీమణి సహా నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. అటువంటి అకుంఠిత దీక్షాదక్షుని వెనుక ప్రజాకుటుంబమే కాదు సొంత కుటుంబం వెన్నుదన్నుగా ఉంది. వారిలో కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రిలది కీలకపాత్ర. దీక్ష ప్రారంభమైన ఫిబ్రవరి 5న పద్మనాభం దంపతుల దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తమ ఇంటికి తరలివచ్చిన కార్యకర్తలతో వీరిద్దరూ కలిసి వారు నినాదాలు చేశారు. ఇంటి పెద్దల దీక్షలో భాగంగా మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ వినూత్న ఉద్యమ ధ్వనికి నాంది పలికారు. ఆ సందర్భంగా ఆ ఫ్యామిలీని ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది. నాన్న ఏం చేసినా ప్రజల కోసమే ‘నాన్న ఏం చేసినా ప్రజల కోసమే. పట్టుదల చాలా ఎక్కువ. ఏ పని తలపెట్టినా దానిని విజయవంతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. నేను చిన్నప్పటి నుంచి నాన్నలో గమనించిన ముఖ్య లక్షణం ఇదే..’ అని చెప్పారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ‘నాన్నకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. నా అసలు పేరు సత్యవతి నానమ్మ పేరే. నానమ్మను నాలో చూసుకుంటారు. నాకూ నాన్న అంటే అంతే ఇష్టం. రాజకీయాల్లో ఎలాంటి టెన్షన్లు ఉన్నా ఇంట్లో మాత్రం మాతో సరదాగానే ఉంటారు. పిల్లలతో హాయిగా ఆడుకుంటారు. కానీ ఉద్యమాలు వస్తే మాత్రం సీరియస్ అయిపోతూంటారు. నేను చాలా దగ్గర్నుంచి చూస్తున్నా. గతంలో నాన్న చేపట్టిన ఐదు ఉద్యమాలూ గమనించా. కానీ నిరాహార దీక్ష అనేటప్పటికీ నా మనస్సులో ఆందోళన ఉంటుంది. నాన్నతోపాటు అమ్మ కూడా దీక్ష చేస్తుంది. గతంలోనే ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. మళ్లీ ఇప్పుడు నాన్నతోపాటు దీక్షకు కూర్చుంది. మాకు మాత్రం అమ్మానాన్న ఆరోగ్యం ఏమవుతుందోననే బెంగ ఉంది. అయినా, ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని కోసం వారు దీక్ష చేస్తూంటే వారి గొప్పతనం ఏమిటో మాకు అర్థమవుతోంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా నాన్న పని చేశారు. ఏ రోజూ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఆ మనోధైర్యంతోనే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటారు. అనుకున్నది సాధించేవరకూ వెనక్కు తగ్గరు. కాపుల కోసం నాన్న చేసిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే దీక్ష విరమిస్తారు. ఆయన ఆరోగ్యం తిరిగి కోలుకొనే వరకూ కుటుంబ సభ్యులమంతా కంటికి రెప్పలా చూసుకుంటాం’ అని చెప్పారు క్రాంతి. అంతే కాదు, ‘నాన్న దీక్ష విజ యవంతమై, ఆయన ఆరోగ్యం కుదు టపడ్డాక నాన్నకు ఎంతో ఇష్టమైన బిర్యానీ, చికెన్-65 నేనే స్వయంగా చేసిపెడతా’ అని చెప్పారు క్రాంతి. మాకు చాలా గర్వంగా ఉంది నేను పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా తునిలోనే. ముద్రగడ పద్మనాభంగారి గురించి నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో చాలా విషయాలు మాట్లాడుకునేవారు. ఆయన ఇంటికే కోడలుగా వెళ్తానని ఊహించలేదు. నాలుగేళ్ల క్రితం కిర్లంపూడిలో అత్తారింట అడుగుపెట్టా. మా మామగారు నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. చాలా గౌరవిస్తారు. ఈ విషయంలో మేమంతా చాలా అదృష్టవంతులం’ అని అన్నారు పద్మనాభం చిన్న కుమారుడు గిరి భార్య త్రినేత్రి. ‘మా మామగారు ప్రజల కోసం ఇలాంటి ఉద్యమం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్లలో అత్తామామల దీక్ష చూడటం నాకిదే తొలిసారి. వారి ఆరోగ్యం గురించి మాకందరికీ దిగులు ఉంది. కానీ ప్రజల శ్రేయస్సు కోసం దీక్ష చేస్తున్నవారికి ఏమీ కాదనే నమ్మకం మాకందరికీ ఉంది’ అని చెప్పారు. - అల్లు సూరిబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి. పక్కన కోడలు త్రినేత్రి, మనుమరాలు భాగ్యశ్రీ, కుమార్తె