
సాక్షి, కాకినాడ(కిర్లంపూడి): దళిత నాయకులను దళితులే ఎన్నుకొనే అవకాశం కల్పించాలని సీఎం వైఎస్ జగన్‌కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో శుక్రవారం లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు.
ఎవరి ప్రమేయం లేకుండా మెరుగైన పద్ధతులలో దళితుల పదవులను దళితులే ఓటు వేసుకునే అవకాశం కల్పించి వారి నాయకులను వారే ఎన్నుకొనేలా ఆలోచన చేయాలని పేర్కొన్నారు. ఇతర వర్గాలు నివసించే వీధులలో ఒకటి నుంచి ఐదు దళిత కుటుంబాలు నివసిస్తున్నాయని, దళితులకు సంబంధించిన లక్షలాది రూపాయల గ్రాంట్‌లను అక్కడే ఖర్చు చేయడం వలన ఎక్కువ జనాభా ఉన్న దళితులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: (ఆర్టీసీలో ఆఫర్లు!.. నలుగురు ప్రయాణికులు ఒకేసారి టికెట్ తీసుకుంటే..)
Comments
Please login to add a commentAdd a comment