కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మరోసారి నిరాకరించారు.
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మరోసారి నిరాకరించారు. దీంతో చేసేదేం లేక వైద్యులు ముద్రగడ నివాసం నుంచి వెనుదిరిగారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మొదటగా కాపునేత ముద్రగడ ఇంటికి వెళ్లారు. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా ముద్రగడ దంపతులను ఏఎస్పీ కోరగా అందుకు వారు నిరాకరించారు.
డాక్టర్లు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు తన ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారంపై కాపునేత ముద్రగడ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో భార్య పద్మావతితో కలిసి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నేడు మూడో రోజు కొనసాగుతోంది.