క్రాంతి. ఊరంతా ఏకతాటిపై! దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులు అన్నం ముట్టలేదని ఊరంతా వంటావార్పు మాని సంఘీభావం తెలుపుతున్నారు. ముద్రగడ నిరసన ఏదైనా అది వారికి సమ్మతమే. అందుకే కులాలకు అతీతంగా కిర్లంపూడిలో ఆ కుటుంబానికి మద్దతు లభిస్తోంది. రాజకీయంగా మహిళలకు ప్రోత్సాహం... మహిళలను రాజకీయాల్లో పద్మనాభంగారు ప్రోత్సహిస్తారనడానికి నేనే ఉదాహరణ. ఇరవయేళ్ల క్రితమే నేను జగపతినగరం గ్రామ పంచాయతీకి సర్పంచి (1995-2000) అయ్యా. కిర్లంపూడి ఈ పంచాయతీలో భాగం. మేము బీసీల్లోని గవర కులస్థులం. కానీ గ్రామంలో పద్మనాభం గారి అభిమానులుగా అందరూ ఒకటిగా ఉంటాం. వారి కుటుంబం దీక్షలో ఉండటం వల్ల పంచాయతీలోని 16 వేల మంది ఇళ్లల్లో వంటావార్పూ మానేసి మద్దతు పలికాం. - రాపేటి వర్ధనమ్మ, మాజీ సర్పంచి, జగపతినగరం వైఎస్‌తో మాట్లాడి రుణమాఫీ చేయించారు పద్మనాభంగారి మాటతో నా భర్త రత్నాజీ కిర్లంపూడి పీఏసీఎస్ అధ్యక్షుడిగా నాలుగు దఫాలు ఏకగ్రీవంగా పనిచేశారు. మూడుసార్లు కరువొచ్చి పీఏసీఎస్‌లో తీసుకున్న పంట రుణాలు రైతులు చెల్లించలేకపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ ప్రకటించినప్పుడు పద్మనాభంగారు మాట్లాడి మా గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేశారు. నా భర్త అనారోగ్యంతో చనిపోయిన తర్వాత నన్ను పీఏసీఎస్ అధ్యక్షురాలిగా పద్మనాభంగారే ఏకగ్రీవం చేయించారు. - ఆడారి సూర్యకుమారి, అధ్యక్షురాలు, కిర్లంపూడి పీఏసీఎస్ శుభకార్యం కార్డులో పద్మనాభంగారి పేరు మా గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా మేము వెళ్లేది పద్మనాభంగారి ఇంటికే. ఆయన వీలును బట్టి తేదీ నిర్ణయించుకుంటాం. పెళ్లికార్డులోనూ పద్మనాభంగారి ఆశీస్సులతో... అని పేరు వేసుకుంటాం. ఏ ఇంట్లో శుభకార్యమైనా దంపతులిద్దరూ వస్తారు. అలాంటివారు ఇప్పుడు దీక్షలో కూర్చున్నారంటే వారి ఆరోగ్యంపై మేమంతా దిగులు చెందుతున్నాం. మా గురించి ఆయన చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మహిళలమంతా నిరసన గళమెత్తుతాం. - చల్లా సత్యవతి, గృహిణి, కిర్లంపూడి మాది ఆకలి పోరాటం పద్మనాభంగారి దీక్ష మాలాంటి విద్యార్థుల కోసం చేస్తున్నారు. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఆర్థిక స్థోమత సరిపోక ఉన్నత విద్యకు, ఉపకార వేతనాలకు ఎంతోమంది దూరమవుతున్నారు. భారీగా రుసుం చెల్లించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా కటాఫ్ మార్కుల వ్యత్యాసంతో అవకాశాలు కోల్పోతున్నాం. అందుకే పద్మనాభంగారి దీక్షకు ఒక్క కిర్లంపూడిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉంటుంది. ఎందుకంటే మాది ఆకలి పోరాటం. మాకు ఉద్యోగాలు కావాలి. ఉపాధి కావాలి. - వింజరపు శాంతి, ఎంఎస్సీ, బీఈడీ విద్యార్థిని, కిర్లంపూడి పద్మావతి గారి ఆరోగ్యంపైనే ఆందోళన పద్మనాభంగారి భార్య పద్మావతి గారు చాన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె ఎక్కువసేపు దీక్షలో కూర్చోవడం మంచిది కాదని చెప్పాను. షుగర్ లెవెల్స్ కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. పదిహేనేళ్లుగా పద్మనాభంగారి కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉంది. గ్రామంలో మేము ఆసుపత్రి నిర్మించాలనే మా ఆలోచన చెప్పిన వెంటనే ఆయన ఎంతగానే సంతోషించారు. ఏ అవసరం వచ్చినా తన సహాయం ఉంటుందని చెప్పడం మాకు కొండంత అండ. - డాక్టర్ ఏబీ జ్యోతిర్మయి, గైనకాలజిస్టు, కిర్లంపూడి అన్నివిధాలుగా అండదండలు మేము ఏ పని చేసినా పద్మనాభంగారి అండదండలు ఉంటాయి. అంగన్వాడీ వర్కర్లకు జీతం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారు. ఆ జీవో విడుదల కోసమే విజయవాడ వెళ్లాం. అందుకని మా ఉద్యోగాలు తీసేస్తారని వార్తలొస్తే మేము పద్మనాభంగారి దృష్టికి తీసుకెళ్లాం. మాకు తండ్రిలా ధైర్యం చెప్పారు. మేము కనిపిస్తే చాలు... అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బాగోగులు, సరుకులు మంజూరు గురించి అడిగి తెలుసుకుంటారు. - చింతపల్లి రత్నం, అంగన్వాడీ వర్కర్, కిర్లంపూడి -
