సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం మంచిది కాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు హితవు పలికారు. ఇటువంటి పరిస్థితి భారతదేశంలోనే మొదటిసారి చూస్తున్నా అంటూ ఆయన వ్యవహారశైలిని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి.. అవకాశం ఉంటే సలహాలు ఇవ్వాలని సూచించారు.(చదవండి: ‘పంచాయతీ’: ఒట్టు.. ఇదీ లోగుట్టు!)
అదే విధంగా అదృశ్య శక్తి ఎవరో వెనక ఉండి నిమ్మగడ్డను నడిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ చేస్తున్నదాడిని మీడియా ద్వారా చూస్తున్నానని.. రాష్ట్రంలో పరిస్థితిని బట్టి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయాలే తప్ప రాజకీయ నాయకులలాగా పట్టుదలకు పోవడం మంచిగా లేదన్నారు. రచ్చ చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. (చదవండి: నేడు సుప్రీంకోర్టులో ‘పంచాయతీ’ )
Comments
Please login to add a commentAdd a comment