'ముద్రగడ షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి'
కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు. శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలను వెల్లడించారు. ఆయనకు వయసు దృష్ట్యా షుగర్ తగ్గుతోందని, ఇంకా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విశాఖ నుంచి, రాజమండ్రి నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి చూస్తారని అన్నారు. మొదటి రోజు కాబట్టి ఇప్పటికి కీటోన్ బాడీస్ రాలేదని, రేపటికి కనిపించే ప్రమాదం ఉందని చెప్పారు. వివరాలు.. బీపీ 160/100 పల్స్ 82 షుగర్ 178 బరువు 86 కిలోలు -
12 గంటలు దాటిన ముద్రగడ ఆమరణ దీక్ష
కిర్లంపూడి: కాపులను బీసీల జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 12గంటలు దాటింది. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతి షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. కాపులతో పాటు ముద్రగడ అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడి వైపు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవి చేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
ముద్రగడ షుగర్ లెవల్స్ డౌన్!
కిర్లంపూడి: ఆమరణ దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతులకు డాక్టర్లు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ పద్మనాభానికి షుగర్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ నేత చేపట్టిన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేతలు, ప్రజల నుంచి విశేషమైన మద్ధతు లభిస్తోంది. గరిటెలతో ఖాళీ కంచాలు మోగిస్తూ శబ్ధం చేస్తూ ముద్రగడ దంపతులు, కుటుంబసభ్యులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు 13 జిల్లాల నుంచి మంచి స్పందన వస్తోంది. కృష్ణా జిల్లాలో ముద్రగడ దీక్షకు మద్దతుగా కలిదిండిలో వివేకానంద ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైకలూరు ఇంఛార్జ్ డీఎన్ఆర్ ముద్రగడ ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేబీరోడ్డులో వంగవీటి రంగా విగ్రహం వద్ద ఖాళీ కంచాలతో మద్దతుదారులు నిరసన చేస్తున్నారు. -
ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు
కాకినాడ: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 160/110, షుగర్ లెవల్స్ 178 ఉండగా.. ప్రస్తుతం ఆయన బరువు 86 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 180/110, షుగర్ లెవల్స్ 120గా ఉండగా.. ఆమె బరువు 78 కేజీలుగా వైద్యులు నిర్ధారించారు. నేటి ఉదయం 9 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి కాకినాడ సమీపంలోని కిర్లంపుడిలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించిన విషయం విదితమే. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆయన ఇంటిగేట్లను పోలీసులు మూసివేశారు. అయితే ఆయన మద్ధతుదారులు మాత్రం తమ నేత ఇంటి గేట్లు తెరిచేందుకు యత్నిస్తున్నారు. -
ముద్రగడ ఇంటి గేట్లు మూసివేత
కిర్లంపూడి: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి గేట్లను శుక్రవారం ఉదయం పోలీసులు మూసివేశారు. తన భార్య పద్మావతితో కలిసి ముద్రగడ ఆమరణదీక్షకు దిగిన వెంటనే పోలీసులు ఆయన నివాసం ద్వారాలను మూసేశారు. గేట్లు తెరిచేందుకు ముద్రగడ అనుచరులు ప్రయత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గేట్లు తెరిచే ఉంచాలని పోలీసులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ కిర్లంపూడి చేరుకుని పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడితో పాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా పోలీసులను మొహరించారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించేవరకు తన దీక్ష కొనసాగుతుందని ముద్రగడ స్పష్టం చేశారు. భావోద్రేకాలకు లోనుకావొద్దని, అవాంఛనీయ సంఘటనలకు చోటివొద్దని మద్దతుదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఇక్కడికి రావద్దు.. ఇబ్బందులు పడొద్దు
- కాపు రిజర్వేషన్ల కోసం కిర్లంపూడిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరశన - దీక్షా స్థలికి రావద్దంటూ అభిమానులకు పద్మనాభం పిలుపు - తూర్పుగోదావరి జిల్లా అంతటా 144 సెక్షన్.. భారీగా మోహరించిన బలగాలు కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. స్వగ్రామం కిర్లంపూడిలోని తమ నివాసంలో దీక్షకు కూర్చున్న ముద్రగడ దంపతులకు రాష్ట్రం నలుమూలల నుంచి సంఘీభావం లభిస్తోంది. అభిమానులు పెద్ద ఎత్తున కిర్లంపూడివైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో తన కోసం ఎవ్వరూ కిర్లంపూడికి రావద్దని, వచ్చి, బ్యాడ్ ఎలిమెంట్స్ చేతిలోపడి ఇబ్బందులు పడొద్దని ముద్రగడ మనవిచేశారు. దీక్ష దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అంతటా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇతరులెవరికీ జిల్లాలోకి ప్రవేశం లేదని ఎస్సీ ప్రకటించారు. దీక్ష ప్రారంభానికి కొద్ది సేపటి ముందు ముద్రగడ మీడియాతో మాట్లాడారు. కాపు జాతి కోసం చేస్తోన్న న్యాయమైన దీక్షకు మద్దతు పలకాలని మీడియా ద్వారా ముద్రగడ ప్రజలకు విన్నవించుకున్నారు. తాను ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని కాపులు ఎక్కడికక్కడే నిరసన తెలియజేయాలని, మధ్యాహ్న భోజనం మానేసి సీఎంకు వినిపించేలా కంచాలపై గరిటెలతో చప్పుడుచేయాలని ఆయన కోరారు. 'నాకు మద్దతు పలికేందుకు సోదరులెవరూ ఇక్కడికి(కిర్లంపూడికి) రావద్దు. మన పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు బ్యాడ్ ఎలిమెంట్స్(దుష్టశక్తులు) ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడికొచ్చి, వాటి చేతుల్లోపడి ఇబ్బందులు పడొద్దు'అని ముద్రగడ తోటి కాపులకు మనవిచేశారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, ఒంటరిగానైనాసరే దీక్ష చేపడతానని శుక్రవారం ఉదయం తన ఇంటికి వచ్చిన పోలీసులకు పద్మనాభం స్పష్టం చేశారు. జాతికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆపబోనని, శాంతియుతంగానే నిరసశన కొనసాగుతుందని స్పష్టం చేసిన ఆయన.. అసాంఘిక శక్తుల ప్రభావానికి లోనుకావద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని అభిమానులకు పిలుపునిచ్చారు. -
'కాపులను ఎగతాళి చేస్తే ఊరుకోం'
కిర్లంపూడి(తూర్పుగోదావరి): కాపు కులస్తులను ఎగతాళి చేస్తే చూస్తూ ఊరుకోబోమని, తమ ఆగ్రహానికి గురైతే ముఖ్యమంత్రులు కుర్చీ దిగిపోవాల్సి వస్తుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు యువత, విద్యార్థి నాయకులు ర్యాలీగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుసుకున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ భావితరాల కోసం, చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను సాధించుకోవడం కోసం కాపు యువత నడుం బిగించాలన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలో, బహిరంగ సభల్లో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా కాపులను బీసీల జాబితాలో కలపడమే కాక కాపుల అభివృద్ధికి ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకూ వారి అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న కాపులను సమీకరించి ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన హామీలను అమలు పరిచే వరకు దశలవారీగా నిరంతర పోరాటం చేస్తామన్నారు. డిసెంబర్ చివరిలో లేదా సంక్రాంతి వెళ్లాక ప్రతి జిల్లాలో పర్యటించి, కాపులను సమీకరించి చైతన్య పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఎంపీ తోట అవమానించారంటూ దళితుల ఆందోళన
కిర్లంపూడి :కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పలువురు దళితులు కాకినాడ ఎంపీ తోట నరసింహం తమను అవమానపరిచారంటూ శనివారం రాత్రి స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఎంపీ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. స్థానిక దళితులు పూల రాజుతోపాటు పలువురు దళితులు, మహిళల కథనం ప్రకారం.. నాలుగేళ్ల క్రితం అప్పటి మంత్రి, ప్రస్తుత ఎంపీ తోట నరసింహం కమ్యూనిటీహాలుకు నిధులు ఇచ్చారు. వీటితో తోట అనుచరులు భవన నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా విడిచిపెట్టారు. ఎన్నికల అనంతరం కూడా దీని నిర్మాణంపై దృష్టిపెట్టకపోవడంతో గ్రామవాసీ, మండల జెడ్పీటీసీ సభ్యుడు వీరంరెడ్డి కాశీబాబును దళితులు ఆశ్రయించారు. దీంతో గత మార్చి 5న కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 3 లక్షల జెడ్పీ నిధులు కేటాయించారు. అయితే వాటితో నిర్మాణం చేయకుండా అధికారులను ఆదేశించి ఎంపీ తోట ఆటంకం కలిగించారని దళితులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 13న హడావుడిగా రూ. 2 లక్షల ఎంపీ నిధులు కేటాయించి శనివారం సాయంత్రం ఎంపీ తోట కమ్యూనిటీహాలు వద్ద కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు. నాలుగేళ్లుగా కమ్యూనిటీహాలును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న ఎంపీ కారును స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు కాశీబాబు కల్పించుకుని దళితులను వారించడంతో ఎంపీ తోట అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రాజుతోపాటు దళితులు గండే సూర్యాకాంతం, గుండే మణిబాబు, పూల నాగేశ్వరరావు, దాసరి కొండబాబు, ముసలయ్య, గణసతి. గుండే కృప, దాసరి బుజ్జమ్మ, సింహాచలం, గుండే రాజబాబు, చెరుగుల అప్పారావు, చక్రరరావు, వెంకటలక్ష్మి తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. -
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
-
కొనసాగుతున్న రహదారుల దిగ్బంధం
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా రెండోరోజు కూడా వైఎస్ఆర్ సీపీ రహదారుల దిగ్బంధం కొనసాగుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ రహదారులను దిగ్బందిస్తున్నారు. నేతలు నిన్న పోలీసుల ఒత్తిళ్లు అరెస్టులకు తలొగ్గకుండా రహదారులను దిగ్భందించిన బెజవాడ వాసులు గురువారం కూడా కదం తొక్కారు. విభజన ప్రకటన ఆగే వరకు రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై ఇబ్రహీం పట్నం వద్ద భైఠాయించారు. దీంతో హైదరాబాద్ విజయవాడల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఝాం అయింది. విద్యార్థులు, మహిళలు కూడా స్వచ్ఛందంగా దిగ్భందనంలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం క్రిష్టవరం టోల్‌ప్లాజా వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే జిల్లాలో దిండి-చించినాడ బ్రిడ్జిపై మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, బొంతు రాజేశ్వరరావు, మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్ 216ను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు దిగ్బంధించారు. దాంతో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే నగరంలోని ఓఎన్జీసీ రిఫైనరీ ఎదుట వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో దిగ్బంధం చేశారు. ముమ్మడివరంలో గుత్తుల సాయి ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధంతో ట్రాఫిక్ స్తంభించింది. -
తూర్పులో భారీ వర్షాలు
-
తూర్పులో భారీ వర్షాలు: డ్రైనేజ్‌లో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
తూర్పు గోదావరి జిల్లాలో గత ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్సాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జనజీవనం దాదాపుగా అస్తవ్యస్తమైంది. అంతేకాకుండా జిల్లాలోని నదులు, వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. కిర్లంపూడి మండలం జగపతి నగరంలో నిన్న సాయంత్రం నాలుగేళ్ల బాలుడు సంతోష్ డ్రైనేజ్‌లో ప్రమాదవశాత్తు పడి,కొట్టుకుపోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సంతోష్ మృతదేహన్ని శుక్రవారం ఉదయం కనుగొన్నారు. వర్షాల కారణంగా జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైనాయి. పిఠాపురం, పెద్దపురం తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. అలాగే జిల్లాలోని పంపా, తాండవ నదుల్లోని నీటి మట్టం శుక్రవారం ఉదయం నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంది.అయితే ఆ నదుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తే లక్షలాది ఎకరాలు నీట మునుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పై లిన్ తుపాన్ వల్ల కంటే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో తమకు అధికంగా నష్టం వాటిల్లిందని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
హైవే దిగ్బంధించి ఆందోళన
కిర్లంపూడి, న్యూస్‌లైన్ : కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద కిర్లంపూడి మండలం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీ య రహదారి దిగ్బంధం, మహాధర్నా విజయవంతమైంది. నాలుగు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించి రోడ్డుపైనే బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంపీడీఓ కేఎన్వీ ప్రసాదరావు, తహశీల్దార్ ఎస్ పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తోట నరసింహం, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుతో పాల్గొన్నారు. ఉద్యమకారులను ఉత్తేజ పరిచేందుకు జేఏసీ ఏర్పాటు చేసిన కోలాటం, తప్పెటగుళ్లు, గరగ నృత్యం, కొమ్ము డ్యాన్స్‌లు, చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. మంత్రి నరసింహం మాట్లాడుతూ విభజన జరిగితే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్య, తాగునీటి సమస్యలు మొదలవుతాయన్నారు. సీమాంధ్ర ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్రలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తే కేంద్రం దిగివస్తుందన్నారు.సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలే నాయకులని అన్నారు. జీతాలు లేకపోయినా సమైక్యాంధ్రే లక్ష్యంగా ఉద్యోగుల ఆందోళన అభినందనీయమన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించినప్పుడే సమైక్యాంధ్రను కాపాడుకోగలమన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి జ్యోతుల నెహ్రూ, మంత్రి తోట నరసింహం సారథ్యంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి పని చేయడానికి సిద్ధమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. బహిరంగ సభకు హాజరైన సమైక్యవాదులకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా తహశీల్దార్ ఎస్.పోతురాజు, ఎంపీడీఓ ప్రసాదరావు ఏర్పాట్లు చేశారు. తోట వాణి, జ్యోతుల నవీన్ కుమార్, పంతం నానాజీ, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, మంతిన నీలాద్రిరాజు, మారిశెట్టి వీరభద్రరావు, జేఏసీ నాయకులు పెంట కోట నాగబాబు, ఎస్ఎస్ రామ్‌కుమార్, తోట గోపి, పాటంశెట్టి సూర్యచంద్ర, చదలవాడ బాబి, కపిలవాయి సూరిబాబు, కంచుమర్తి రాఘవ, చాగంటి వీరబాబు, జంపన సీతారామ చంద్రవర్మ, బస్వా వీరబాబు, కపిలవాయి సూరిబాబు, గందం మహేశ్వరరావు, వి.అప్పారావు, ఉపాధ్యాయులు సీవీ కృష్ణమూర్తి, రాగం పాదాలు, జగ్గంపేట తహశీల్దార్ బాల సుబ్రహ్మణ్యం, ఉద్యోగ జేఏసీ సంఘం నాయకుడు టీజే స్వామి, కొత్త కొండబాబు పాల్గొన్నారు.